అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today May 8th : కృష్ణ ముకుంద మురారి సీరియల్: రిపోర్ట్స్ చూపించి తప్పించుకున్న కృష్ణ.. ఆదర్శ్, ముకుందల చనువు చూసి ఇంట్లో వాళ్లు షాక్!

Krishna Mukunda Murari Today Episode : ఆదర్శ్‌, ముకుంద కలిసి షాపింగ్ చేసి రావడంతో ఇంట్లో అందరూ వాళ్లు ప్రేమలో ఉన్నారని అనుకోవడంతో ఇవాళ్టి ఎసిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode : భవాని తన ఫ్రెండ్‌ అమెరికాలో డాక్టర్ అని అమృతని పరిచయం చేస్తుంది. డాక్టర్ అమృత కృష్ణకు టెస్ట్‌లు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుందని అనడంతో కృష్ణ, మురారి ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. 

ముకుంద: మనసులో.. ఈ డాక్టర్ కృష్ణ నాడి పట్టుకొని చూస్తే ప్రెగ్నెంట్‌ కాదని తెలిసిపోతుంది. అప్పుడు నా సరోగసీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. తెలిస్తే తెలీని మురారి ఎలాగోలా అత్తయ్యని ఒప్పిస్తాడు. నా విలువ పెరుగుతుంది. కృష్ణ విలువ తగ్గుతుంది.

అమృత: రామ్మా..

కృష్ణ: వద్దండి అవసరం లేదు. 

భవాని: ఏయ్ టెస్ట్‌లు చేస్తాను అంటే వద్దు అంటావ్ ఏంటి రా వచ్చి కూర్చో. 

కృష్ణ: ఇప్పుడు ఈ టెస్ట్‌లు అవి ఎందుకు పెద్దత్తయ్య. ఆంటీ మీకు మా అత్తయ్య చెప్పలేదేమో నేను కూడా డాక్టర్‌నే. 

అమృత: అవునా నాకు తెలీదు. నాకు ఈ విషయం చెప్పలేదు ఏంటి భవాని. తనే డాక్టర్ అయితే ఇక నేను చూసేది ఏముంది. 

భవాని: అమృత ఎవరనుకున్నారు సీరియర్ గైనకాలజిస్ట్ తనోసారి చూసి చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది. 

ముకుంద: మనసులో.. ఏం చేసినా తప్పించుకోలేరు మురారి. 

కృష్ణ వద్దు అంటుంటే భవాని, రేవతి ఒప్పుకోరు. దీంతో కృష్ణ కవర్ చేయడానికి ఉదయమే హాస్పిటల్‌లో టెస్ట్‌లు చేశారని చెప్తుంది. దాంతో అమృత రిపోర్ట్ తీసుకురమ్మని అంటుంది.

కృష్ణ: సరే తెస్తాను.. అయినా నేను మెట్లు ఎక్కి దిగితే పెద్దత్తయ్య తిడతారు. ఏసీపీ సార్ మీరు వెళ్లి మన గదిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకురండి అని మురారిని ఇరికించేస్తుంది.

మురారి: మనసులో.. రిపోర్ట్స్‌ ఎక్కడున్నాయి తింగరి. ఇలా ఇరికించేసింది ఏంటి నన్ను. ఓసేయ్ తింగరి ఎలానే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలే. 

ముకుంద: మనసులో.. దొరకకుండా ఉండటానికి ఏదో నాటకం ఆడుతుంది. కానీ రిపోర్ట్స్ అయితే చూపించలేదు ఇప్పుడు ఏం చేస్తుంది.

మురారి: రిపోర్ట్స్ తీసుకొచ్చి.. మనసులో.. నీ ముందు చూపునకు హాట్స్ ఆఫ్ కృష్ణ. 

డాక్టర్ అమృత రిపోర్ట్స్‌ చూసి అంతా ఒకే అంటుంది. ఇక అమృత వెళ్తాను అని అంటుంది. భవాని దగ్గరుండి అమృతని పంపిస్తుంది. ఇక మురారి కృష్ణకు తన ఐడియా సూపర్ అని కను సైగతో చెప్తాడు.

ముకుంద: మనసులో.. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ముందు జాగ్రత్తతో ఓ ఫైల్ రెడీ చేసుకొని పెట్టుకుందన్నమాట. చూస్తా ఇంకా ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటుందో. ఈ రోజు దొరికిపోతే అది సానుభూతి.. రేపు దొరికితే అది మోసం. అప్పుడు అత్తయ్య కృష్ణని ఇంటి నుంచి గెంటేస్తుంది. 

ఇక ఆదర్శ్.. ముకుంద దగ్గరకు వచ్చి షాపింగ్‌కు వెళ్దామని అంటాడు. ముకుంద లోపల తిట్టుకుంటూనే సరే అంటుంది. ఇక ముకుంద మురారి దగ్గరకు వెళ్తుంది. 

మురారి: మీరా ఒప్పుకుంది కాబట్టి సరోగసీ ప్రాబ్లమ్ తప్పింది కానీ నెల తప్పింది అనుకొని పెద్దమ్మ పూజలకు ఏర్పాట్లు చేస్తుంది ఇప్పుడెలా. ఇప్పుడు మ్యానేజ్ చేస్తున్నాం మూడు నెలలు నిండాక ఎలా.

ముకుంద: మురారి గారు సరోగసీ ప్రాబ్లమ్ తీరింది కదా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు.

మురారి: నీ దయవల్ల అది తీరిపోయింది కానీ ఇంట్లో క్షణానికి ఓ కొత్త టెన్షన్ పుట్టుకొస్తుంది. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి. 

ముకుంద: కృష్ణ అంత ఈజీగా దొరకదులే మురారి గారు. కృష్ణకు ధైర్యం చెప్పిన మీరే ఇలా అంటే ఎలా. అయినా ఓ మంచి ఉద్దేశంతో చేసే పనికి ఏ ఆటంకం ఉండదు. ఇంట్లో ఏదో పూజ చేస్తున్నారు కదా.

మురారి: అవును అందరి దృష్టిలో కృష్ణ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలని చేస్తున్నారు. మా దృష్ణిలో పుట్టబోయే మా బిడ్డని.. ఆ బిడ్డని మోస్తున్న తల్లి బాగుండాలని పూజ చేస్తాం. 

ముకుంద: అంటే నేను బాగుండాలి అని కదా.

మురారి: అంతే కదా మీరా నువ్వు బాగుంటేనే మేం బాగుంటాం. 

కృష్ణ.. అమృత ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. ఇద్దరూ తమ బిడ్డ కోసం అబద్ధాలు చెప్పుకోవడం వాటి నుంచి తప్పించుకోవడానికి సాక్ష్యాలు సృష్టించుకోవడం బాధగా ఉందని అంటుంది. 

ఇక పంతులు ఇంటికి వస్తాడు. భవాని పూజ గురించి పంతులికి చెప్తుంది. ఇంతలో ఆదర్శ్‌, ముకుందలు షాపింగ్ నుంచి ఇంటికి వస్తారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎక్కడికి వెళ్లారని భవాని అడుగుతుంది. దీంతో ఆదర్శ్‌ ముకుందకి చీరలు కొనడానికి తీసుకెళ్లానని చెప్తాడు. ఇక మురారి, మీరాకి చీరలు కొని మంచి పని చేశావని ఆదర్శ్‌ని మెచ్చుకుంటాడు. దీంతో కృష్ణ మురారిని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

కృష్ణ: తనలో తాను.. అసలు మీరా ఎందుకు ఇంత చీప్‌గా ప్రవర్తిస్తుంది. తాను నిజంగానే ఆదర్శ్‌ని ఇష్టపడి చనువుగా ఉంటే ఇద్దరికీ పెళ్లి చేయొచ్చు. కానీ సంగీతకి ఆదర్శ్‌తో పెళ్లి చేస్తానని రజిని పిన్నికి మాటిచ్చి ఆదర్శ్‌తో చనువుగా ఉండటం ఏంటి. ఏదో ఒకటి చేయాలి లేదంటే ఆదర్శ్ అన్యాయం అయిపోతాడు. 

ఇక మురారి గదిలోకి వచ్చి కాలు చేయి నొప్పి అని నటిస్తాడు. కృష్ణ కంగారు పడుతుంది. దీంతో మురారి కృష్ణని దగ్గరకు తీసుకుంటాడు. కృష్ణ మరోసారి సరోగసీ మదర్ గురించి మురారిని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద దీప, కార్తీక్‌లను చూసిన అనసూయ.. జ్యోత్స్న డైమండ్ నెక్లెస్ శౌర్య దొంగతనం చేసిందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Swati Sachdeva: రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి  కుళ్లు జోకులు
రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి కుళ్లు జోకులు
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
Embed widget