Trinayani Serial Today December 23rd Episode గాయత్రిపాప, జీవం, విశాలాక్షిలకు ఆపద ఉందని గ్రహించిన నయని!
Trinayani Today Episode గాయత్రీపాప, విశాలాక్షి, జీవంలకు ఆపద ఉందని నయని తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Telugu Serial Today Episode
యమపాశం వల్ల కుండలకు అంటుకున్న అగ్ని ఆరిపోతేనే గండం ఎవరికి వస్తుందో తెలుస్తుంది అని ఎద్దులయ్య చెప్తారు. దీంతో నయని ఆ అగ్గిని నేను ఆర్పుతాను అంటుంది.
విశాల్: నయని నువ్వు ఆ పని చేయగలిగితే ఇక్కడున్న గాయత్రీపాప అక్కడ ఎందుకు కనిపించిందో తెలుస్తుంది.
నయని: తెలుసుకుంటాను బాబుగారు
తిలోత్తమ: అయ్యోరామా పోయి పోయి చిన్నపిల్లకే ఆపద రావాలా..
విశాల్: వచ్చిందని మనం అనుకోవడమే తప్ప భయపడాల్సిన పనిలేదు అమ్మ.
వల్లభ: మీ అమ్మ పేరు పెట్టుకుంది అని ప్రతీ సారి తప్పించుకుంటుందా. ఈసారి ఎదైనా జరగొచ్చా..
నయని: సూర్యాస్తమయం అవ్వనివ్వండి అత్తయ్య. చీకటి పడి చంద్రోదయం అవ్వాలి.
ధరందర: ఆ పిల్లే కుండల్లో కర్పూరం వదిలింది. నయని ఎంత ట్రై చేసినా ఆగట్లేదు. భగ్గుమంటున్న అగ్గి వెన్నెల చల్లదనానికి కూడా మంటలు ఆగేలా లేవు.
సుమన: పాపం మా అక్క డల్ అయిపోతే విశాల్ బావ కూడా డల్ అయిపోయారు.
విశాల్: నేను ఆలోచిస్తుంది కేవలం నయని గురించి.
విక్రాంత్: వదినకు నమ్మకం లేకపోతే అంత కాన్ఫిడెంట్‌గా చెప్పరు బ్రో.
హాసిని: చెల్లి నా కొడుకు పుండరీనాథానికి ఆపద వచ్చినా నేను ఇంత బాధ పడను కానీ గాయత్రీ పాపకు ఏం అవుతుందా అని భయంగా ఉంది.
తిలోత్తమ: హాసిని పుండరీనాథం నా కొడుకు కొడుకు అంటే నా రక్తం నువ్వు ఇలా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు.
హాసిని: పుండరీనాథం లాంటి వారు పది మంది పుడతారు. కానీ గాయత్రీ పాప లాంటి వారు ఒక్కరే పుడతారు. ఎందుకు అంటే గాయత్రీ దేవికి ప్రత్యమ్నాయం లేదు.
విక్రాంత్: వదినా ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు. కూల్‌గా ఉండు.
ధురందర: గాయత్రీ దేవి అని పెద్ద వదినతో పోల్చి చెప్తావ్ ఏంటే. పేరు పెట్టుకున్న మాత్రనా తను కాదుకదా..
విశాల్: నయని నువ్వు అనుకున్నట్లు అవుతుందా.. నమ్మకం లేదని కాదు మళ్లీ ఈ అవకాశం లేదు అని.
నయని: బాబు గారు గాయత్రీతో పాటు ఇంకా ఎవరు ఉన్నారో అస్పష్టత వల్ల తెలీడం లేదు. అది తెలుసుకోవాలి అనే నా ఈ ప్రయత్నం.
సుమన: తెలుసుకోవాలి అంటే ఆ మంటలు ఆర్పాలి ఎలా చేస్తావో చెప్పు అక్క.
నయని: చేస్తాను. కోరలమ్మ తల్లి నాకు అండగా ఉండి మంటలు ఆరేలా చేస్తుంది. అంటూ నయని ఆ కుండలు దగ్గర నాట్యం చేస్తుంది. కోరలమ్మ కలశం పట్టుకుంటుంది. దీంతో ఆ కలశం నుంచి ఓ పవర్ వచ్చి నైవేద్యంగా పెట్టిన మినప రొట్టెను ఆరు రొట్టొలుగా చేసి ఆరు కుండల మీద ఉంచి మంటలు ఆరేలా చేస్తుంది. దీంతో నయని వాళ్లు చాలా సంతోషిస్తారు. ఇక ఆ కుండల నుంచి వచ్చిన పొగ చంద్రుడి వైపు వెళ్లి అక్కడ ఉరుముల మెరుపుల మధ్య గాయత్రీ పాప, విశాలాక్షి, జీవం కనిపిస్తారు.
నయని: గాయత్రీ పాప, విశాలాక్షి, జీవం అన్న ఈ ముగ్గురు కనిపించారు అంటే ఈ ముగ్గురుకు ఏమైనా జరగబోతుందా..
హాసిని: ముగ్గురుకి సంబంధించిన సంఘటన ఎక్కడో జరగబోతుంది.
నయని: ఈ ముగ్గురికి ఆపద గుడి దగ్గర పొంచి ఉంది అని అర్థమవుతుంది. ఆదివారం జీవం అన్న గుడికి వస్తారు. నా పెద్ద కూతురు గాయత్రీ ఎక్కడుందో తెలిసిన వ్యక్తి తనే. నాతో నిజం చెప్తాడు.
వల్లభ: మరి విశాలాక్షి ఎందుకు కనిపించింది.
నయని: తెలీదు బావగారు.
తిలోత్తమ: గండం ముగ్గురి మధ్య జరుగుతుంది వల్లభ. నయనికీ నిజం తెలిసిన రోజు ఏదైనా జరగొచ్చు అని కోరలమ్మ సూచిస్తుంది.
మరోవైపు నయని తల్లి శ్యామల ఇంటికి వస్తే పెద్దబొట్టమ్మ పిలిచి కనిపిస్తుంది.
పెద్దబొట్టమ్మ: నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అనుకుంటున్నావా శ్యామల. చేతికి నాగబొమ్మ వేసుకున్నావు కదా అందుకే కనిపిస్తున్నాను.
నయని: అమ్మ చేతికి నాగబొమ్మ ఎందుకు వేసుకుంది.
శ్యామల: ఎవరూ చూడరు అనుకున్నాను.. నువ్వు చూశావా.. చూస్తే చూశావ్ కానీ ఎవ్వరికీ చెప్పకు. అసలు నీకు ఏం కావాలి
పెద్దబొట్టమ్మ: నువ్వు నాకు ఏం ఇవ్వగలవు కాకపోతే కొంచెం నీ కొంగు కావాలి. అవును శ్యామల నీ చీర కొంగుకి నా చీర కొంగు ముడి వేస్తాను. నాగులాపురం నుంచి ఐదు గవ్వలు తెచ్చినా సరే నేను నీకు తప్ప ఇంకెవరికీ కనిపించను. అది కూడా నీ చేతికి నాగబొమ్మ ఉన్నంత వరకే.
శ్యామల:ఎందుకు ఏం చేయడానికి ఇంట్లోకి వెళ్లాలి అనుకుంటున్నావు.
పెద్దబొట్టమ్మ: నీ కంటే ఘనకార్యం నేను ఏం చేయనులే.
నయని: ఏంటి పెద్దబొట్టమ్మ కనిపించడం లేదు.
పెద్దబొట్టమ్మ: నీ పక్కన నేను ఉన్నట్లు ఎవ్వరికీ తెలిదులే.. పద శ్యామల..
నయని: అసలు అమ్మ చేతికి నాగబొమ్మ ఎందుకు వేయించుకుంది. పెద్దబొట్టమ్మ నాకు చెప్పకుండా అమ్మని ఎందుకు ఆశ్రయించింది.
మరోవైపు హసిని, విక్రాంత్ లెక్కలు చేస్తూ ఉంటారు. వల్లభ, తిలోత్తమ, ధురందర కూడా అక్కడికి వస్తారు. ఇక నయని కంగారుగా కిందకి వస్తుంది. ఇక శ్యామల అక్కడికి వస్తుంది. తన వెంటే పెద్దబొట్టమ్మ ఉంటుంది. కానీ ఎవరికీ కనిపించదు. అయితే డమ్మక్క వచ్చారు అమ్మలు అంటుంది. ఒకరే వస్తే ఇద్దరు వచ్చినట్లు అన్నావ్ ఏంటి అని ధురందర అడుగుతుంది. ఇక సుమన ఉన్నట్టుండి ఊడిపడ్డావ్ ఏంటి అని తన తల్లిని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.