అన్వేషించండి

Vettaiyan Movie: 'వేట్టయాన్'తో థియేటర్లలోకి రజనీకాంత్ వచ్చేది అప్పుడే - బిగ్ అప్డేట్ వచ్చేసింది

Vettaiyan movie release date: 'జైలర్' సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'వేట్టయాన్'. ఈ మూవీ రిలీజ్ గురించి ప్రొడక్షన్ హౌస్ అప్డేట్ ఇచ్చింది.

Rajinikanth's Vettaiyan Movie Release Update: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్. 'జైలర్' తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'వేట్టయాన్' ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు ప్రొడక్షన్ హౌస్ లైకా బిగ్ అప్డేట్ ఇచ్చింది. 

అక్టోబర్ నెలలో 'వేట్టయాన్' విడుదల
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వేట్టయాన్'. ఇది ఆయన 170వ సినిమా (Thalaivar 170). దీనికి టి.జె. జ్ఞానవేల్ దర్శకుడు. సూర్య శివ కుమార్ 'జై భీమ్' తర్వాత ఆయన తీస్తున్న చిత్రమిది. టి సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు.

Also Readనాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!

'జైలర్' తర్వాత పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలామ్' చేశారు రజని. అయితే, ఆ సినిమాలో ఆయనది అతిథి పాత్ర. మూవీ కూడా హిట్ కాలేదు. ఫ్లాప్ అని తేల్చారు. కలెక్షన్స్ కూడా రాలేదు. అందుకని, ఆయన ఫుల్ లెంగ్త్ హీరోగా రజనీకాంత్ మళ్లీ వస్తే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?


'వేట్టయాన్' సినిమాలో రజనీకాంత్ స్నేహితుడు, బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. మూడు దశాబ్దాల తర్వాత వాళ్లిద్దరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు 'అంధా కానూన్', 'గేరేఫ్తార్', 'హమ్' వంటి సినిమాల్లో రజనీ, అమితాబ్ కలిసి నటించారు. ఇంకా 'వేట్టయాన్'లో మ్యాచో స్టార్, భల్లాలదేవ రానా దగ్గుబాటి, మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజూ వారియర్, 'గురు' ఫేమ్ రితికా సింగ్, దుషారా విజయన్, ఫహాద్ ఫాజిల్ కీ రోల్స్ చేశారు.

Also Read: హనుమాన్ తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో వరలక్ష్మీ శరత్ కుమార్ - రిలీజ్ ఎప్పుడంటే?


'వేట్టయాన్' సినిమాలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ఎన్కౌంటర్స్, వ్యవస్థ మీద పోరాటం చేసే వ్యక్తిగా సూపర్ స్టార్ రోల్ డిజైన్ చేశారట. రజనీతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ '2.0', 'దర్బార్', 'లాల్ సలాం' ఫిలిమ్స్ చేసింది. ఇది నాలుగో సినిమా.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget