By: ABP Desam | Updated at : 03 Oct 2023 12:48 PM (IST)
Image Credit: zee5
Trinayani October 3rd Written Update: పసుపు గౌరమ్మను నయని విశాల్ లు వాళ్ళ చేతిలో పెట్టుకుని నాగలక్ష్మి అమ్మవారి పెట్టె దగ్గరకు తీసుకొని వస్తారు. అప్పుడు ఆ పెట్టెను హాసిని తెలుస్తుంది.
హాసిని: నేను పెట్టను తెరవడం అయితే తెరిచాను కానీ లోపల గౌరమ్మని పెట్టిన తర్వాత దీన్ని కేవలం నయని, లేకపోతే తను కన్న పిల్లలు మాత్రమే తీయగలరు. అమ్మవారిని లోపల పెడుతున్నాను కదా నేను దీన్ని అలంకరిస్తాను అని చెప్పి పూలతో కుంకుమ పెట్టి ఆ పెట్టెను అలంకరిస్తుంది.
గది బయట నుంచి తిలోత్తమ, వల్లభలు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు.
వల్లభ: అయితే మమ్మీ మనం ఆ పెట్టిన దొంగలించేద్దామా?
తిలోత్తమ: కొంచెం సేపు ఆగరా అమ్మవారిని ఆ పెట్టెలో కొంతసేపైనా ఉండని
ఆ తర్వాత పసుపు గౌరమ్మను దంపతులిద్దరూ కలిసి ఆ పెట్టెలో పెడతారు.
నయని: అమ్మ నువ్వే అమృత గడియలు వచ్చి మాకు ఒక దారి చూపించేలా చూడాలి
హాసిని: నువ్వెలాగైతే ఇప్పుడు ఈ పెట్టెలో బజ్జుంటావో అలాగే మా ఉలూచిని కూడా మా దగ్గరికి తెచ్చి ఇవ్వా అని అంటుంది.
అక్కడే మంచం మీద గాయత్రి కూర్చుని ఉంటుంది.
హాసిని: ఏ అల్లరి పిల్ల ముందే చెప్తున్నాను. ఈ పెట్టే జోలికి కూడా రావద్దు
నయని: అదేంటి అక్క నేను కన్నది గానవిని కదా గాయత్రీ కి చెప్తున్నావేంటి?
హాసిని: మర్చిపోయాను చెల్లి అని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరుతారు. వాళ్లని చూసి తిలోత్తమా, వల్లభలు కూడా అటువైపు నుంచి బయటకు వచ్చేస్తారు.
Also Read: పెళ్లికి ఆర్య ప్లాన్ - అనుని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో మాన్సీ!
ఆ తర్వాత సీన్లో సుమన తన గదిలోకి రాగ వెనుక విక్రాంత్ కూడా వచ్చి తలుపు గెడ వేస్తాడు.
సుమన: చూశారా బయట ఎన్ని నాటకాలు జరుగుతున్నాయో. నా కూతురు తప్పిపోయింది తిరిగి ఇవ్వమంటే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి నాటకాలు ఆడుతూ గౌరమ్మని ఇంట్లో దాయాలి అని ఆ గురువుగారు చేత కూడా అబద్ధాలు ఆడిపిస్తున్నారు.
ఇప్పుడు నా కూతురు తిరిగి వస్తుంది అని లేనిపోని అసలు రేపెడుతున్నారు. ఒకవేళ ఇది జరగకుండా నా పాపకు ఏమైనా జరిగితే పది రోజులు అవ్వకముందే పిండం పెట్టాల్సి వస్తుంది
విక్రాంత్: ఇంక ఆపుతావా నువ్వు? ఎవరైనా సొంత కూతురు గురించి అలా అనుకుంటారా? అయినా సరే నీకు నీ కూతురు మీద ఎప్పుడు ప్రేమున్నదని ఎప్పుడు చూసినా ఆ పది కోట్ల కోసమే ఆలోచిస్తూ ఉంటావు.
కనీసం తల్లిపాలు కూడా పెట్టలేని నువ్వు ఇప్పుడు ఇంతలా చూసుకుంటున్నావంటే ఆ 10 కోట్లు ఎక్కడి నీ దగ్గర నుంచి దూరమైపోతాయని కదా అందుకే లేని ప్రేమని కూడా ఉన్నట్టు నటిస్తున్నావు. ఒక తల్లిలా ఓడిపోయావు ఇప్పుడు ఒక మనిషిలా కూడా చచ్చిపోయావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్.
Also Read: జగతిని చంపేశారు, మళ్లీ బాధ్యతలు తీసుకున్న రిషి - ఇక తల్లీ కొడుకుల ఆటకట్టు!
సుమన: అలాగే వెళ్ళండి అయినా తెలుసుకోవాల్సింది మీతో కాదు మా అక్కతోని తేల్చుకుంటాను కొంచెం సేపాగితే రావాల్సిన నిజాలు అన్నీ బయటకు వస్తాయి అని అనుకుంటుంది.
ఆ తర్వాత సీన్ లో తిలోత్తమా వల్లభ లు ఆ పెట్టె దగ్గరికి వచ్చి దాన్ని తెరవాలని చూస్తారు కానీ దాన్ని తెరవలేక పోతారు.
తిలోత్తమ: గురువుగారు చెప్తుంటే ఎవరూ పెట్టెని తరవకూడదని సరదాకి చెప్పారనుకున్నాను నిజంగానే పెట్టి తెరుచుకోవడం లేదు. గానవి పడుకుంది ఒకసారి గాయత్రిని తీసుకురా పెట్టె తెరిస్తే మన అనుమానం కూడా తేలిపోతుంది అని అంటుంది.
అప్పుడు వల్లభ ఎవరికి తెలియకుండా గాయత్రి ని నయని గదిలో నుంచి తీసుకొని వస్తాడు. గాయత్రి చేతిని పెట్టె దగ్గరికి పెట్టగా ఆ పెట్టె తెరుచుకుంటుంది. దాన్ని చూసి ఒకేసారి ఇద్దరు ఆశ్చర్యపోతారు.
తిలోత్తమ: నయని వాళ్లు దత్తకు తీసుకున్నారు కనుక గాయత్రీ ఇది తెరవగలిగింది అని చెప్పి లోపల ఉన్న అమ్మవారిని చేతిలో పట్టుకుంటుంది తిలోత్తమ.
మరోవైపు కింద అందరూ అమృత ఘడియలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో సుమన అక్కడికి వస్తుంది.
సుమన: ఏంటి అందరూ అమృత ఘడియలు కోసం ఎదురుచూస్తున్నారా? ఒకవైపు నా పాప కనిపించడం లేదు అని బాధపడుతుంటే బావగారు ఇంటి నుంచి బయటకు కూడా కదలకుండా పాపని వెతుకుతున్నట్టు నటిస్తున్నారు. ఇప్పుడు ఆ గురువుగారు వచ్చి పసుపుతో ముద్దని చేసి అమ్మవారని చెప్తుంటే దానికోసం మీరందరూ ఇలా సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ లోగ నా పాపకి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత?
విశాల్: కొంచెంసేపు ఆగు సుమన. అమృత ఘడియలు వచ్చిన తర్వాత జరిగే మాయ ఏంటో నీకు తెలుస్తుంది అప్పుడు దేవుడి మీద నమ్మకమైన వస్తుంది అని అంటాడు విశాల్.
మరోవైపు తిలోత్తమ, వల్లభలు దాక్కుంటూ ఉండగా వెనుక నుంచి ఎద్దులయ్య అక్కడికి వస్తాడు.
ఎద్దులయ్య: సరిగ్గా దాచేసారా?
తిలోత్తమ: దాచేయడమేమిటి?
ఎద్దులయ్య: అదే గాయత్రిని మీ దగ్గర దాచారా. ఇంక నాకు ఇవ్వండి కిందకు తీసుకుని వెళ్తాను. కుటుంబమంతా కింద ఉండగా మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు రండి అందరూ అమృత ఘడియలు కోసం ఎదురుచూస్తున్నారు అని వాళ్ళిద్దర్నీ కిందకు తీసుకొని వస్తాడు ఎద్దులయ్య.
ఇంతలో అమృత క్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే పైన ఉన్న అమ్మవారిని చూస్తాను అని నయని అక్కడికి వెళుతుంది. ఇంతలో హాసిని, విక్రాంత్, విశాల్,సుమన లు అందరూ పైకి పరిగెడతారు.
అదే సమయంలో తిలోత్తమ చేతిలో ఉన్న పసుపు ముద్దను అక్కడే ఉన్న పూలనీటిలో కలిపేస్తుంది. దాన్ని ఎదులయ్య చూసి నవ్వుకుంటాడు.
తిలోత్తమ: అవును ఈ నీళ్లను ఎన్ని రోజులైంది మార్చి? ఎప్పటికప్పుడు మార్చుకుంటే మంచిది. రా వల్లభ వెళ్లి పడేద్దామని వల్లభని తీసుకొని ఆ పూల నీళ్లనీ పారేయడానికి వెళుతుంది తిలోత్తమ.
పావనమూర్తి: అందరూ అమృత క్షణాల కోసం ఎదురు చూస్తుంటే ఈవిడేంటి పువ్వులు,నీళ్లు అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial
Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!
Jagadhatri December 8th Episode: 'జగద్ధాత్రి' సీరియల్: ఇరకాటంలో పడ్డ కేదార్, ధాత్రి - రూమ్‌లో ఉన్న యువరాజ్ ధాత్రికి చిక్కుతాడా?
Keerthi Bhat: రక్తం మరిగిపోతోంది - అమర్ అభిమానులపై సీరియల్ నటి కీర్తి భట్ ఆగ్రహం
Bigg Boss 7 Telugu: ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోకు, మంచిది కాదు - శోభాకు శివాజీ వార్నింగ్
Gruhalakshmi Serial Today December 8th Episode : 'గృహలక్ష్మి' సీరియల్: దివ్య, కడుపులో బిడ్డ సేఫ్, పాము పగ అంటూ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
/body>