అన్వేషించండి

chinni serial today march 21st: చిన్ని సీరియల్: మ్యాడీ కళ్లు తెరుస్తాడా! హాస్పిటల్‌లో చిన్ని, నాగవల్లి మధ్య ఏం జరిగింది?

chinni serial today episode march 21st నీ వల్లే మ్యాడీకి ఈ పరిస్థితి వచ్చింది అని నాగవల్లి చిన్ని మీద సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ కండీషన్ తలచుకొని నాగవల్లి చాలా ఏడుస్తుంది. అందరూ నాగవల్లికి మ్యాడీకి ఏం కాదు అని ధైర్యం చెప్తారు. నాగవల్లి చిన్ని దగ్గరకు వెళ్లి.. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా.. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా.. నా బిడ్డ అలా చావుబతుకుల మధ్య కొట్టు మిట్లాడుతుంటే నీ కళ్లు చల్లబడ్డాయా అని అడుగుతుంది. అత్తయ్యా అలా అంటారేంటి ఏం జరిగింది అంటే అని చిన్ని అంటే ఏం చెప్పొద్దు.. నాకు అంతా కనిపిస్తుంది. మొత్తం నీ వల్లే.. ఏ క్షణంలో నువ్వు వాడి జీవితంలో అడుగుపెట్టావో అప్పుడు నుంచి వాడికి కీడు జరుగుతుంది. అది సరిపోదు అన్నట్లు ఇప్పుడు వాడి ప్రాణానికే ఎసరు పెట్టావ్.. అసలు నీకు సిగ్గు ఉందా.. మ్యాడీ నీ మెడ పట్టుకొని గెంటేసినా కూడా ఏ ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చావ్... అని తిడుతుంది. 

నాగవల్లి మాటలకు చిన్ని ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. నాగవల్లి కోపంగా నువ్వు వాడి జీవితంలోకి ఎందుకు వచ్చావో అర్థమైంది.. వాడి తల్లిని నీ తల్లి చంపేసింది.. వాడిని నువ్వు చంపేయాలి అని వచ్చావ్.. అందుకే వాడికి ఇలా జరిగింది.. నీ వల్లే వాడు ఇలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు.. ఇంకా నిన్ను క్షమించలేను.. ఇంకా నిన్ను భరించలేను., మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో.. నీ ముఖం మళ్లీ మాకు కనిపించనంత దూరం వెళ్లిపో అని నాగవల్లి అంటుంది. మాటలతో చెప్తే అర్థం కావడం లేదా.. మెడ పట్టుకొని గెంటేయాలా అని నాగవల్లి అంటుంది. 

చిన్ని ఏడుస్తూ ఎక్కడికి వెళ్లాలి అత్తయ్యా.. నా భర్త చావు బతుకులతో పోరాడుతుంటే నేను ఎక్కడికి వెళ్తాను.. ఏ భార్య అయినా భర్త అలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్తుందా అని అడుగుతుంది. నువ్వు వాడి భార్యవి కాదు.. వాడు నీ భర్త కాదు అని నాగవల్లి అంటే కాదు అని మీరు చెప్పినా అవును అని ఈ తాళి చెప్తుంది అని తాళి చూపిస్తుంది. ఎవరు అవును అన్నా ఎవరు కాదు అన్నా నేను మ్యాడీ భార్యాభర్తలమే.. నా భర్తని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్లను.. మీ అబ్బాయి మీద మీకు ఎంత హక్కు ఉందో నా భర్త మీద నాకు అంతే హక్కు ఉంది.. నేను ఇక్కడే ఉంటాను నా భర్తని చూసుకుంటాను.. ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని అంటుంది. ఛీ కొట్టి నాగవల్లి పక్కకి వెళ్లిపోతుంది. 

చిన్ని తల్లిదండ్రులు కూడా హాస్పిటల్‌కి వస్తారు. చిన్ని వాళ్లని హత్తుకొని ఏడుస్తుంది. మ్యాడీ బాబుకి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని వాళ్లు మధుకి ధైర్యం చెప్తారు. డాక్టర్ ఏం పర్లేదు అని చెప్పారని చిన్ని అంటే లోహిత కోపంగా డాక్టర్ పర్లేదు అని చెప్పారా.. కండీషన్ సీరియస్‌ అని చెప్పారా.. ఇప్పటికీ నీ బుద్ధి మార్చుకోవా.. మ్యాడీ చావు బతుకుల మధ్య ఉన్న.. ఇలా చెప్తున్నావ్.. ఇలాంటి శని గ్రహం వల్ల అలాగే జరుగుతుంది. చిన్ని మ్యాడీ జీవితంలోకి రావడం వెనక నీ మీ పాత్ర కూడా ఉంది కదా.. 30 రోజుల నాటకం అని మీరే పంపారు కదా అని అంటుంది. దానికి చిన్ని వాళ్లు పంపితే రాలేదు., మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నా భర్తని దక్కించుకోవడానికి వచ్చా అని అంటుంది. లోహిత గొడవ పడుతుంటే దేవా ఆపి ఏంటి నువ్వు వాళ్ల స్థాయికి దిగజారి వాళ్లతో గొడవ పడుతున్నావ్.. మ్యాడీ పరిస్థితి ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అని కోప్పడతాడు. లోహిత సారీ చెప్పి సైలెంట్ అయిపోతుంది. 

బాలరాజుకి ఆఫ్ టికెట్ మ్యాడీ గురించి చెప్తే బాలరాజు హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు. వద్దు అని ఆఫ్ టికెట్ ఆపుతాడు. నాగవల్లి, దేవా అక్కడే ఉన్నారని చెప్తాడు. చిన్నికి ఫోన్ చేస్తూ ఉండురా అని అంటే తనే చేస్తాను అని చెప్పిందని అంటాడు. ఈసారి చిన్ని ఫోన్ చేస్తే నాకు చెప్పరా నేను మాట్లాడుతా అని బాలరాజు అంటాడు. మరోవైపు డాక్టర్ వచ్చి మ్యాడీ కళ్లు తెరిచాడు అని చెప్తారు. నాగవల్లి, దేవా మ్యాడీని చూడటానికి వెళ్తారు. మ్యాడీ కళ్లు తెరిచి చిన్ని ఎలా ఉంది అని అడుగుతాడు. తనకి ఎలా ఉంది అంటావేంట్రా తనకేమైంది అని నాగవల్లి అడిగితే.. యాక్సిడెంట్ అయింది తనకే కదా.. ఆ బండి చిన్నిని గుద్దబోతుంటే నేను తనని కాపాడాను అని నాగవల్లికి జరిగింది చెప్తాడు. చిన్నిని కాపాడటం కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావా అని నాగవల్లి అడిగితే శత్రువు అయినా సరే ప్రాణాల మీదకు వస్తే కాపాడాలి కదా మమ్మీ అని అంటాడు. మిమల్ని చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది.. చిన్నిని కల్లారా అని చూడాలి అని అంటాడు. దాంతో నాగవల్లి నర్సుతో చిన్నిని పిలవమని అంటుంది. నర్సు చిన్నిని తీసుకెళ్తుంది. మ్యాడీ చిన్నితో నీకు ఏం కాలేదు కదా అని అడుగుతాడు. నాకేం కాలేదు అని చిన్ని అనగానే మ్యాడీ ముఖం తిప్పేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget