Seethe Ramudi Katnam Serial Today December 25th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తెలివిగా సీతని లాక్ చేసేసిన మహా.. ఇప్పట్లో సుమతి గురించి తెలిసే అవకాశమే లేదుగా!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ చెప్పే మాట వింటాను అని సీత రామ్‌తో పాటు ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ సీతని గదిలోకి తీసుకెళ్లి తప్పు చేశావని తిడతాడు. నేను చేసింది తప్పు కాదు రైటే అని వాదిస్తుంది. టీచరే సుమతి అత్తమ్మ కాబట్టే మామయ్య పక్కన కూర్చొపెట్టి వ్రతం చేయించా అని అంటుంది. మామయ్య పక్కన కూర్చొనే అర్హత అత్తమ్మకు మాత్రమే ఉంది మీ పిన్నికి లేదు అని సీత అంటే రామ్ కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఇంతలో విద్యాదేవి బాబు అని పిలిచి అక్కడికి వస్తుంది.
రామ్: రండి మీ వల్లే సీత ఇలా మొండిగా తయారైంది. మీరే మా అమ్మ అని గుడ్డిగా నమ్ముతూ ఇంట్లో అందరితో మొండిగా మాట్లాడుతుంది.
సీత: ఈవిడ అత్తమ్మ కాదని మీరే మొండిగా వాదిస్తున్నారు. కళ్ల ముందు ఉన్న మనిషిని నమ్మకుండా కనిపించని ఆధారాలు నమ్ముతున్నారు. వీళ్ల కళ్లే కాదు మనసు కూడా మూసుకుపోయింది.
రామ్: అవును నువ్వు ఒక్కదానివే కళ్లతో చూస్తూ మనసులో నమ్ముతున్నావ్. మేం అంతా కళ్లు లేని గుడ్డి వాళ్లం. మనసు లేని వాళ్లం అంతే కదా.
విద్యాదేవి: సీత ఉద్దేశం అది కాదు బాబు.
సీత: నిజంగా మనసుతో ఆలోచిస్తే నువ్వు ఇలా మాట్లాడవు మామ. ఆవిడ నీ కన్న తల్లి కాకపోతే తన ప్రాణాలు తెగించి నిన్ను కాపాడేది కాదు. ఆవిడ నీ కన్న తల్లే కాకపోతే ఆ రోజే ఎంతో కొంత డబ్బు అడిగేది. ఈ ప్రపంచంలో ఏం ఆశించకుండా ప్రేమ పంచేది కష్టాల్లో ఆదుకునేది తల్లి మాత్రమే. ఆ తల్లిని మనసుతో చూడమంటున్నా అప్పుడు మీకు కనిపిస్తుంది.
రామ్: ఆపుతావా మా పిన్ని కంటే ఎక్కువ తెలుసా మా నాన్న కంటే నీకే ఎక్కువ తెలుసా. నన్ను కన్న తల్లి గురించి నాకంటే నీకు ఎక్కువ తెలుసా. మా అందరి కంటే నీకే ఎక్కువ తెలుసా.
సీత: తెలుసు ఎందుకంటే.
విద్యాదేవి: ఆగు సీత. రామ్‌తో గొడవ పడొద్దు ఒక సారి నాతో రా. నేను సీతతో మాట్లాడుతా బాబు.
రామ్: మీవల్లే ఈ గొడవ అంతా తనకి ఏం చెప్తారో చెప్పి నోరు మూయించండి.
సీతని విద్యాదేవి పక్కకు తీసుకెళ్లి నా వల్ల మీద జీవితాలు ఇబ్బంది పడకూడదని రామ్‌తో గొడవ పడొద్దని నా జీవితంలా నీ జీవితం కాకూడదని సీతకి చెప్తుంది. మహాలక్ష్మీకి అవకాశం ఇస్తున్నావని ఇలాంటి అవకాశం వస్తే మహాలక్ష్మీ నిన్ను ఇంటి నుంచి గెంటేస్తుందని రామ్ మాటకు ఎదురు చెప్పొద్దని అంటుంది. దాంతో సీత నాకు రామ్ మామ ఎంత ముఖ్యమో నువ్వు అంతే ముఖ్యం అత్తమ్మ అని అంటుంది. దాంతో రామ్ చెప్పినట్లు వింటాను అని మాట ఇవ్వు అని సీత దగ్గర విద్యాదేవి అలియాస్ సుమతి మాట తీసుకుంటుంది. ఇక అందరూ హాల్‌లో రామ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రామ్ సీతని తీసుకొని కిందకి వస్తాడు. అందరూ రామ్ సీతని ఇంటి నుంచి గెంటేస్తాడని అనుకుంటారు. రామ్ మహాలక్ష్మీతో మిమల్ని అవమానించినందుకు ఇకపై మీరు చెప్పినట్లే వింటానని చెప్పిందని అంటాడు. ఇక గిరిధర్ వాళ్లు సీతని పంపేయమని అంటే తప్పులు అందరూ చేస్తారు కదా ఈ ఒక్క సారికి సీతని క్షమించండి అని అంటుంది. మహాలక్ష్మీకి కూడా క్షమించమని అంటాడు. జనా కూడా చెప్పడంతో మహాలక్ష్మీ సీతని క్షమిస్తున్నాను అని చెప్తుంది. నేను చెప్పినట్లు సీత నా మాట వింటుందా అని అడుగుతుంది.
రామ్: తప్పకుండా వింటుంది పిన్ని.
మహాలక్ష్మీ: అయితే సీతకి ఇప్పుడే ఒక కండీషన్ పెడుతున్నా సీత అది పాటించాలి. ఈ విద్యాదేవిని సీత ఎప్పుడూ సుమతి అత్తమ్మ అనకూడదు. ఈవిడను జనాకు దగ్గర చేయాలని ప్రయత్నించకూడదు. ఈవిడను డ్యాన్స్ టీచర్‌గానే చూడాలి. ఈ కండీషన్‌కి సీత ఒప్పుకుంటే నేను క్షమిస్తాను.
సీత: ఇలాంటి కండీషన్‌కి నేను ఒప్పుకోను. ఆవిడ సుమతి అత్తమ్మ అని నేను నమ్ముతున్నాను మీరు ఎందుకు కాదు అంటున్నారు.
మహాలక్ష్మీ: ఏంటి రామ్ సీత నా మాట వింటాను అన్నది ఇప్పుడు ఇలా ఎదురు తిరుగుతుంది. సీత నా మాట కాదు నీ మాట కూడా వినదు అని అర్థమైంది కదా. సీతని పంపేయాలి అని మేం అనుకున్నాం క్షమించాలి అని నువ్వు అంటున్నావ్. ఇప్పుడేం చేయాలో నువ్వే చెప్పు.
రామ్: ఏంటి సీత పైన నాకు ఏం చెప్పావ్ ఇక్కడేం చేస్తున్నావ్ నేను నిన్ను కాపాడాలి అనుకుంటే నువ్వు నన్ను కాదు అనుకుంటున్నావా. మా పిన్ని అన్నది చిన్న విషయమే కదా. నాకు నిన్ను వదులుకోవాలి అని లేదు సీత. నా కోసం మా పిన్ని నిన్ను క్షమించింది నువ్వు నా కోసం పిన్ని మాట వినలేవా.
సీత: సరే మామ నేను నీ కోసం మీ పిన్ని మాట వింటాను. కానీ అత్తమ్మ గురించి మీకు ఎప్పుడైనా తెలిస్తే నాకు సంబంధం లేదు.
మహాలక్ష్మీ: చాలా తెలివిగా మాట్లాడుతున్నావ్ సీత మా ముందు ఆవిడ కాదు అని తర్వాత ఆవిడే సుమతి అని నిరూపించాలి అనుకుంటున్నావా.
గిరిధర్: ఇందులో ఏదో తిరకాసు ఉంది వదిన.
రామ్: పిన్ని ఇకపై సీత ఏం తప్పు చేయదు.
సీత విద్యాదేవితో అత్తమ్మా మీరు బలవంతంగా నా చేతులు కట్టేశారని అంటుంది. ఏదో ఒక రోజు దేవుడి మనకు న్యాయం చేస్తాడని టీచర్ సీతకి సర్ది చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆ రోజు పొదుపే ఈ రోజు కొండంత అండ.. ఫ్యామిలీని మాటలతో చంపేసిన సుమిత్ర..!