Trinayani Serial Today December 8th Epiosde గాయత్రీ పాపకు మొదలైన గండం.. క్లారిటీ ఇచ్చేసిన డమ్మక్క!
Trinayani Today Episode అఖండ స్వామి ఇచ్చిన పొడితో నిండిన బెలూన్ గాయత్రీ పాప దగ్గరకు చేరకుండా హాసిని అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Trinayani Serial Today Episode
అఖండ స్వామి ఇచ్చిన పొడిని బెలూన్‌లో వేసి నయనితో ఊదిస్తుంది తిలోత్తమ. తర్వాత ఆ బెలూన్‌ను నాగులాపురం నుంచి తెచ్చిన పెట్టిమీద పెట్టగానే బెలూన్ ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చి గాయత్రీదేవి ఫొటోను తాకుతుంది. దీంతో డమ్మక్క ఆ చిత్ర పటాన్ని తాకిన బెలూన్ మీరన్నట్టు అమ్మ జాడ చూపేలా ఉందని అంటుంది. ఇక ఇది ఎలా అని విశాల్ అడిగితే తిలోత్తమ మొత్తం చెప్తుంది. ఇక ఆ బెలూన్ కచ్చితంగా గాయత్రీ అక్కయ్య జాడ చూపిస్తుంది అని అంటుంది.
విశాల్: మనసులో.. దేవుడా ఇప్పుడు ఆ బెలూన్ గాయత్రీ పాప దగ్గరకు వచ్చి ఆగిపోతే నిజం తెలిసిపోతుంది కదా
హాసిని: విశాల్ నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో అదే జరుగుతుంది.
వల్లభ: ఏమనుకున్నావ్ బ్రదర్
విశాల్: కంగారుగా.. అదే అన్నయ్య మొత్తానికి మా అమ్మ ఎక్కడుందో తెలిసిపోతుంది అని
హాసిని: (బెలూన్ గాయత్రీ పాప వైపు వస్తూ ఉంటుంది) మనసులో.. అయ్యో విశాల్ ఈ రాక్షసి అత్తయ్య ప్లాన్‌ను పసిగట్టలేకపోయాం. ఇప్పుడు ఎలా ఏం చేయాలి.. (అప్పుడే తలలో ఉన్న పిన్నును తీసుకొని) విశాల్ మీ అమ్మని పట్టుకోవడానికి చెల్లి వెంట నువ్వు వెళ్లాలి కానీ మా ఆయన వెళ్లడం ఏంటి. ఆ బెలూన్‌ను అందుకొని నీకు ఇస్తాను తీసుకెళ్లు అంటూ బెలూన్ పిన్నుతో పేల్చేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మరో వైపు అందులో పొడి గాయత్రీ పాప మీద పడుతుంది.
తిలోత్తమ: ఎంత పని చేశావే అంటూ హాసినిని కొడుతుంది.
విశాల్: నయని గాయత్రీని తీసుకెళ్లి క్లీన్ చేయ్
నయని: అత్తయ్య హాసిని అక్కయ్యను ఏమీ అనకండి. తను ఆ బెలూన్‌ను తీసుకొని బాబుగారికి ఇవ్వాలి అనుకుంది. అది పేలిపోవడం సహజం. నా పెద్ద బిడ్డ ఈరోజు దొరకుతుందని రాసిపెట్టిలేదేమో
ఇక నయని గాయత్రీ పాపకు పాలు తాగిస్తుంది కానీ పాప తాగదు. దీంతో ఏమైందని ఎందుకు తాగడం లేదు అని నయని అడుగుతుంది. ఇక పావనామూర్తి, డమ్మక్క, హాసిని అక్కడికి వస్తారు. ఒంట్లో నలతగా ఉందేమో అని డమ్మక్క అంటుంది. ఇక విశాల్ కూడా అక్కడికి రావడంతో గాయత్రీ పాపకు బాలేదని చెప్తుంది. హాస్పిటల్‌కి వెళ్దామని విశాల్ అంటాడు.
డమ్మక్క: ప్రయోజనం ఉండదు. గాయత్రీ దేవికి గండం మొదలైంది
నయని: ఏంటి నువ్వు అనేది. గండం గాయత్రీ అమ్మగారికి అయితే ఈ పాపకు ఒంట్లో బాగుండదా..
పావనామూర్తి: అలా ఎలా అవుతుంది
సుమన: నీకు అర్థమవుతుందా డమ్మక్క ఎక్కడో ఉన్న కన్న బిడ్డకు గండం అయితే దత్తత తీసుకున్న పాపకు ఎలా వస్తుంది.
విక్రాంత్: కాస్త అర్థమయ్యేలా చెప్పు నువ్వు అన్న మాటలకు విశాల్ బ్రో, వదిన కంగారు పడుతున్నారు.
హాసిని: మనసులో.. అమ్మో మా తింగరి అత్తయ్య ఇక్కడికి రాలేదు. ఉండుంటే కనిపెట్టేసేది
డమ్మక్క: నయని కన్న తొలి బిడ్డకు గండం అని అందరికీ తెలుసుకదా
విశాల్: అవును డమ్మక్క కానీ ఏ ఆపదైనా హాని అయినా ఈ పాపకు కాదు కదా ఎక్కడో ఉన్న నన్ను కన్న తల్లికి కదా గండం రావాల్సింది
డమ్మక్క: తెలిసో తెలీకో అన్నావు పర్వాలేదు విశాల్ బాబు. తెలిసినా తెలీనట్లు ఉన్న మనుషుల మధ్య ఉన్నావు. ప్రతీ మాట జాగ్రత్తగా పలకాలి.
సుమన: నువ్వేం చెప్పాలి అనుకున్నావో డైరెక్ట్‌గా చెప్పు
హాసిని: డమ్మక్క మాటలు లైట్ తీసుకోండి. పాపకు కాస్త ఒళ్లు వేడి చేస్తే గండం వచ్చినట్లు అనుకోవడం ఎందుకు అలాంటిది ఏం వచ్చినా చెల్లి గుర్తుపడుతుందని అనుకున్నాం కదా.
డమ్మక్క: హాసిని అమ్మ పలికిందే నేను పలుకుతాను. లాభం లేదు హాసిని
విశాల్: డమ్మక్క నువ్వు అలా అనేకొద్ది నయని కంగారు ఎక్కువవుతుంది
సుమన: డమ్మక్క మౌనంగా ఉంటే మన అనుమానాలకు సమాధానం ఎవరు చెప్తారు
నయని: నీ అనుమానం ఏంటి చెల్లి
సుమన: నువ్వు కన్న పెద్ద కూతురు అలియాస్ గాయత్రీ దేవి గారు ఎక్కడ ఉన్నారు అక్క. అది తెలుసుకోవాలి అని తిలోత్తమ అత్తయ్య ప్రయత్నిస్తే హాసిని అక్క అడ్డు పడింది అని నా అనుమానం. రెండో అనుమానం గాయత్రీ దేవికి గండం మొదలైందని ఇంట్లోనే ఉన్న డమ్మక్క అలా ఎలా చెప్పగలుగుతుంది. మూడో అనుమానం.. సుస్తి అవ్వాల్సింది విశాల్ బావగారిని కన్న తల్లి మీ కన్న బిడ్డ కదా ఈ పిల్ల ఎందుకు అయింది. అదే అడుగుతున్నాను మీ అందరికీ అర్థమైందా లేదంటే అత్తయ్యని వల్లభ బావగారిని కేక వేయమంటారా వాళ్లే వివరిస్తారు.
డమ్మక్క: నేను సుమన సందేహాలను నివృత్తి చేస్తాను. మొదటిది.. గాయత్రీ దేవిగారు మనకు దగ్గర్లోనే ఉన్నారు అనుకొని ప్రయత్నం చేశారు. హాసిని వల్ల అది విఫలం అయింది. రెండోది గాయత్రీ పాప పాలు కూడా తాగడం లేదు అంటే నీరస పడుతుంది అనే కదా.. ఇక మూడోది, మిగతా అన్నింటికీ ఒకటే సమాధానం తిలోత్తమ తెచ్చిన మంత్రించిన పొడి ఈ గాయత్రీ పాప మీద పడటంతోనే సమస్యలు అన్నీ పుట్టాయి. సమాధానాలు తట్టాయి. ( అందరూ షాక్ అవుతారు)
విశాల్: డమ్మక్క శివభక్తులు అయిన మీరు శాంతంగా ఉండాలి కానీ మీ మాటలతో అందర్నీ ఇబ్బంది పెట్టకూడదు కదా
డమ్మక్క: చేయటం లేదు బాబు చెప్తున్నా అంతే ఆ పొడి పాప మీద పడటంతో పాప ఆరోగ్యం బాగోలేదు.
పావనామూర్తి: ఓహో నాకు అర్థమైంది. గాయత్రీ అక్కయ్య పేరు ఈ పాపకు పెట్టడం వల్లన ఈ పిల్లని నయని దత్తత తీసుకోవడం వల్ల ఆస్తి సగం రాసివ్వడం వలన బెలూన్ పేలి పొడి మీద పడటం వలన జ్వరం వచ్చి గండం మొదలైంది అంతే కదా డమ్మక్క
నయని: అయ్యో అమ్మగారి పేరు పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలవుతుందా.. గండం ప్రభావం ఈ పసిబిడ్డ మీద పడుతుందా..
సుమన: ఈ పిల్లకే ఇలా అయితే ఎక్కడో ఉన్న మీ అమ్మకి ఎలా ఉంటుందో కదా విశాల్ బావగారు
మరోవైపు తిలోత్తమ, వల్లభ ఓ గదిలో తెగ ఆలోచిస్తూ ఉంటారు. పేరు పెట్టుకున్నందుకే గాయత్రీపాప అనారోగ్యం పాలవుతుందా అని వల్లభ అడుగుతాడు. పొడి వల్లే ఏదైనా జరిగి ఉంటుందని తిలోత్తమ అంటుంది. ఇక హాసిని అక్కడికి వస్తుంది. ఇక తిలోత్తమ హాసినిని తిడుతుంది. హాసిని తన తింగరి మాటలతో వాళ్లకి ముప్పతిప్పలు పెడుతుంది.
మరోవైపు విశాల్, విక్రాంత్ మాట్లాడుకుంటారు. గాయత్రీ పాపకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఎలా ఆలోచించాలో తెలియడం లేదని విక్రాంత్ అంటాడు. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది. తిలోత్తమ, వల్లభలను ఇబ్బంది పెట్టి వచ్చానని అంటుంది. ఇక నయని కూడా అక్కడికి వస్తుంది. పాప ఏం తినడంలేదు. తాగడం లేదు. జ్వరం ఇంకా తగ్గలేదని అంటుంది. ఇక విక్రాంత్ పిల్లల డాక్టర్‌కి చూపిద్దాం అంటాడు. దీంతో హాసిని ఎవరైనా 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్తారు కానీ అంత టైం లేదు కదా అని హాసిని అంటుంది. దీంతో షాకైన నయని ఏమవుతుంది అక్కా అని అడుగుతుంది. దానికి హాసిని ఏమైనా జరగొచ్చు అని సమాధానం ఇస్తుంది. ఇక విశాల్ వాళ్ల మాటలకు అడ్డుకుంటాడు. ఏం జరుగుతుందో నాకు క్లారిటీ ఉంది అని అంటాడు. అదేంటో మాకు చెప్పండి అని నయని అడిగితే.. తాను కష్టాల పాలవ్వాలి అని తాళపత్రంలో రాసి ఉంది కదా దానికి సిద్ధమవ్వాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.