Trinayani Serial Today April 8th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి చీరకట్టుకొని అందర్ని మైమరిపించిన పాప.. ఆ పని వల్ల పరుగులు తీయలేక చచ్చిన వల్లభ!
Trinayani Serial Today Episode విశాలాక్షిని అందరూ పొగడడంతో ఆమె పరువు తీసేలా వల్లభ మాట్లాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో ఇవాళ్టి ఎసిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode విశాలాక్షి గాయత్రీ పాపక గాయత్రీ దేవి చీర కట్టుకొని తీసుకొని వస్తుంది. విశాల్, నయనిలతో పాటు అందరూ మురిసిపోతారు. గాయత్రీ దేవే కళ్ల ముందు ఉందని అంటారు. ఇక సుమన అయితే తన నోటికి పని చెప్తుంది. ఇక విశాలాక్షి గాయత్రీ పాపే గాయత్రీ దేవి అన్నట్లు అర్థమై అవ్వనట్లు మాట్లాడుతుంది.
విక్రాంత్: మనందరం గాయత్రీ పాపలోనే గాయత్రీ పెద్దమ్మను చూస్తున్నాం. ఇంతకీ అమ్మ ఎక్కడ ఉంది.
వల్లభ: మమ్మీ.. మమ్మీ..
హాసిని: మమ్మీనే రాజా మెల్లగా జారుకుందా లేదంటే గుండె ఆగి పోయిందా చూడండి ఎందుకైనా మంచిది.
విశాల్: నా కన్న తల్లి వస్తే నన్ను పెంచిన తల్లి ఉండదు.
పావనా: మనసులో.. అల్లుడు ఎమోషనల్ అయిపోయి గాయత్రీ పాపే పెద్దక్కయ్య అని చెప్పేస్తాడా ఏంటి..
విశాల్: పాపతో లక్ష్మీపురం వెళ్లే ముందు సాయంత్రం 6 గంటల లోపు వస్తాను అని చెప్పి ప్రాణాలతో రాలేదు అమ్మ నువ్వు. నయని కడుపులో పుట్టి కోడల్ని అమ్మా అని పిలుస్తానని చెప్పి పునర్జనమ్మ ఎత్తావు. పసిబిడ్డగా ఉన్నప్పుడు మా బిడ్డగా ఉన్నావు కానీ చీర కట్టగానే నువ్వు అమ్మవి అయిపోయావు. ఐలవ్యూ అమ్మా. అని పాపను హత్తుకున్నాడు.
సుమన: ఏంటి పెద్ద బాబుగారు విశాల్ బావగారు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు.
వల్లభ: కొంప తీసి ఆ బిడ్డే పెద్దమ్మ ఏమో..
నయని: బాబుగారు. బాబుగారు.
విశాలాక్షి: మీ అమ్మకి చీర కట్టగానే చుట్టూ అందరూ ఉన్నారు అని ఈ ప్రపంచాన్నే మర్చిపోయావు నాన్న.
దురంధర: వదిన ఈ గాయత్రీ పాపే అన్నట్లు అలా మాట్లాడావేంటి విష్.
నయని: అమ్మగారు పాప రూపంలోనే ఉన్నారు అన్నట్లు మీరు చెప్పింది నిజమే అయితే ఎంత బాగున్నో అనిపించింది బాబుగారు.
సుమన: అబద్ధం అని ఎవరు అన్నారు అక్క.
విక్రాంత్: బ్రో అంత ఎమోషనల్ అయినందుకు పాపే గాయత్రీ పెద్దమ్మ అయిపోయిండొచ్చు అని భ్రమపడ్డారు.
సుమన: కాదు అంటారా..
ఎద్దులయ్య: పెద్ద మాత ఏమంటారో కేకేయండి.
విశాలాక్షి: ఇక్కడే ఉంటే బాగుండేది.
ఎద్దులయ్య: ఉండేది కాదేమో.. చచ్చిపోయేది.
విశాలాక్షి: గాయత్రీ దేవి తేజస్సు చూడలేక ఉక్కిరిబిక్కి అయ్యేది. ఇంతకు ముందు సీన్స్ గుర్తు చేసుకొని కుప్పకూలిపోయేది.
ఇక వల్లభ, సుమన వంకర టింకరగా మాట్లాడడంతో అందరూ వాళ్లని చీవాట్లు పెడతారు. గాయత్రీ దేవి చీరల్ని ప్రత్యేకంగా చూడటంతోనే వీళ్లకి ఇంత టెక్కు అని గాయత్రీ దేవి చీరల్ని పడేస్తాను అని వల్లభ వాటిని ముట్టుకోగానే షాక్ కొట్టి నేల పడిపోతాడు. దాంతో విశాలాక్షి గాయత్రీ పాప కాలు ఎత్తి నీమీద పెట్టే లోగ లెగిస్తేనే నీ భార్య పసుపు కుంకుమలు నిలుస్తాయి అని విశాలాక్షి అంటుంది. అందరూ వల్లభను లేపుతారు.
మరోవైపు ఉగాది పండగను ఎలా జరుగుపుకోవాలో విశాలాక్షి అందరికి చెప్తుంది. సుమన, వల్లభలు అడ్డుపడతారు. విశాలాక్షి చెప్తుంటే చిరాకు పడతారు. విశాలాక్షిని పొగుడుతుంటే సుమన నెత్తిన నాట్యం చేస్తుంది అని అర్హత లేని వాళ్లని అందలం ఎక్కించొద్దు అని వల్లభ అంటాడు. ఇక హాసిని ఇద్దర్ని తిడుతుంది. ఇక వల్లభ పెద్ద మనుషులు చెప్తే వినాలి అని ఈ పిల్ల పెద్ద మనిషి అయ్యిందో లేదో అని వెటకారంగా నవ్వుతాడు. విశాలాక్షితో పాటు అందరూ సీరియస్ అవుతారు. హాసిని, విక్రాంత్‌లు తిడతారు. ఇక వల్లభ కడుపు పట్టుకొని బాత్‌రూంకి పరుగు పెడతాడు. పరుగులు తీయలేక నీరసంతో పడిపోతాడు. దీంతో విశాలాక్షి కోపంతో ఆడవాళ్లను అవహేళనగా మాట్లాడితే ఇలాగే వాళ్ల కాళ్ల దగ్గర పడాల్సి వస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'ఫ్యామిలీ స్టార్' విడుదలకు ముందు నెగెటివ్ రివ్యూలు - పోలీసులకు దేవరకొండ ఫ్యాన్స్ కంప్లైంట్