Sudigali Sudheer: మల్లెపూలు నలిపేస్తూ ఉంటా - 'సుడిగాలి' సుధీర్
'సుడిగాలి' సుధీర్ తన రాజ్యంలో మల్లెపూలు నలిపేస్తూ ఉంటామని అంటున్నారు. ఆయన ప్లే బాయ్ ఇమేజ్ కంటిన్యూ చేస్తున్నారు.
'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) యువరాజు వేషం వేశారు. ఆయనతో పాటు ఆరుగురు అందమైన యువరాణులు కూడా ఉన్నారు. ఆయన రాజ్యానికి వినోదం పంచడం కోసం ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి వచ్చారు. బుల్లితెర వీక్షకులకు వినోదం పంచడం కోసం!
ఇక్కడ విషయం ఏంటంటే... 'సుడిగాలి' సుధీర్ రాజు వేషం వేయడం కాదు, ఆయన ప్లే ఇమేజ్‌ను కంటిన్యూ చేయడం! ఈ టీవీ ప్రోగ్రామ్స్ 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలు వదిలి... 'స్టార్ మా' ఛానల్‌లో సుధీర్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 'సూపర్ సింగర్ జూనియర్' ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేస్తున్నారు. ఇంకా ప్రతి ఆదివారం మిగతా ఆర్టిస్టులతో కలిసి స్పెషల్ స్కిట్స్‌తో కూడిన ఈవెంట్ చేస్తున్నారు. 'పార్టీ చేద్దాం పుష్ప' అంటూ గడిచిన రెండు ఆదివారాలు సందడి చేశారు. 'అంటే సుందరానికి' ఈ ఆదివారం సందడి చేయనున్నారు. లేటెస్టుగా ఆ ప్రోమో విడుదలైంది.
Also Read : 'గార్గి' రివ్యూ: ఎవరూ ఊహించని క్లైమాక్స్ - సాయి పల్లవి కొత్త సినిమా ఎలా ఉందంటే?
'అంటే సుధీర్ కి' అంటూ స్టార్ మా విడుదల చేసిన ప్రోమో చూస్తే... సుధీర్ ప్లే బాయ్ ఇమేజ్ కంటిన్యూ అయ్యింది. సుధీర్ రాజ్యానికి వచ్చిన ఒక యువరాణి మల్లెపూలు తీసుకొస్తుంది. 'నా కోసం మల్లెపూలు ఎందుకు తీసుకొచ్చారు?' అని అడిగితే... 'మా రాజ్యంలో ఎక్కువగా మల్లెపూలు పండిస్తూ ఉంటాం' అని ఆమె సమాధానం చెబుతుంది. అప్పుడు 'అదేంటో? మా రాజ్యంలో నలిపేస్తూ ఉంటాం' అని సుధీర్ అంటాడు. అదొక్కటే కాదు... అటువంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. కామెడీ కోసమో, రెమ్యూనరేషన్ కోసమో సుధీర్ ప్లే బాయ్ ఇమేజ్ ఇలా కంటిన్యూ చేయక తప్పదేమో!
Also Read : 'ది వారియర్' రివ్యూ: డాక్టర్ పోలీస్ అయితే? రామ్ సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram