Chinni Serial Today April 12th: చిన్ని సీరియల్: రాజు, కావేరి చేతుల రాములవారి కల్యాణం.. చిన్ని ఊహ నిజం అవుతుందా!
Chinni Today Episode రాజు, ఉషల చేతుల మీదుగా సీతారాముల కల్యాణం కనువిందుగా జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode ఉష పడిపోతే రాజు పట్టుకుంటాడు. తనని పట్టుకున్నందుకు ఉష రాజుని తిడుతుంది. రాజు చిలిపిగా నవ్వుకుంటాడు. చిన్ని ఏం తెలీనట్లు ఉష దగ్గరకు వెళ్లి తన మీద పువ్వులేంటి టీచరమ్మ అని అడుగుతుంది. గాలికి పడ్డాయని ఉష కవర్ చేస్తుంది. ఇక రాజు దగ్గరకు దేవా వస్తాడు.
దేవా: ఏంటి బాల ఇలా కొత్త పెళ్లి కొడుకులా తయారై వచ్చావ్.
రాజు: గుడికి వచ్చినప్పుడు ఇలా ట్రెడిషనల్‌గా రెడీ అయి రావాలి కదా మిత్రమా.
దేవా: అంత ట్రెడిషన్‌ని ఫాలో అయ్యే వాడివి గుడిలో ఇలాంటివి ఏంటి బాల. పైగా నీకు కూతురు కూడా ఉంది. ఇలాంటి రొమాంటిక్ సీన్స్ అవసరమా.
రాజు: హలో అది రొమాంటిక్ సీన్ కాదు సిచ్యువేషన్ డిమాండ్ చేసే సీన్. తను పడిపోబోతుంటే పట్టుకున్నా అంతే.
దేవా: అంతేనా తను కావేరి అని అలా పట్టుకున్నావా.
రాజు: అవును తను కావేరినే. తను కావేరి కాబట్టే తనతో క్లోజ్‌గా ఉన్నాను. తను కావేరి కాబట్టే తనకి కాపలా కాస్తున్నా ఇలా చేస్తే నీకు ఓకేనా. కానీ ఇది నిజం కాదు. తను టీచర్ తను పని చేసే స్కూల్‌లో పిల్లలకు నేను ఆటోలో తీసుకెళ్తున్నా కాబట్టి తను తెలుసు. కాదు నీకు నచ్చినట్లు అనుకుంటా అంటే అది నీ ఇష్టం.
దేవా: తను కావేరి కాదు కాబట్టి తనని ఏం చేసినా నువ్వు రియాక్ట్ అవ్వవు కదా..
రాజు: అవుతానో లేదో తనని టచ్ చేసి చూడు తెలుస్తుంది. నా రియాక్షన్‌లు నా కంటే నా మిత్రుడిగా నీకే బాగా తెలుసు కదా. గుడికి వచ్చావ్ దర్శనం చేసుకో.
ఉష: చిన్ని ఆ డ్రాలో మా ఇద్దరి పేర్లు ఎలా వచ్చాయ్ నువ్వు రాశావా.
చిన్ని: నేను రాయలేదు ఆ దేవుడే రాసుంటాడు.
చిన్ని ఉషలు మాట్లాడుకుంటూ నడిచి వెళ్తుంటే నాగవల్లి ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తుంది. చిన్నిని ఢీ కొట్టి నాగవల్లి బురదలో పడిపోతుంది. నాగవల్లి డ్రస్ ఫోన్ పోతాయి. దాంతో నాగవల్లి చిన్నిని కొట్టబోతుంది. దాంతో ఉష నాగవల్లి చేయి పట్టుకొని నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి నువ్వు గుద్ది పడిపోయి చిన్నిని అంటావేంటి ఇలా నీ తప్పు చిన్నీ మీద రుద్దాలి అనుకుంటే తాటతీస్తా అని తిడుతుంది. నాగవల్లి గొడవకు వెళ్లబోతే తన పెద్దక్క ప్రమీల నాగవల్లిని ఆపి బట్టలు కొని మార్చుకుందామని తీసుకెళ్లుంది.
పంతులు రాజుకి పట్టుబట్టలు ఇచ్చి మార్చుకోమని చెప్తాడు. ఇక ఓ చోట సత్యంబాబు ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటే అక్కడికి చిన్ని, ఉషలు వెళ్తారు. ఏమైందని అడుగుతుంది. దాంతో సత్యంబాబు ఆ రాజుతో నువ్వు పూజ చేయడం నాకు ఇష్టం లేదని అంటుంది. ఉష కూడా తనకు ఇష్టం లేదు ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తున్నా అని అంటుంది. దాంతో చిన్ని మీ ఇద్దరి ఆలోచనలు తప్పు ఆ స్వామి వారు మీ ఇద్దరితో ఎందుకు కల్యాణం చేయించుకోవాలి అనుకున్నారో తెలీదు కదా అని ఉష, సత్యంబాబు ఇద్దరినీ ఒప్పిస్తుంది.
కల్యాణం మొదలవుతుంది. బాలరాజు రాములవారి విగ్రహం పట్టుకుంటే ఉష సీతమ్మ విగ్రహం పట్టుకుంటుంది. అందరూ వారి వెనక ఊరేగింపుగా నడుస్తారు. రామయ్య, సీతమ్మ ఇద్దరినీ తీసుకొచ్చి కల్యాణ మండపంలో పెడతారు. తన కుటుంబం బాగుండాలని ఉష, కావేరి, చిన్నిలు బాగుండాలని రాజు, అమ్మానాన్న కలిసిపోవాలని చిన్ని కోరుకుంటారు. ఇక రాజు, ఉషల చేతుల మీదుగా కల్యాణం జరుగుతుంది. నాగవల్లి, దేవాలు ఉషని చూసి కోపంతో రగిలిపోతుంటారు. తల్లిదండ్రలు సంతోషంగా పక్కపక్కన కూర్చొని తనతో పాటు కలిసి పూజ చేసినట్లు తల్లీ తండ్రీ కలిసిపోయినట్లు చిన్ని ఊహించుకుంటుంది. తర్వాత ఇద్దరినీ వేరు వేరుగా చూసి కన్నీరు పెట్టుకుంటుంది.
ప్రమీల దేవా, నాగవల్లితో మన చేతిలో ఒక్క పని జరగలేదని కల్యాణం మొత్తం ఆ టీచర్ వాళ్లే చేశారని అంటుంది.దాంతో నాగవల్లి మండిపోతున్న మమల్ని నువ్వు రెచ్చగొట్టినట్లందని అంటుంది. ఇక ప్రమీలను మహి కోసం వల్లి పంపేస్తుంది. దేవా కూడా వదిన గారిని వెళ్లిపోమంటాడు. బావమరదళ్లు మాట్లాడుకోవడానికి తనని పంపేస్తున్నారని ప్రమీల ఫీలైపోతుంది. ఇక ఉష వాళ్లని ఏదో ఒకటి చేయమని నాగవల్లి అంటుంది. తన ప్లాన్‌లో తాను ఉన్నానని తన ఐడియా నాగవల్లికి చెప్తాడు. ఇక పంతులు అందరినీ స్వామి వారి పల్లకీ సేవకి పిలుస్తారు. రాజు, ఉష, సత్యం బాబు అందరూ పల్లకి మోస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాధికని కాపాడి జీవన్‌ని బెదిరించిన తల్లీకొడుకులు.. ఆస్తి రాసిచ్చేసిన రూప!





















