Satyabhama Serial Today March 14th: భైరవిని తిట్టిన క్రిష్ - అతడితో అర్థరాత్రి ముచ్చట్లు పెట్టిన సత్య!
Satyabhama Serial Today Episode: రుద్రని తిట్టి సంధ్యకు మహదేవయ్య క్షమాపణలు చెప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Telugu Serial Today Episode: సత్య చెల్లి సంధ్య డ్యాన్స్ చేస్తుంటే రుద్ర నడుము గిల్లి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇక భైరవి తన కొడుకును సపోర్ట్ చేస్తుంది. సత్య ఫ్యామిలీని తిడుతుంది. పెళ్లి ఇష్టం లేకపోతే మానేయ్ మని అంటుంది. ఇక అలా ఎందుకు అబద్ధం చెప్పావని తన కొడుకునే కొట్టావని భైరవి సంధ్యను తిడుతుంది.
క్రిష్: అమ్మా నువ్వు ఉండు నేను మాట్లాడుతా..
మహదేవయ్య: ఏంట్రా నువ్వు మాట్లాడేది. అసలు నీ అన్నని అవమానించినందుకు నువ్వు ఆమె చెంప పగలగొట్టాల్సింది పోయి ఆపుతున్నావ్.
విశ్వనాథం: ఏం మాట్లాడుతున్నారు మీరు తప్పు చేసింది మీ అబ్బాయి అయితే మా అమ్మాయిని అంటున్నారు. అసలు మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా.
మీన: ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించాడు తప్పు కాదా.. మీ కొడుకు తప్పు చేస్తే మీరు ఇలా మాట్లాడటం ఏంటి.
భైరవి: వాడు చేయలేదు అంటున్నాడు కదా. డ్యాన్స్ చేసినప్పుడు చేయో కాలో తగిలి ఉంటాయి. దానికి ఇంత రాద్ధాంతం.
సత్య: ఏమీ చేయకుండా నా చెల్లి ఎవరి మీద చేయి చేసుకోదు.
నందిని: అంటే మీ బావగారినే అనుమానిస్తున్నావా..
సత్య: ఉన్నమాటే చెప్తున్నా.
హర్ష: నిన్ను ఎవరైనా ఇలా చేస్తుంటే మీ అన్నయ్య ఊరుకుంటాడా.. మీ నాన్న ఊరుకుంటాడా..
మహదేవయ్య: ఏయ్.. నా బిడ్డ చేయి పట్టుకుంటే నరికేస్తా వాడిని.
మీన: ఆ అమ్మాయి కూడా అదే పని చేయాల్సింది. కానీ చెంప దెబ్బతో వదిలేసింది. మీ ఇంటి ఆడపిల్లకు ఒక రూల్ ఆ ఇంటి ఆడపిల్లకు ఓ రూలా. మీరు చాలా పెద్ద తప్పు చేశారు అంకుల్.
మహదేవయ్య: వెళ్లి ఆ పిల్లకి సారీ చెప్పు. రుద్ర ఎదురు తిరిగితే మహదేవయ్య తిడతాడు.
క్రిష్: అన్నా బాపు ఏం చెప్పాడు విన్నావు కదా.
భైరవి: నువ్వు నోర్ముయ్‌రా ఇందంతా నీ వల్లే..
క్రిష్: అంటే నేను నడుము గిల్లమని చెప్పానా.
భైరవి: నీ వల్లే వీళ్లు ఇలా రెచ్చిపోయారు.
క్రిష్: అమ్మా చాలమ్మ. వాళ్లు పరాయి వాళ్లు కాదు. పెళ్లి అయినాక మనమంతా ఒకే కుటుంబం కదా. అది గుర్తుంచుకో. అన్నని సారీ చెప్పమని చెప్పు.
మహదేవయ్య: రుద్ర చెప్పరా.. రుద్ర సంధ్యకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సంధ్య అక్కని పట్టుకొని ఏడుస్తుంది. ఇక సంధ్యను తీసుకొని సత్య అక్కడనుంచి వెళ్లిపోతుంది. క్రిష్ సత్య వెళ్తుంటే ఏడుస్తాడు. గదికి వెళ్లిన తర్వాత తన తల్లి మీద తన వాల్చుకొని ఏడుస్తుంది.
హర్ష: ఆ రోజు ఆ రౌడీ నీ చేయి పట్టుకున్నాడని చెంప పగలగొట్టావ్. ఈ రోజు సంధ్యకు అంత కంటే ఎక్కువ అవమానం జరిగింది. నువ్వు మాత్రం చూస్తూ ఉండిపోయావ్ ఎందుకు. అవమానించింది మీ అత్తింటి వారు అనా..
సత్య: అది నీకు కూడా అత్తిల్లే కదా అన్నయ్య.
హర్ష: నేను వాళ్లకి సపోర్ట్ చేయలేదు. నవ్వు ఎందుకు మరి క్రిష్‌ని నిలదీయలేదు. ఎందుకు ఎదురు తిరగలేదు.
సత్య: ఎదురు తిరిగితే ఏమయ్యేదో నీకు తెలీదా అన్నయ్య. ఆరోజు నేను కొట్టిన చెంప దెబ్బనే ఈరోజు మనకి ఈ గతికి తీసుకొచ్చింది అని మీరంతా నన్ను అన్నారు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా ఆవేశాన్ని తొక్కి పెట్టుకొని ప్రతి అడుగు వేస్తున్నాను. చెల్లి కన్నీళ్లు నాకు మాత్రం బాధగా అనిపించవా అన్నయ్య.
సంధ్య: అక్క నేను నాకు జరిగిన అవమానం గురించి బాధ పడటం లేదు అక్క. రేపటి నుంచి నువ్వు ఆ ఇంట్లో ఉండటం గురించి ఆలోచించి బాధపడుతున్నా. అక్క ఇప్పటి వరకు జరిగింది చాలు ఈ పెళ్లి చేసుకోవద్దు. మనం ఇంటికి వెళ్లిపోదాం పద అక్క.
విశాలాక్షి: చిన్న పిల్ల దానికి కూడా నీ కష్టం నీ భవిష్యత్ తెలుస్తుంది. నువ్వు మాత్రం ఏమీ పట్టనట్లు ఉన్నావ్.
సత్య: తప్పదు అమ్మ. నేను ఇంకొక్క అడుగు వెనక్కి వేసినా జరిగే అనర్థం ఏంటో నాకు తెలుసు.
విశ్వనాథం: సత్య ఎంత పెద్ద నేరస్తుడు అయినా ఉరితాడును మెడకు వేసుకొని వేలాడడు. పోరాడుతూనే ఉంటాడు.
సత్య: పోరాడినా ఓడిపోతే చెప్పండి నాన్న. పారిపోలేడు కదా శిక్షకు తలవంచాల్సిందే కదా. ఇప్పుడు నేను కూడా చేస్తుంది అదే నాన్న. కాకపోతే ప్రాణాలు తీసుకోవాలి అనుకోవడం లేదు అంతే. ఇక నుంచి మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ పెళ్లి జరగాలి. నేను ఆ ఇంటి కోడలు కావాలి. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను వెనక్కి తగ్గను. నా అత్తింటి కారణంగా మీరంతా కనీళ్లు పెట్టుకోవాల్సి వస్తున్నందుకు వాళ్ల తరుఫున నేను క్షమాపణలు చెప్తున్నా. ఇంకొక్క సారి ఇలాంటి అవమానం జరగకుండా నేను చూసుకుంటాను.
ఇక క్రిష్ జరిగిన వాటిని ఆలోచిస్తూ మందు తాగుతూ బాధపడుతుంటాడు. ఏడుస్తాడు. ఇక బాలు అక్కడికి వస్తాడు. ఇక బాలు కూడా క్రిష్‌తో కలిసి మందు తాగుతాడు.
క్రిష్: అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బ్రో. నా గురించి తప్పుగా అనుకొని నా ప్యామిలీని సత్య తిట్టుకుంటుందేమో. పెళ్లి గురించి మనసు మార్చుకుంటుందేమో. సత్య పెద్దొళ్లు ఆమెను బ్రైన్ వాష్ చేస్తుంటారేమో.
బాలు: సరే నువ్వు వెళ్లి సత్య చేతులు పట్టుకొని సారీ చెప్పేయ్.. వెళ్లు.. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను చూసుకుంటా..
క్రిష్: కానీ బ్రో ఇంత రాత్రి పూట పోతే మంచిగా ఉంటుంది అంటావా.. సంపంగి వస్తున్నా..
అందరూ పడుకొని ఉంటే సత్య జరిగిన వాటిని తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక క్రిష్ వచ్చి తమ గది తలుపు కొడతాడు. సత్య బయటకు వెళ్లి తలుపు తీస్తుంది.క్రిష్‌ని చూసి షాక్ అవుతుంది. క్రిష్ సత్యతో మాట్లాడుతా అంటే సత్య విసిగించొద్దు అంటుంది.
క్రిష్: సంపంగి నేను ఇప్పుడు నీతో మాట్లాడకపోతే నా మనసు మంచిగా ఉండడు. నిద్ర పట్టదు. బయటకురా..
సత్య: సరే..అని తాగిన మైకంలో ఉన్న క్రిష్‌ని సత్య వేరే ప్లేస్‌కి తీసుకెళ్తుంది.
క్రిష్: నిన్ను ఇబ్బంది పెడుతున్నానా.. తప్పు జరిగింది సంపంగి. అదే మా అన్న చేసిన తప్పు గురించి నీకు కోపం వచ్చిందా. నాకు కూడా మా అన్న మీద చాలా కోపం వచ్చింది. ఒక ఆడపిల్లతో అలాగా ప్రవర్తించేది. నాకే అనిపించింది వాడి చెంప పగలగొట్టాలి కానీ ఎంతైనా అన్న కదా అందుకే ఆగిపోయా.
సత్య: సరే అయిపోయిందా చెప్పడం నేను వెళ్లొచ్చా..
క్రిష్: ఏయ్.. ఆగు.. అలా పరాయి వాడితో మాట్లాడుతున్నట్లు అలా మాట్లాడకు సంపంగి లోపల ప్రాణం పోతుంది. మా అన్న చేసిన దానికి నేను సారీ చెప్తున్నా.. సరిపోవడం లేదా నీకు కోపం పోవడం లేదా.. చెప్పు ఏం చేయాలి. మనద్దరం కాబోయే భార్యభర్తలం ఎవరి వల్లనో మనద్దిరి మధ్య దూరం పెరగొద్దు. ఏదో ఒకటి మాట్లాడు సంపంగి. నాకు కావాల్సింది నీతో పెళ్లి. నీతోనే జీవితం పంచుకోవాలి. మనద్దరం కలిసి బతకడం. అందుకు ఎవరు అడ్డం పడినా అడ్డొచ్చినా చంపేస్తా.. మా అన్న అడ్డమా చెప్పు చంపేయాలా చెప్పు ఇప్పుడే చంపేస్తా.. నీ ఫ్యామిలీ అయినా చెప్పు ఇప్పుడే చంపేస్తా..
సత్య: నీకు చంపడం తప్ప ఇంకేం తెలీదా.. నాకోసం ఒక్క పని చేయు చాలా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో. ప్లీజ్..
క్రిష్: ఎందుకు టెన్షన్ పడుతున్నావ్. నువ్వు అంకుల్ వాళ్లకోసం బయపడుతున్నావ్ కదా పోయి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పనా..
సత్య: అక్కర్లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు. ఇక సత్య క్రిష్‌ని తీసుకొని వెళ్తుంది. అది బాలు చూసి హ్యాపీగా ఫీలవుతాడు. సత్య బాలుని పిలిచి క్రిష్‌ని అప్పగిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: బ్రహ్మముడి సీరియల్ మార్చి 14th: కావ్యను తిట్టిన ధాన్యలక్ష్మీ - కళ్యాణ్ భలే బుద్ధి చెప్పాడుగా!