Family Star: 'ఫ్యామిలీ స్టార్' విడుదలకు ముందు నెగెటివ్ రివ్యూలు - పోలీసులకు దేవరకొండ ఫ్యాన్స్ కంప్లైంట్
Complaint lodged against Family Star negative reviews: విజయ్ దేవరకొండను కించపరుస్తూ... ఆయన 'ఫ్యామిలీ స్టార్'పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.
యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఈ నెల 5న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల అయ్యింది. విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ... కుటుంబ ప్రేక్షకుల ఆదరణ బావుందని, తమ టార్గెట్ రీచ్ అయ్యామని నిర్మాత 'దిల్' రాజు ఫస్ట్ డే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మంచి ప్రేక్షకాదరణతో తమ 'ఫ్యామిలీ స్టార్' విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని ఆయన తెలిపారు. అయితే, ఈ సినిమా మీద సోషల్ మీడియాలో విపరీతగమైన నెగెటివిటీ నెలకొంది. దానిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
'ఫ్యామిలీ స్టార్' విడుదలకు ముందు నెగెటివ్ పోస్టులు
'ఫ్యామిలీ స్టార్' సినిమాకు విజయం దక్కకూడదని, హీరో విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పని కట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఫ్యామిలీ స్టార్' విడుదలకు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారని గుర్తు చేశారు. సదరు పోస్టులు 'ఫ్యామిలీ స్టార్' ప్రొడ్యూస్ చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ('దిల్' రాజు నిర్మాణ సంస్థ) దృష్టికి రావడంతో... సంస్థ ప్రతినిధులు ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ సమాచారం ఆధారంగా హీరో విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, అలాగే హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిశాంత్ కుమార్ కలిసి ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: 'వేట్టయాన్'తో థియేటర్లలోకి రజనీకాంత్ వచ్చేది అప్పుడే - బిగ్ అప్డేట్ వచ్చేసింది
Cyber Crime Complaint lodged against individuals who are part of orchestrated attacks and planned negative campaigns targeting The #FamilyStar movie and actor #VijayDeverakonda.
— Suresh PRO (@SureshPRO_) April 7, 2024
The police officials started taking action already and are tracing the fake ids and users and assured… pic.twitter.com/wQH8JxiS0G
నెగెటివ్ పబ్లిసిటీతో వసూళ్లపై ప్రభావం!
'ఫ్యామిలీ స్టార్' సినిమాపై కొందరు వ్యక్తులు కావాలని దుష్ప్రచారం చేయడంతో నిజంగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు మిస్ లీడ్ అవుతున్నారని, తద్వారా సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనురాగ్ పర్వతనేని, నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటు వారి నుంచి ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు, ఈ కేసును విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: 'పుష్ప 2' టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ - బన్నీ బర్త్ డే గిఫ్ట్ ఎప్పుడంటే?
హీరో విజయ్ దేవరకొండ మీద ద్వేషంతో 'ఫ్యామిలీ స్టార్' సహా ఇంతకు ముందు ఆయన సినిమాల మీద సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ క్యాంపెయిన్స్ చేశారు. 'ఫ్యామిలీ స్టార్'కు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కుటుంబ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తున్నారు. 'దిల్' రాజు రివ్యూలు తీసుకున్న సమయంలో సినిమాపై యూట్యూబ్, సోషల్ మీడియాలో పలువురు నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారనీ, తమకు సినిమా నచ్చిందని, బాగుందని చెప్పడం గమనార్హం.