Trinayani Serial Today December 26th: 'త్రినయని' సీరియల్: ఆ గదిలో నయని దేహం - అమ్మవారి సాక్షిగా పెద్ద రిస్క్, ఒక శరీరాన్ని అలా మరొకటి ఇలా!
Trinayani Today Episode నయని కోమాలో ఉన్న శరీరాన్ని దురంధర గదిలో ఉంచి విక్రాంత్, నయని వాళ్లు సేవలు చేయడం పెద్దబొట్టమ్మ శరీరాన్ని చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode దురంధర వాళ్ల గదిలోకి గాయత్రీ పాప వెళ్లి లాక్ చేసుకోవడంతో అందరూ కంగారు పడతారు. పెద్ద బొట్టమ్మ వచ్చి పాపని తీసుకొస్తానని చెప్తుంది. దాంతో నయని పెద్ద బొట్టమ్మ కంగారు పడకు పాపని మాత్రమే తీసుకొని రా అని చెప్తుంది. దాంతో పెద్ద బొట్టమ్మ పాములా మారి ఆ గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్లిన పెద్దబొట్టమ్మ గాయత్రీ పాపని పిలుస్తుంది. పాప ఎక్కడున్నావ్ నీ కోసం మీ అమ్మానాన్న కంగారు పడుతున్నారని అంటుంది.
పెద్దబొట్టమ్మ బెడ్ మీద కోమాలో ఉన్న నయని శరీరాన్ని చూసి బిత్తరపోతుంది. పాప నయని దేహం పక్కన కూర్చొని ఉంటుంది. ఇక బయట నయని పెద్దబొట్టమ్మ కోమాలో ఉన్న తన శరీరాన్ని చూసి కంగారు పడిపోతుందేమో అప్పుడు అంతా తారు మారు అయిపోతుందని అనుకుంటుంది. ఇక మిగతా అందరూ పెద్దబొట్టమ్మ డోర్ తీయడానికి ఇంత టైం ఏంటో అని అనుకుంటారు.
పెద్దబొట్టమ్మ: ఏంటిది నిజమా నయని ఇందాక బయట ఉండటం చూశాను కదా మరి నయని ఇక్కడ పడుకొని ఉండటం ఏంటి.
గాయత్రీపాప: అమ్మా.. అమ్మా.. అమ్మా.. అని లేపడం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అమ్మా అమ్మా అని లేపి నయని పక్కనే పాప పడుకుంటుంది.
పెద్దబొట్టమ్మ: ఏంటి తల్లీ నీ ప్రయత్నానికి అర్థమేంటి.
పాప: అమ్మా అమ్మా..
పెద్దబొట్టమ్మ: అమ్మ పడుకోలేదా మరి.. పెద్దబొట్టమ్మ నయనిని పరిశీలించి చూసి మీ అమ్మ కోమాలో ఉండిపోయింది. అచేతనంగా ఇక్కడ ఎందుకు ఉందో ఏమో నాకు తెలీడం లేదు పాప.
హాసిని: పెద్దమ్మా పెద్దమ్మా. తలుపు తీయండి.
పెద్దబొట్టమ్మ: గాయత్రీ మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే మనకే ప్రమాదం. పద వెళ్లాం. ఒక్క నిమిషం పాప మరి నాకు ఇందాక జాగ్రత్తలు చెప్పింది ఎవరు.
పాప: అమ్మ
పెద్దబొట్టమ్మ: హా అక్కడా అమ్మే ఇక్కడే అమ్మేనా. నువ్వు అలా అన్నావు అంటే తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. అందుకేనా నయని నేను వస్తుంటే కంగారు పడకు జాగ్రత్త అని హెచ్చరించింది.
నయని: పెద్దమ్మా పాపని తీసుకొని వచ్చేయ్ మేం అంతా మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాం.
పెద్దబొట్టమ్మ పాపని తీసుకొని బయటకు వస్తుంది. అందరూ గది చెక్ చేయడానికి వెళ్తారు. బెడ్ మీద నయని శరీరం ఉండదు. కానీ కింద మాత్రం బట్టలు చీరలు పడేసి ఉంటాయి. అందరూ గది చిందర వందరగా ఉందేంటి అనుకుంటారు. పెద్ద బొట్టమ్మ నయని శరీరాన్ని కింద పడుకో పెట్టి దాని మీద చీరలు కప్పేసి పైకి చిందరవందరగా పడేస్తుంది. అవేంటో చూడాలని తిలోత్తమ పట్టుకుంటే నయని మడతపెట్టండి అత్తయ్య అని అంటే నాకు ఎంటి అవసరం అని పట్టిన చీర విసిరేస్తుంది. అందరూ బయటకు వెళ్లిపోతారు. పెద్దబొట్టమ్మ డోర్ వేసేస్తుంది.
నయని: పెద్దమ్మ నువ్వు నిజం చెప్పకుండా నన్ను కాపాడావు నీకు కృతజ్ఞతలు చెప్పాలి.
పెద్దబొట్టమ్మ: నయని నేను గదిలో చూసింది చెప్పలేదు కానీ నువ్వు నాకు నిజం చెప్పాలి. అక్కడా నువ్వే ఇక్కడా నువ్వే ఇదెలా సాధ్యం.
విక్రాంత్: దైవానుగ్రహం వల్ల ఇది సాధ్యమైంది పెద్దబొట్టమ్మ.
పెద్దబొట్టమ్మ: ఇంట్లో వాళ్లకి తెలీదు అనుకున్నా నీకు తెలుసా బాబు.
విక్రాంత్: తెలుసు వదినకు యాక్సిడెంట్ అయ్యాక కోమాలోకి వెళ్లాక తనని లిల్లీస్ హాస్పిటల్‌కి తీసుకెళ్లిన డాక్టర్ తర్వాత రోజే చనిపోతే వదిన గురించి మాకు తెలియడం కష్టమే అనుకున్నాం. ఇంతలో దురంధర అత్తయ్యని అదే హాస్పిటల్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వదిన కోమాలో ఉన్న శరీరాన్ని చూశాం.
నయని: అక్కడ దురంధర పిన్ని, పావనా బాబాయ్, విక్రాంత్ బాబు నా సజీవ శరీరాన్ని ఎవరి కంటా పడకుండా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ దేహం త్రినేత్రిది. పాపం తన మేనత్త మామలే విష ప్రయోగం చేసి తన ప్రాణాలు తీశారు. భగవంతుడు చేసిన తప్పు సరిదిద్దు కోవడానికి నేను నా భర్త, పిల్లల్ని కాపాడుకోవడానికి త్రినేత్రి దేహాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ఇచ్చారు.
పెద్దబొట్టమ్మ: ఇలా ఎన్ని రోజులు నయని గదిలో ఉన్న నీ దేహాన్ని ఎవరైనా చూస్తే కష్టం కదా.
విక్రాంత్: అందుకే మామయ్య వాళ్ల గదిలో ఉంచాం. అయినా సరే మా అమ్మవాళ్లకి సుమనకు అనుమానం వస్తూనే ఉంది.
నయని: అమ్మవారి దయ ఎప్పుడు కలుగుతుందో నేను ఎప్పుడు కళ్లు తెరుస్తానో తెలీదు.
పెద్దబొట్టమ్మ: లేదు నయని ఇలా రాజీ పడుతూ ఆలస్యం చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతీ క్షణం మిమల్ని మీరు కాపాడుకోలేరు. ఒక పని చేస్తే పరిష్కారం దొరుకుతుందేమో బాబు. మీ వదిన దేహాన్ని దేవాలయానికి తీసుకెళ్తే అక్కడ పసురు వేసే వారు ఉంటారు. ఆయన హస్త వాసి మంచిది మీ వదిన కళ్లు తెరుస్తుంది.
నయని: 3 నెలలు కళ్లు తెరవడం కష్టం అన్నారు.
విక్రాంత్: పెద్దబొట్టమ్మ అంతగా చెప్పేటప్పుడు ఒక సారి ప్రయత్నిద్దాం వదినా.
పెద్దబొట్టమ్మ: నేను చీకటి పడిన తర్వాత వస్తాను ఎవరి కంటా పడకుండా దేహాన్ని తీసుకెళ్లగలిగితే సరి.
నయని: కానీ నా ఆత్మ మళ్లీ ఆ శరీరంలోకి వెళ్లాలి అందులోకి వెళ్లిన తర్వాత ఈ శరీరం సంగతేంటి.
విక్రాంత్: వదిని ఇన్నాళ్లు ఆశ్రయం ఇచ్చిన శరీరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం. పైగా అమ్మవారి దగ్గర ఉంటాం.
పెద్దబొట్టమ్మ: కార్యం పూర్తి అయితే దహన సంస్కారాలు అన్నవి అమ్మవారి ముందు ఉండే అఖండ జ్యోతే చూసుకుంటుంది. ఇంకేం ఆలోచించకు నయని.
నయని: బాబు గారికి ఒక్క మాట చెప్తే బాగుంటుందేమో.
విక్రాంత్: ఇప్పటి వరకు తెలీదు ఇప్పుడు తెలిస్తే తట్టుకోలేడేమో. పెద్దబొట్టమ్మ నువ్వు రాత్రి పదికి వచ్చేయ్.
రాత్రి నయని, విక్రాంత్‌లు గది దగ్గరకు వస్తారు. పెద్దబొట్టమ్మ కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో పెద్దబొట్టమ్మ వస్తుంది. విక్రాంత్, నయని నయని దేహాన్ని తీసుకొస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.