Karthika Deepam 2 Serial Today May 8th: కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద దీప, కార్తీక్‌లను చూసిన అనసూయ.. జ్యోత్స్న డైమండ్ నెక్లెస్ శౌర్య దొంగతనం చేసిందా!
Karthika Deepam 2 Serial Today Episode : కార్తీక్ గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో దీప తన కూతురితో దొంగతనం చేయించిందని పారిజాతం దీపని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దీప షాప్ దగ్గర కార్తీక్ టీ తాగడం చూసిన జ్యోత్స్న ఫీలవుతుంది. దీపకు ఇచ్చే విలువ తన బావ తనకు ఇవ్వడం లేదనుకుంటుంది. ఇక కార్తీక్ టీ తాగి దీపని తీసుకొని కారు దగ్గరకు వచ్చే సరికి జ్యోత్స్న ఉండదు.
కార్తీక్: నాతోనే వచ్చింది కారులో కూర్చొమని చెప్పా ఇంతలో ఎక్కడికి వెళ్లిపోయిందో అని దీపకి చెప్తూ జ్యోత్స్నకి కాల్ చేస్తాడు. జ్యోత్స్న లిఫ్ట్ చేయగానే ఎక్కడికి వెళ్లిపోయావ్ అని అడుగుతాడు.
జ్యోత్స్న: ఎక్కడుంటే నీకు ఎందుకు బావ నువ్వు టీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకో నాకు పని ఉంది ఇంటికి వెళ్లిపోతున్నాను.
కార్తీక్: జ్యోత్స్నకి ఏమైంది ఎందుకిలా ప్రవర్తిస్తుంది. తను వెళ్లిపోయిందంట మనం వెళ్దాం రండి.
కడియం: పెద్దింట్లో ఉంటూ ఇంత పెద్ద కారులో వెళ్తూ దీపమ్మ నా దగ్గర పని చేయడం ఏంటి. ఇంతకీ బాబు గారి దీపమ్మకు ఏమవుతారు.
పారిజాతం ఆరు బయట ఊయలలో కూర్చొని ఉంటే బంటు జ్యూస్ ఇస్తాడు. దీంతో పారిజాతం దీపని ఏదో ఒకటి చేసి ఆ గూడెం బ్యాచ్‌ని తరిమేయాలని చెప్తుంది. ఇంతలో జ్యోత్స్న ఆటోలో వస్తుంది. అది తెలియని పారిజాతం తన ప్యాలెస్ ముందుకు ఆటో వచ్చిందని గూడెం బ్యాచ్‌నే అనుకొని తిడుతుంది. ఇంతలో బంటు ఆటోలో వచ్చింది మీ మనవరాలు అని చెప్పడంతో పారిజాతం షాక్ అయిపోతుంది.
ఇక ఏమైందని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. దీంతో జ్యోత్స్న గుంటూరు మిర్చిలా చిటపటలాడుతుంది. కార్తీక్ కాకా హోటల్‌కి వెళ్లి టీ తాగాడని చెప్తుంది. చీప్‌గా అక్కడ టీ తాగడం ఏంటని పారిజాతం అడిగితే అక్కడ దీప ఉందని చెప్తుంది. దీంతో పారిజాతం దీపని ముందు తరిమేయాలని అనుకుంటుంది.
మరోవైపు కార్తీక్ మధ్యలో కారు ఆపి దీపతో మాట్లాడాలి అంటాడు. దీప తనకు మాట్లాడాలి అని లేదని ఇంటికి వెళ్దామని అంటుంది. అయినా సరే కార్తీక్ కారు ఆపడంతో నడిచి వెళ్లిపోతానని దీప వెళ్తుంటుంది. దీప వెనకాలే కార్తీక్ వెళ్తాడు.
కార్తీక్: మీరు మర్చిపోలేని విషయాన్ని నేను గుర్తు చేయాలి అనుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా ఇక నన్ను ఆ మనిషిగా మర్చిపోండి. మీరు అభిమానించే సుమిత్ర గారి మేనల్లుడిగానే గుర్తుపెట్టుకోండి. మీ శ్రేయాభిలాషి అనుకోండి.
దీప: మీరు నాకు చెప్పాలి అనుకున్న విషయం ఇదేనా.
కార్తీక్: కాదు.. చెప్తాను. కానీ చెప్పేది పూర్తిగా వినండి. చెప్పిన తర్వాత ముఖం చిట్లించడాలు.. మీ కనుబొమ్మలు ఎత్తి కోపంగా చూడటాలు.. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటివి చేయకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి.
దీప: మీరు ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు.
కార్తీక్: రౌడీ గురించి.. మీ భయం ఏంటి? ఏదో ఒక రోజు నేను తన తండ్రి గురించి రౌడీకి చెప్తాననే కదా.. నేను చెప్పనండి.
దీప: మీరు మాట మీద నిలబడే మనిషి కాదు బాబు. మీరు నాతో చెప్పాలి అనుకున్నది ఇదేనా.
కార్తీక్: కాదండి.. మీరు మీ అత్తయ్యతో కలిసి వెళ్లారని రౌడీ చెప్పింది ఆవిడ ఎక్కడ.
ఇంతలో బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్తున్న నర్శింహ దీప వాళ్లని చూసి కారు ఆపుతాడు. అనసూయకు దీప కార్తీక్‌తో మాట్లాడటం చూపిస్తాడు.
నర్శింహ: వాడితో ఏ సంబంధం లేకుండానే నడి రోడ్డు మీద మాట్లాడుతుందా..
అనసూయ: ఊరిలో ఏం నంగనాచిలా నటించిందిరా ఉండు దీని సంగతి చెప్తాను.
నర్శింహ: అమ్మా నువ్వు ఆగమ్మ.
అనసూయ: నిన్ను ఎన్ని మాటలు అనిందిరా. ఇప్పుడు ఇది వేసే వేషాలు ఏంటి సిగ్గు ఉందా దీనికి.
శోభ: సిగ్గు లేదు కాబట్టే తెగించింది అత్తయ్య.
అనసూయ: ఉండు ఉన్న మాట దానికి ఇప్పుడే అడుగుతా.
నర్శింహ: వద్దమ్మా నీ ముందు నాతోనే అబద్ధాలు చెప్పిన దానికి ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పడం రాదా.. అయినా దాన్ని ఏమైనా అంటే వాడు ఊరుకోడు.
అనసూయ: అంత వరకు వచ్చిందా కథ.
నర్శింహ: మరి నువ్వేం అర్థం చేసుకుంటున్నావ్ నా బాధ. వాడితో ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతుంది. ఇదిగో ఇలాగే. మళ్లీ ఊరిలో ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని వెధవ నాటకాలు.
కార్తీక్ శౌర్యని సిటీలో చదివిస్తాను మీరు ఎక్కడికి వెళ్లకండి అని చెప్తాడు. దానికి దీప మీ సాయం అవసరం లేదు అంటుంది. ఇక నర్శింహ తన తల్లికి దీప తనకు తన భర్త అవసరం లేదని చెప్తుందని చెప్తాడు. శోభ కూడా అవునవును అంటూ అంటుంది. కలిసుందాం అంటున్నాడని తగిలిస్తాడు. దీంతో అనసూయ దీప అంతు చూస్తా అంటుంది. ఇక దీప, కార్తీక్‌లు ఇంటికి వెళ్లిపోతారు.
జ్యోత్స్న: బావ కోసం నేను ఏదైనా వదులుకోవడానికి రెడీ గ్రానీ. కానీ బావ అలా లేడు మారిపోయాడు. నేను ఏదైనా భరిస్తాను కానీ నన్ను బావ నెగ్లెక్ట్ చేయడం అస్సలు భరించలేను. దీపతో మాట్లాడితే తన కూడా వచ్చిన నేను గుర్తుండనా.. నేను ఇంత ప్రేమిస్తున్నాను అంటే కొంత అయినా ఆశించనా. మరీ ఇలా అయితే ఎలా గ్రానీ. జాలి చూపించడానికి కూడా ఓ హద్దు ఉండాలి.
పారిజాతం: జాలి అయితే దూరం నుంచి కూడా చూపించొచ్చు మనవరాలా.. అదే బాధ్యత అయితే ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. అయినా నీ బావకి నీ ప్రేమ తగ్గింది అంటే ఎలా నమ్ముతావు.
జ్యోత్స్న: లేదు గ్రానీ బావ ముందు ఇలా లేడు. నా భర్త్‌డేకి గులాబి తెచ్చాడు. లాస్ట్ టైం అయితే డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాడు. అది నేను ఇప్పటికీ ఎంత జాగ్రత్తగా పెట్టకున్నానో చూడు. అని వెతికితే నెక్లెస్ కనిపించదు.
ఏమైందని పారిజాతం అడిగితే నాలుగు రోజులు క్రితం బావకి చూపించాను అని అంటుంది. దీంతో పారిజాతం నవ్వుతుంది. బావ ఇచ్చిన నెక్లెస్ కనిపించకపోతే నవ్వుతావెందుకని జ్యోత్స్న అడుతుంది.
పారిజాతం: బావకి చూపించాను అన్నావ్ కదా మరి అది ఇక్కడ ఎందుకు ఉంటుంది. చేరాల్సిన చోటుకే చేరుంటుంది.
జ్యోత్స్న: ఏంటి గ్రానీ నువ్వు అనేది.
పారిజాతం: ఇప్పుడు నువ్వు ఒక పని చేయలా పద చెప్తాను.
కార్తీక్, దీపలు ఇంటికి వస్తారు. జ్యోత్స్న తల్లిదండ్రులకు తన బావ గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదని చెప్తుంది.
పారిజాతం: ఇంట్లో వాళ్లు ఇంట్లో తిరిగితే ఎక్కడి వస్తువు అక్కడ ఉంటుంది. బయటవాళ్లు ఇంట్లో తిరిగితేనే ఇంట్లో వస్తువు వేరే దగ్గర ఉంటుంది.
సుమిత్ర: బయట వాళ్లు ఎవరు అత్తయ్య. దీప, కార్తీక్‌లు పక్కపక్కనే నడిచి ఇంట్లోకి వస్తారు. ఇక దీప శౌర్యని పిలుస్తుంది.
పారిజాతం: బయట వాళ్లు ఎవరో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
సుమిత్ర: అంటే జ్యోత్స్న డైమండ్ నెక్లెస్ దీప తీసిందనా మీ ఉద్దేశం. దీప షాక్ అయిపోతుంది.
ఏమైందని కార్తీక్ అడిగితే జరిగింది సుమిత్ర చెప్తుంది. పారిజాతం దీప మీద నిందలు వేస్తుంది. ఇక దీపనే తీసిందని అడగమని అంటుంది. సుమిత్ర, దశరథ్‌లు పారిజాతాన్ని దీప మీద నిందులు వేయొద్దని అంటారు. దీంతో పారిజాతం అవుట్ హౌస్ వెతకించమని అంటుంది. జ్యోత్స్న కూడా పారిజాతానికి సపోర్ట్ చేస్తుంది. దీంతో కార్తీక్, జ్యోత్స్నని తిడతాడు. ఎదుటి వాళ్లతో ఎలా నడుచుకోవాలో ముందు ఆ సంస్కారం నేర్చుకో అంటాడు.
జ్యోత్స్న: నీ సంస్కారం ఇందాక టీ కొట్టు దగ్గర అర్థమైంది బావ. ఎదుటివాళ్లకి చెప్పడం కాదు ముందు మనం నేర్చుకోవాలి.
దశరథ్: ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు.
పారిజాతం: ఇదంతా కాదు దశరథ్ ముందు దీప చేసిన దొంగతనం గురించి తేల్చండి.
సుమిత్ర, దశరథ్, కార్తీక్‌లు దీపకు సపోర్ట్‌గా మాట్లాడుతారు. పారిజాతం దీపని నిందిస్తూనే ఉంటుంది. జ్యోత్స్న గదిలోకి దీప, దీప కూతురు శౌర్య వెళ్తారని దీప చేయకపోయినా శౌర్యతో చేయించొచ్చు కదా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్ : వాయుని చంపింది తానే అని ఒప్పుకున్న తిలోత్తమ.. ఫలించిన నయని దండ ప్రయోగం!