బాదం పప్పును రోజూ తింటే మంచిది. వాటిని నానబెట్టి తింటే మరీ మంచిదని చెప్తున్నారు నిపుణులు. నానబెట్టిన బాదం పప్పులో ఎంజైమ్స్ యాక్టివ్‌గా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. నానబెట్టి తిన్నప్పుడు వాటిలో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా శరీరానికి అందుతాయి. జింక్, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ శరీరానికి పూర్తిగా అందుతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టు, స్కిన్ హెల్త్‌ని మెరుగుపరుస్తాయి. వృద్ధాప్యఛాయలను దూరం చేసి.. చర్మాన్ని ఫ్రెష్‌గా, యంగ్‌గా ఉండేలా చేస్తాయి. బాదంలోని హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మధుమేహమున్నవారు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. మెగ్నీషియం, కాపర్ బోన్స్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి. పిల్లల ఎముకల ఆరోగ్యానికి ఇవి మంచివి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.