Gargi Movie Review - 'గార్గి' రివ్యూ: ఎవరూ ఊహించని క్లైమాక్స్ - సాయి పల్లవి కొత్త సినిమా ఎలా ఉందంటే?

Gargi Telugu Movie Review: సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'గార్గి'. తెలుగు, కన్నడ భాషల్లో కూడా విడుదల చేశారు. తండ్రి కోసం ఓ కుమార్తె చేసిన న్యాయ పోరాటమే చిత్రకథ.

FOLLOW US: 

సినిమా రివ్యూ: గార్గి
రేటింగ్: 3/5
నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, కలైమామణి శరవణన్, ఆర్.ఎస్. శివాజీ, ఐశ్వర్య లక్ష్మి, జయప్రకాశ్ తదితరులు
మాటలు - పాటలు (తెలుగు) : రాకేందు మౌళి
సినిమాటోగ్రఫీ: Sraiyanti, Premkrishna Akkattu
సమర్పణ (తెలుగులో): రానా దగ్గుబాటి 
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాతలు: రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్ 
రచన, దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్ 
విడుదల తేదీ: జూలై 15, 2022

సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గార్గి' (Gargi Movie). తెలుగులో రానా దగ్గుబాటి... తమిళంలో సూర్య, జ్యోతిక దంపతులు సమర్పకులు. ఫస్ట్ లుక్ విడుదలయ్యే వరకూ సాయి పల్లవి ఇటువంటి సినిమా ఒకటి చేస్తుందనే విషయం బయటకు రాలేదు. ఫస్ట్ లుక్, ఆ తర్వాత ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది?

కథ (Gargi Movie Story): గార్గి (సాయి పల్లవి) ఒక స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం (ఆర్.ఎస్. శివాజీ)ది అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం. ఒక రోజు రాత్రి అయినా తండ్రి ఇంటికి రాకపోవడంతో అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వెళుతుంది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో తండ్రిని అరెస్ట్ చేశారని తెలుసుకుంటుంది. తన తండ్రి తప్పు చేయలేదని గార్గి బలంగా నమ్ముతుంది. తండ్రిని బయటకు తీసుకు రావడం కోసం న్యాయ పోరాటం మొదలు పెడుతుంది. ఆ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? గార్గి కుటుంబాన్ని సమాజం ఏ విధంగా చూసింది? తండ్రి నిర్దోషిగా బయటకు వచ్చాడా? లేదా? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ (Gargi Review) : మహిళలు, ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను స్పృశిస్తూ కొన్ని చిత్రాలు వచ్చాయి. 'లవ్ స్టోరి'లో సాయి పల్లవిదీ బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన పాత్రే. అందువల్ల, ఇది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. గతంలో వచ్చిన చిత్రాలకు, 'గార్గి'కి మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే... విక్టిమ్ ఫ్యామిలీ మానసిక క్షోభను మాత్రమే కాదు, దోషులుగా చిత్రీకరించబడిన కుటుంబ పరిస్థితిని చూపించిన చిత్రమిది.

ఎటువంటి అశ్లీలత, అసభ్యత లేకుండా బాలికలు లైంగిక వేధింపులకు గురైన సన్నివేశాలను చూపించిన చిత్రంగా 'గార్గి' నిలుస్తుంది. సీన్‌లో సోల్ చూపించారు తప్ప... సెక్సువల్ సీన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సున్నితమైన విషయాలను చక్కగా చూపించారు. తప్పును తప్పు అని చెప్పారు. 

అత్యాచార ఘటనల తర్వాత దోషులను కఠినంగా శిక్షించాలని... ఎన్‌కౌంట‌ర్‌ చేయాలని, ఉరి తీయాలని డిమాండ్స్ చేసే ప్రజలు కనిపిస్తారు. కోర్టులు తీర్పు ఇవ్వకముందే అరెస్ట్ అయిన వారిపై రేపిస్ట్ ముద్ర వేస్తారు. 'గార్గి'లోనూ అటువంటి ప్రజలున్నారు. కానీ, అంతకు మించి బలమైన ఎమోషన్ కూడా ఉంది. కాయిన్‌కు అదర్ సైడ్... రేపిస్ట్ ఫ్యామిలీ పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? అనేది చూపించారు. ఓ వ్యక్తి చేసిన దారుణానికి అతని ఫ్యామిలీని అలా శిక్షించడం సరికాదేమో అనే ఆలోచన రేకెత్తిస్తుంది.

'గార్గి' దర్శకుడు గౌతమ్ రామచంద్రన్‌ను మెచ్చుకోవాలి. ఎందుకంటే... అతను ఎవరి పక్షాన నిలబడలేదు. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన తండ్రిని విడిపించడం కోసం కుమార్తె పడుతున్న కష్టం చూసి చలించేలా చేశారు. అత్యాచారానికి గురైన చిన్నారి తండ్రి బాధను ఫీలయ్యేలా చేశారు. కోర్టుకు కావాల్సింది నమ్మకాలు, సాక్ష్యాలు కాదని... ఆధారాలు అని మరోసారి చెప్పారు. ఎక్కడా లాజిక్స్ మిస్ కాలేదు. కథగా చూస్తే... 'గార్గి' చాలా చిన్నది. కానీ, దర్శకుడు ఇచ్చిన సందేశం పెద్దది. 'గార్గి' బాల్యాన్ని, వర్తమానాన్ని చూపించిన తీరు... స్క్రీన్ ప్లే బావుంది. జాగ్రత్తగా గమనిస్తే... ఎల్లో డ్రస్, కత్తి వంటి విషయాల్లో దర్శకుడి డిటైలింగ్ తెలుస్తుంది.  

'గార్గి' కథ చిన్నది. నిడివి కూడా తక్కువే. అయినప్పటికీ... నిడివి ఎక్కువైన ఫీలింగ్. ఎటువంటి అనవసర సన్నివేశాలు లేకుండా నేరుగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు. సాయి పల్లవి పాత్రను పరిచయం చేసిన వెంటనే ఆమె తండ్రి అరెస్ట్... సమాజం నుంచి ఎదురవుతున్న పరిస్థితులు... కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత కథ ముందుకు కదలదు. కోర్ట్ రూమ్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు... 'గార్గి'లో కోర్ట్ సీన్స్ అంత ఆసక్తిగా అనిపించవు. ఇంటర్వెల్‌కు ముందు, తర్వాత సీన్స్‌లో మెలోడ్రామా ఎక్కువైంది. మళ్ళీ క్లైమాక్స్‌లో ముందు గాడిలో పడింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. కుమార్తె పాత్ర మీద పెట్టిన శ్రద్ధ, కుటుంబంలో ఇతర సభ్యులపై దర్శకుడు పెట్టలేదు. భర్త జైల్లో ఉంటే... ఒక సన్నివేశంలో అమ్మాయితో తల్లి ప్రవర్తించే తీరు వింతగా ఉంటుంది.

టెక్నికల్‌గా 'గార్గి' హై స్టాండర్డ్స్‌లో ఉంది. ఇంటర్వెల్ ముందు సాంగ్ యాక్సెప్ట్ చేయడం కష్టమే. అయితే, గోవింద్ వసంత నేపథ్య సంగీతం మాత్రం హైలైట్. సినిమాలో డైలాగులు తక్కువ. నేపథ్య సంగీతమే ఎక్కువ మాట్లాడింది. సినిమాలో ఫీల్‌ను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. కెమెరా వర్క్ బావుంది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ కూడా!

నటీనటులు ఎలా చేశారు?: సాయి పల్లవి చక్కటి నటన కనబరిచారు. ఎప్పటిలా పాత్రలో ఒదిగిపోయారు. తమిళ ప్రేక్షకులకు సాయి పల్లవిని ఇటువంటి పాత్రలో  చూడటం కొత్త ఏమో... తెలుగు ప్రేక్షకులకు కాదు! ఆల్రెడీ ఆమెలో అద్భుతమైన నటిని చూసిన తెలుగు వాళ్లకు... మరోసారి మంచి పాత్రలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ బాగా నటించారు. బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్ నటన కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా సాయి పల్లవి ఇంటికి వచ్చిన సన్నివేశంలో ఆయన ఏడిపించారు. జడ్జ్ పాత్రకు ట్రాన్స్‌జెండ‌ర్‌ను తీసుకోవడంలో నటీనటుల ఎంపికలో దర్శకుడి ప్రత్యేకత కనిపిస్తుందో. జయప్రకాశ్, ఐశ్వర్య లక్ష్మీ రెండు మూడు సన్నివేశాల్లో కనిపిస్తారు. వాళ్ళిద్దరూ ఓకే.

Also Read : 'ది వారియర్' రివ్యూ: డాక్టర్ పోలీస్ అయితే? రామ్ సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే?: ఎమోషనల్ డ్రామా ఫిలిమ్స్, కొత్త తరహా కంటెంట్ కోరుకునే ప్రేక్షకులకు నచ్చే సినిమా 'గార్గి'.  కొన్ని సన్నివేశాలు కంట తడి పెట్టిస్తాయి. సాయి పల్లవి మరోసారి అద్భుతంగా నటించారు. ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించే చిత్రమిది. సమాజంలో మహిళల భద్రత విషయంలో సందేశం ఇచ్చే చిత్రమిది. ఎవరూ ఊహించని క్లైమాక్స్ సినిమాకు ప్లస్ అండ్ మైనస్. న్యాయం కోసం నిలబడిన మహిళగా 'గార్గి'ని అభినందించాలనే ఆలోచన ప్రేక్షకుల్లో వస్తే సినిమా నచ్చుతుంది. లేదంటే అప్పటివరకూ క్రియేట్ అయిన ఇంపాక్ట్ పోతుంది.

Also Read : 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' రివ్యూ: మోడ్రన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ ఎలా ఉంది?

Published at : 15 Jul 2022 01:52 AM (IST) Tags: ABPDesamReview Gargi Review In Telugu Gargi Telugu Review Sai Pallavi's Gargi Review Gargi Rating

సంబంధిత కథనాలు

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

టాప్ స్టోరీస్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?