Trinayani October 4th: గడప దాటిన నయని - విశాల్ ప్రాణాలు తీసేందుకు తిలోత్తమ ప్లాన్!
ప్రాణగండం ఉందని తెలిసినా నయని గడప దాటడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Trinayani October 4th Written Update: తిలోత్తమ, వల్లభలిద్దరూ ఇంటి బయటనే ఉన్న తులసి కోట దగ్గరకు వెళ్లి పసుపు నీళ్లను తులసి మొక్కలో కలిపేస్తారు.
తిలోత్తమ: ఇప్పుడు వాళ్ళకి దారేలా తెలుస్తుందో నేను చూస్తాను అని అంటుంది. మరోవైపు నయని ఆ పెట్ట దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది.
నయని: అమ్మ ఉలూచి పాపా జాడ తెలియజేయు అని చెప్పి ఆ పెట్టె తెరవగా లోపల ఏమీ కనిపించదు. దానికి ఆశ్చర్యపోయి వెంటనే కిందకి పరిగెట్టుకొని వస్తుంది. పెట్టెలో అమ్మవారు లేదని చెప్పగా కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు.
హాసిని: నాకు మా అత్తయ్య, మొగుడు మీద డౌట్ గా ఉన్నది నిజం చెప్పండి మీలో ఎవరు తీసారు?
తిలోత్తమ: నీకేమైనా పిచ్చా ఒకవేళ మేము తీయాలనుకుంటే ఆ పెట్టె మా చేతులు ద్వారా తెరవడానికి అవ్వదు కదా. కొంచెం బుర్రవాడే ఏ తప్పు జరిగిన నిందలు మా మీద వేయడానికే ముందుంటావు.
వల్లభ: నా కాళ్ళని వదిలే అని తన కాళ్ళుని పట్టుకున్న గాయత్రితో అంటాడు.
హాసిని: మీరే దొంగ అని చెప్తున్నట్టుంది
సుమన: ఇప్పుడు మీ నాటకాలు అన్నీ ఆపుతారా కావాలనే నా బిడ్డను తీసుకుని వస్తానని ఆశలు రేపి ఇలా నాటకాలు ఆడి తప్పుదోవ మళ్లిస్తున్నారు. క్షణక్షణానికి పాప దొరకకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది.
Also Read: అనామిక, కళ్యాణ్ పెళ్లి ఫిక్స్- రాజ్ రహస్యం తెలుసుకున్న కావ్య మనసు ముక్కలు
విశాల్: ఈ ఒక్క రోజుకి ఓపిక పట్టు సుమన పాప జాడ తెలుస్తుంది
నయని: నేను వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్లి దీనికి పరిష్కారం ఏంటో అడుగుతాను గురువు గారే దీనికి మార్గం చూపించగలరు అని గడప దాటి బయటకు వెళ్ళిపోతుంది నయని.
వెంటనే గురువుగారి దగ్గరకు వెళుతుంది నయని.
గురువుగారు: గడప దాటోదని చెప్పినా సరే దాటావు దీనికి పరిణామాలు ఉంటాయి నయని.
నయని: అది కాదు గురువుగారు పెట్టలో పెట్టిన గౌరమ్మ కనిపించడం లేదు
గురువుగారు: ఎందుకు కనిపిస్తుంది దాన్ని తీయడము జరిగింది, నీళ్లలో కలపడం జరిగింది, దాన్ని తులసి మొక్కలో వేయడం కూడా జరిగింది. ఇప్పుడు నీకు ఉన్నది ఒకటే దారి వెళ్లి తులసమ్మని బతిమిలాడి అమ్మవారిని దారి చూపమని చెప్పు ఎందుకంటే అమ్మవారి శక్తి జలంలో కూడా ఏమాత్రం తగ్గదు. అలాగే ఒక విషయం గుర్తుంచుకో నువ్వు బయటకు వచ్చినందువల్ల పరిణామాలు మాత్రం తప్పవు.
నయని: పర్లేదు గురువుగారు అన్నిటికి తెగించే వచ్చాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు తిలోత్తమ, వల్లభలిద్దరూ అఖండ స్వామి దగ్గరకు వెళ్లి నయని గడప దాటిన విషయం అంతా చెప్తారు.
Also Read: అమ్మా లే అమ్మా లే అంటూ కదిలించేసిన రిషి, జగతిది హత్యే అని బయటపడుతుందా!
అఖండస్వామి: గడప దాటితే తనకి గ్రహబలం తక్కువ అందుకే ప్రాణగండం ఉంది అని తన పక్కనున్న ఒక వ్యక్తిని పిలుస్తాడు. అప్పుడు తను వచ్చి తన బుట్టలో ఉన్న ఒక కాల నాగుని బయటకు తీస్తాడు.
అఖండస్వామి: ఈ కాలనాగుని నేను అగ్నిగుండం దగ్గర ఉన్న పుట్ట వైపుకు తీసుకుని వస్తాను అదే సమయంలో మీరు విశాల్ ని కూడా గడప దాటేటట్టు చేస్తే ఒకేసారి ఇద్దరిని ముగించేయొచ్చు.
తిలోత్తమ: అయితే విశాల్ ని బయటకు తెచ్చే పనిలో నేనుంటాను.
అఖండస్వామి: మరో విషయం గౌరమ్మను జలంలో వేసిన సరే తన శక్తి ఏమాత్రం తగ్గదు.
తిలోత్తమ: ఈలోగే మనం పనిని కానించేద్దాం స్వామి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు.
ఆ తర్వాత సీన్లో నయిని తులసి మొక్క దగ్గరికి వచ్చి అమ్మవారిని దారి చూపించమని వేడుకుంటూ ఉంటుంది. వెనకనుంచి తిలోత్తమ, వల్లభలు నయనిని చూసి ఇటువైపు వచ్చిందేంటి అని అనుకుంటారు.
నయని: అమ్మ తులసమ్మ పాపం మా ఇంటి ఆడపిల్ల కనిపించకపోతే పసుపు గౌరమ్మని ఇంట్లో ఉంచితే తను దారి చెప్పింది అని గురువుగారు చెప్పారు. కానీ దాన్ని ఎవరో నీలో కలిపేసారట దయచేసి నాకు మార్గం చూపించమ్మా.
వల్లభ: అమ్మ గురువుగారు అప్పుడే చాటేసారా అని అనుకుంటాడు.
నయని: నేను లోపలికి వెళ్లి అందరికీ ధైర్యం చెప్పి వస్తాను అమ్మ. నువ్వే మాకు ఏదో ఒక దారి చూపించు అని లోపలికి వెళ్తుంది.
వల్లభ: ఇప్పుడు చిన్న మరదలు ఏం చేస్తుంది అంటావు మమ్మీ?
తిలోత్తమ: చేయాల్సింది అది కాదురా మనం. ఇద్దరినీ అగ్నిగుండం దగ్గర ఉన్న పుట్టకు తీసుకుని వెళ్తే అఖండ స్వామి చెప్పినట్టు ఆ ప్రమాదానికి గురై తనువులు విడుస్తారు పద ఏం చేయాలో చెప్తాను అని వల్లభ తీసుకొని లోపలికి వెళ్తుంది.
మరోవైపు కుటుంబం అంతా దిగులుగా ఉండగా నయని వాళ్లకు ధైర్యం చెబుతూ ఎలాగైనా ఉలూచిని పట్టుకుందామని అంటుంది.
Also Read: పసుపు గౌరమ్మని పెట్టెలోంచి దొంగిలించిన తిలోత్తమ - అమృత ఘడియల కోసం నయని ఎదురుచూపులు!
ఇంతలో తిలోత్తమ, వల్లభలు అక్కడికి వస్తారు.
తిలోత్తమ: మీరు ఏమనుకోకపోతే నాదొక మాట. ఇరుగుపొరుగు వాళ్లని పాప గురించి అడిగితే అమ్మాయి కనిపించలేదు కాని ఒక పాము కనిపించింది అని చెప్పారు.
సుమన: అయితే అది కచ్చితంగా నా ఉలూచినే
హాసిని: ఎప్పుడు కనిపించిందట? ఉదయమా? మధ్యాహ్నమా?
వల్లభ: ఉదయం.
హాసిని: అయితే అది ఉలూచి అయ్యుండదు. ఎందుకంటే ఉదయం తను అమ్మాయి రూపంలో ఉంటుంది.
తిలోత్తమా: ఉదయం అంటే తెల్లవారుజామున 5:00 గంటలకి అంట.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial