Seethe Ramudi Katnam Serial Today April 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఎల్లుండే గౌతమ్, మిధునల నిశ్చితార్థం.. సీత ఇలా చేస్తుందేంటి?
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ సీత సంతకం పెట్టిన పేపర్ మిధునకు చూపించడం మిధున నిశ్చితార్థం ఏర్పాటు చేయమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇచ్చిన పౌడర్ కలిపిన పాలు తాగిన సీత రామ్ గదిలోకి వచ్చి రామ్‌తో మత్తు మత్తుగా ప్రవర్తిస్తుంది. రా మామ బయటకు వెళ్లి గోదారి గట్టు మీద రామచిలుకవే అని ఇంకో రౌండ్ వేసుకుందామని అంటుంది. సీత తాగావా అని రామ్ అంటాడు. ఇంతలో మహాలక్ష్మీ, అర్చన అక్కడికి వస్తారు. సీతకి స్క్రూ లూజ్ అయిందని మహా రామ్‌తో సైగ చేసి బలవంతంగా సీతని తీసుకొని బయటకు వెళ్తారు.
మహాలక్ష్మీ సీతని తీసుకెళ్లి తన గదిలో పెడుతుంది. రామ్ నన్ను గెంటేస్తాడంట న్న్ను ఎలా గెంటేస్తాడు. అని అంటుంది. నేను ఉండగా నిన్ను ఎవరు గెంటేస్తారు సీత అని మహాలక్ష్మీ అంటుంది. దాంతో సీత మా మంచి అత్త అని మహాలక్ష్మీని ముద్దు పెట్టుకుంటుంది. నువ్వొక పని చేయాలి సీత అని మహా అంటే మీరేం చెప్పినా చేస్తాను అత్త అంటుంది. దాంతో మహాలక్ష్మీ గౌతమ్ గురించి మంచిగా రాసిన పేపర్ ఇచ్చి సంతకం పెట్టమని అంటుంది. మీ కోసం నా ప్రాణమే ఇస్తా అత్తా సంతకం ఒక లెక్కా అని సీత సంతకం పెడుతుంది. తర్వాత మహాలక్ష్మీ, అర్చనలు సీతని పడుకోపెట్టి పేపర్ తీసుకొని వెళ్లిపోతారు. సీతని తీసుకొచ్చిన పని అయిపోయిందని మహాలక్ష్మీ అర్చనతో చెప్తుంది.
మహాలక్ష్మీ, అర్చనలు ఉదయం ఆ లెటర్ తీసుకొని ముఖర్జీ ఇంటికి వెళ్తారు. ఇంత ఉదయం ఏంటి వచ్చారు అని అడుగుతారు. దాంతో మహాలక్ష్మీ మాకు కాబోయే కోడలితో మాట్లాడాలి అంటుంది. మిధున పేరు పెట్టగానే ముఖర్జీ చాలా కంగారు పడతారు. దాంతో అర్చన మిధున, సీత ఒక్కరే మహా అందుకే ఇంత కంగారు పడుతున్నారని అంటుంది. ఇంతలో మిధున గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పి వస్తుంది. మహాలక్ష్మీ వాళ్లకి హాయ్ చెప్తుంది. నాకు ఎక్కడో తేడా కొడుతుంది మహా అని అర్చన అంటుంది. ఇక మహాలక్ష్మీ మిధునకు పేపర్ ఇచ్చి గౌతమ్ ఎలాంటివాడో సీత మేటర్ రాసి సంతకం పెట్టి ఇచ్చిందని అంటుంది. ఇది సీత సంతకమా అని మిధున అంటుంది. ముఖర్జీ చూసి ఇది సీత సంతకమే అని చెప్తారు. ఇక మిధున గౌతమ్‌తో నిశ్చితార్థం ముహూర్తం పెట్టించమని అంటుంది. ముఖర్జీ పంతుల్న అడిగానని ఎల్లుండి మంచి ముహూర్తం అని చెప్తారు. నిశ్చితార్థం మా ఇంట్లో పెట్టుకుందామని మహాలక్ష్మీ అంటుంది. మిధున సరే అంటుంది.
అర్చన వెళ్తూ ఇంట్లో సీత ఉందా లేదా చూద్దాం త్వరగా వెళ్దామని అంటుంది. మిధునలా ఉన్న సీత మహాలక్ష్మీ వాళ్ల కంటే ముందు వెళ్లాలి అని ముఖర్జీతో చెప్పి బయల్దేరుతుంది. ఇక అర్చన గిరికి కాల్ చేసి సీత ఇంట్లో ఉందో లేదో చెప్పమని సీత గది దగ్గరకు వెళ్లి చూడమని చెప్తుంది. గిరి సీత గదికి వెళ్తాడు. సీత దిండులు పేర్చడంతో సీత పడుకొని ఉందనుకొని సీత ఇంట్లోనే ఉందని చెప్తాడు. అర్చన షాక్ అయిపోతుంది. ఇక సీత ఇంటికి మహా వాళ్ల కంటే ముందు వచ్చేసి ఇంటి వెనక నుంచి పైపులు ఎక్కి గదిలోకి వెళ్లిపోతుంది. మహాలక్ష్మీ వాళ్లు ఇంటికి వస్తారు. మిధున, గౌతమ్‌లకు ఎల్లుండి నిశ్చితార్థం అని చెప్తారు. గౌతమ్ ఎగిరి గంతేస్తాడు. రామ్ రాగానే గౌతమ్ రామ్‌ని పట్టుకొని సంతోషంగా చెప్తాడు. రామ్ మాత్రం చిరాకు పడతాడు. సీత ఇరిటేట్ చేస్తుందని సీతని పంపేయమని అంటాడు. దానికి మహాలక్ష్మీ సీతని తీసుకొచ్చిందే మీ ఇద్దరినీ కలపడానికి అని చెప్తుంది. ఇంతలో సీత కూడా కిందకి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: రాజు, కావేరి చేతుల రాములవారి కల్యాణం.. చిన్ని ఊహ నిజం అవుతుందా!





















