అన్వేషించండి

Satyabhama Serial Today May 8th : సత్యభామ సీరియల్: వారసుడిని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని సత్యని ప్రశ్నించిన మహదేవయ్య.. హర్షని ఘోరంగా అవమానించిన నందిని!

Satyabhama Serial Today Episode : ముడుపు కాలిపోవడంతో సత్య, క్రిష్‌లను గుడికి తీసుకెళ్లిన మహదేవయ్య వారసులను ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని సత్యని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : భైరవి నందినికి కాల్ చేస్తుంది. పదహారు రోజుల పండగ పెట్టావ్ అని నందిని తల్లి మీద సీరియస్ అవుతుంది. దీంతో భవాని నేను కాదు బిడ్డ మీ అత్తే నాకు ఫోన్ చేసి చెప్పిందని అంటుంది. కుదరదు అని చెప్పలేదని నందిని సీరియస్ అవుతుంది. దీంతో భైరవి కూతురికి సర్దిచెప్తుంది.

భైరవి: రేపు జరిగే పదహారు రోజుల పండగ నీకు నిజంగానే పండగ అవుతుంది. 

నందిని: అది ఎలా అవుతుందే.. నీ మాటలు వినే నేను ఇక్కడి వరకు తెచ్చుకున్నాను. నాకు విముక్తి ఎప్పుడు. ఇక భైరవి ఈరోజు ఏం చేయాలో ఆ ప్లాన్ కూతురికి చెప్తుంది. 

నందిని: నాకు జ్వరం వస్తే ఏమవుతుందమ్మా. 

భైరవి: అది ఎట్లానో రేపు తెలుస్తుంది. నువ్వు హ్యాపీగా పడుకో. 

ఇంతలో హర్ష నందిని దగ్గరకు వస్తాడు. తమ పెళ్లి జరిగి పదహారు రోజులు అయిందని ఇద్దరం కలిసి వెళ్లి బంగారం కొనాలని అంటాడు. దీంతో నందిని బంగారం కొనడం అంటే చికెన్ కొనడం కాదని హర్షని తక్కువ చేసి మాట్లాడుతుంది. అయినా హర్ష ఓపికతో మాట్లాడుతాడు. బంగారం కొనడానికి వెళ్దామని అంటాడు.

నందిని: అదంతా మా అమ్మ చూసుకుంటుందిలే. 

హర్ష: అది నా బాధ్యత.

నందిని: మోయలేని బాధ్యత నెత్తిన పెట్టుకోకు మోయలేవు. 

హర్ష: అది నేను చూసుకుంటాలే.

నందిని: నీకు అర్థం కావడం లేదు నన్ను బంగారం షాపునకు తీసుకెళ్లడం అంటే చిన్న పిల్లల్ని ఐస్‌క్రీమ్‌ షాపుకి తీసుకెళ్లినట్లే నువ్వు భరించలేవు. నీ జీతం సరిపోదు నీ జీవితం సరిపోదు. 

హర్ష: పర్లేదు. 

నందిని: సరే పద పోదాం.

హర్ష, నందినిని తీసుకొని గోల్డ్ షాపునకి వస్తాడు. ఆ షాపు చిన్న ఉండటంతో నందిని చులకనగా మాట్లాడుతుంది. అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ గురించి అడుతుంది. అది ఫ్యూర్ గోల్డ్ షాప్ అని యజమాని చెప్పడంతో హర్షని వెటకారం చేస్తుంది. ఇది ఫ్యూర్ గోల్డ్ షాప్ అంట మన వల్ల ఎక్కడవుతుందని అంటుంది. నువ్వేదో ఆవేశ పడుతున్నావ్ ఒకసారి ఆలోచించుకో అని నందిని అంటుంది. 

నందిని సెలక్ట్ చేసిన చైన్ నాలుగు లక్షలు ఉండటంతో హార్ష ఆలోచిస్తాడు. మళ్లీ వస్తామని అంటే సేటు విశ్వనాథం తన రెగ్యులర్ కస్టమర్ అని ఏం పర్వాలేదు అని గోల్డ్ ఇస్తాడు.

సత్య: తనలో తాను.. కలిసి కాపురం చేసే ఉద్దేశం లేకపోయినా అప్పుడు ముడుపు కట్టాను అందుకే అది కాలిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్లి మళ్లీ చేసేది అదే కదా. మరో సారి ముడుపు కట్టడం. ఆరు నెలల్లో విడాకులు తీసుకొనే నేను ముడుపు ఎలా కట్టను. అలా అని గుడికి వెళ్లడం మానేస్తే కారణం అడుగుతారు. నిజం చెప్పలేం. మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడే చేయను. ఇంతలో క్రిష్ వస్తాడు. దీంతో సత్య క్రిష్‌ని తిడుతుంది.

క్రిష్: నేను నీలా శాడిస్ట్‌ని కాదు. ఆరు నెలలు కలిసి ఉంటాం కదా. ఫ్రెండ్స్‌లా ఓదార్చుదామని వచ్చాను.

సత్య: నీ బోడి ఓదార్పు నాకు అవసరం లేదు. ఇన్నాళ్లు ఇంట్లో ఎవరు ఏమన్నా నాకు సపోర్ట్‌గా నిలిచి ప్రేమ అనే వాడిని ఈరోజు ఏమైంది ఆ ప్రేమ. ఎందుకు నాకు సపోర్ట్‌గా  మాట్లాడలేదు. ఎందుకంటే మనం విడాకులు తీసుకుంటున్నాం కాబట్టి ఏం ప్లాన్ చేసినా నేను నీకు లొంగను కాబట్టి. లేని ప్రేమను చంపుకున్నావ్ అంతే కదా.  నీది స్వార్థం నిండిన ప్రేమ ఒప్పుకో.

క్రిష్: నేను ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకోవు కదా. నీ ఆలోచనకే నువ్వు ఫిక్స్ అయిపోతావు కదా. అయినా నీ ప్రశ్నకు సమాధానం చెప్తా నమ్ముతావో లేదో నీ ఇష్టం. ముడుపు కాలిపోవడం అనేది మా బాపు దృష్టిలో చాలా పెద్ద నేరం. నేను నీకు సపోర్ట్‌గా మాట్లాడితే నీ మీద మరింత కోపం పెంచుకుంటాడు. మెడ పట్టుకొని బయటకు గెంటేసినా గెంటేస్తాడు. అందుకే నేను మాట్లాడలేదు. ఈ ఒక్క రోజు ఓపిక పడితే రేపు గుడిలో పరిహారం జరిగి సమస్య పరిష్కారం అవుతుందని ఆగిపోయా అర్థమైందా.

ఇంతలో సత్యకు విశాలాక్షి ఫోన్ చేస్తుంది. ఇక సత్య ముడుపు కాలిపోవడం గురించి చెప్తుంది. గుడిలో దోష పరిహారం చేయించి మళ్లీ ముడుపు కట్టిస్తారని చెప్తుంది. ఇక విశాలాక్షి వాళ్లు ఏం చెప్తే అది చేయమని అంటుంది. 

మరోవైపు నందిని వాళ్ల అమ్మ చెప్పినట్లు తనకు జ్వరం రావాలని ఉల్లిపాయల కోసం కిచెన్‌కు వస్తుంది. ఇక విశాలాక్షి అక్కడికి వచ్చి ఏం కావాలని అడిగితే నీళ్లు తాగడానికి వచ్చానని చెప్తుంది. ఇక నందిని అత్త వెళ్లిపోగానే ఉల్లిపాయలు తీసుకెళ్తుంది. ఉదయం చెక్ చేసుకుంటుంది. హర్ష వస్తే జ్వరం వచ్చినట్లు నటిస్తుంది. మరోవైపు అందరూ గుడికి చేరుకుంటారు. 

మహదేవయ్య: ముడుపు పూజ షురూ చేసే ముందు నా కొడుకు కోడలికి ఓ విషయం అడగాలి అనుకుంటున్నాను. 

భైరవి: జరిగిన తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఎవరిని అడిగి ఏం లాభం. దోష పరిహారం జరగాలి కదా. 

మహదేవయ్య: జరిగిన దాని గురించి కాదు నా ఆలోచన మళ్లీ ఇలాంటి తప్పు జరుగుతుందేమో అని నా అనుమానం. 

విశాలాక్షి: మళ్లీ ఆ తప్పు ఎందుకు జరుగుతుంది అన్నయ్య గారు. అదేదో పొరపాటున..

మహదేవయ్య: తెలియక చేస్తే పొరపాటు అంటారు. తెలిసి చేస్తే తప్పు అంటారు. ఎవరికి తెలుస్తుందిలే అని చేస్తే మోసం అంటారు. జరిగింది పొరపాటా, తప్పా, మోసమా అని నేను ఆలోచించడం లేదు. గుడిలో అందరి ముందు అడుగుతున్నా నిజం చెప్పాలి. నా వంశాన్ని వారసుడిని ఇవ్వాలి అని నీ మనసులో ఉందా లేదా. 

విశ్వనాథం: మీకు అనుమానం అక్కర్లేదు బావగారు. సత్య మీ ఇంటి కోడలు. వంశానికి వారసుడిని ఇవ్వాలని ఏ కోడలు అయినా కోరుకుంటుంది.

మహదేవయ్య: అందరి కోడళ్ల గురించి నాకు అవసరం లేదు. నేను అడిగింది సత్యను నాకు సమాధానం చెప్పాల్సింది సత్య అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: రిపోర్ట్స్ చూపించి తప్పించుకున్న కృష్ణ.. ఆదర్శ్, ముకుందల చనువు చూసి ఇంట్లో వాళ్లు షాక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget