అన్వేషించండి

Brahmamudi Serial Today Episode March 14th: కావ్యను తిట్టిన ధాన్యలక్ష్మీ - కళ్యాణ్ భలే బుద్ధి చెప్పాడుగా!

Brahmamudi Today Episode: ఇంటికొచ్చిన ధాన్యలక్మీ, అనామిక కావ్యను తిట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode: మా స్నేహాన్ని తప్పు పట్టింది ఎవరో చెప్పండి అని కళ్యాణ్‌ అడుగుతాడు. వాళ్లెవరో చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. అంటూ కళ్యాణ్‌ చెప్పగానే కనకం, మూర్తి షాక్‌ అవుతారు. మీరు వాళ్లెవరో చెప్పేవరకు ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాను అనడంతో అప్పు ఇంకెవరుంటారు అనామిక వచ్చి ఉండొచ్చు అంటుంది. దీంతో కనకం అవును అనామిక, ధాన్యలక్ష్మీ ఇద్దరూ వచ్చారు. అంటూ వాళ్లు అన్న మాటలు మొత్తం చెప్తుంది కనకం.  

కనకం: అన్నారు అంటే అనే అవకాశం ఇచ్చినట్టే కదా వాళ్ల బాధలో కూడా న్యాయం ఉంది.

దీంతో కళ్యాణ్‌ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మూర్తి: ఈ అబ్బాయి అక్కడికి వెళ్లి ఎంత గొడవ చేస్తాడో..

అప్పు: అసలు వాళ్లిద్దరూ అక్కతో ఎంత గొడవపడుతున్నారో? దాన్ని ఏమంటున్నారో

అనగానే మూర్తి, కనకం షాక్‌ అవుతారు. మరోవైపు ఇంటికి వెళ్లిన ధాన్యలక్ష్మీ, అనామిక కావ్యను పిలిచి కోప్పడతారు. నా కొడుకు, కోడల్ని విడదీయాలని పథకం వేసుకున్నావా? అని అడగ్గానే కావ్య షాక్‌ అవుతుంది. స్వప్న కోప్పడుతుంది. కావ్య కూడా ధాన్యలక్ష్మీని తిడుతుంది. ఒకప్పుడు పచ్చగా ఉన్న ఈ ఇంట్లో రోజుకో గొడవ పెడుతుంది మీరు అంటూ నిలదీస్తుంది.

ధాన్యలక్ష్మీ : నా కొడుకు ఆఫీసుకు వస్తే నీ ఆటలు సాగవని వాడికున్న పైత్యాన్ని అడ్డుపెట్టుకుంటే నువ్వనుకున్నది సాధించొచ్చని వాన్ని అమాయకుణ్ని చేసి అడ్డు తొలగించుకున్నావు.

రాజ్‌: పిన్ని ఏమంటున్నావు నువ్వు.. కళావతి చెబితే వినేంత చిన్నవాడా కళ్యాణ్‌. అయినా ఇందులో కళావతి, కళ్యాణ్‌కు ఏం చెప్పింది. మొత్తం వాడే తెగేసి చెప్పాడు కదా? ఆఫీసుకు రావడం ఇష్టం లేదని

అపర్ణ: అత్తాకొడల్లు ఇద్దరూ కూడబలుక్కుని బయటకు వెళ్లి ఎవర్ని ఎలా సాధించాలి అని చర్చించుకుని వచ్చినట్లు ఉంది.

ధాన్యలక్ష్మీ: నీ కొడులు ఏం చేస్తుందో ఎన్ని కుట్రలు చేస్తుందో నీకు తెలసా?

అపర్ణ: ఏం చేసింది. నీ కొడలులాగా మొగుణ్ని కించపరిచిందా? ఇంటిల్లిపాదిని పూచికపుల్లలాగా తీసిపడేసిందా? ఏం చేసింది చెప్పు.

 ధాన్యలక్ష్మీ: నా కొడుకుని అప్పును కలిసేలా చేసింది. అవును నా కొడల్ని నా కొడుకు నుంచి దూరం చేసి నీ చెల్లెల్ని ఇచ్చి చేసేందుకు వెనకాల ఉండి అంతా నడిపిస్తున్నావు.

స్వప్న: మీరు కడుపుకు అన్నం తింటున్నారా? అనుమానం తింటున్నారా? కావ్యకు అలాంటి అవసరం కానీ అలోచన కానీ లేవు

ధాన్యలక్ష్మీ: నీ చెల్లెలు నోరు విప్పకముందే నువ్వు కలగజేసుకుంటున్నావు అంటే ఈ గూడుపుఠాణిలో నీ హస్తం కూడా ఉందా?

స్వప్న: నేను హస్తం పెడితే అది భస్మాసుర హస్తమే అవుతుంది. బూడిదే మిగులుతుంది మీకు నేను ఎందులో వేలు పెట్టలేదు.

అనామిక: ఇదిగో ఇలా అక్కాచెళ్లెలు ముగ్గురూ కలిసి ఎవర్ని నోరు ఎత్తకుండా చేసి కళ్యాణ్‌ను నా నుంచి దూరం చేస్తున్నారు. నా మొగుడితో నన్ను కాపురం చేయకుండా చేస్తున్నారు. 

కావ్య: అనామిక కొంచెం మర్యాదగా మాట్లాడు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. మీరేం చూశారో నాకు తెలియదు.

అనగానే ఇందిరాదేవి కల్పించుకుని అసలు ఏం జరిగిందని ధాన్యలక్ష్మీని అడుగుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ అప్పు, కళ్యాణ్‌ కలిసిన విషయం చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కళ్యాణ్ వచ్చి ధాన్యలక్ష్మీ, అనామికలను తిడతాడు. మీరెందుకు మూర్తి గారి ఇంటికి వెళ్లారని నిలదీస్తాడు. మీరిద్దరూ కలిసి ఈ ఇంటిని ఏం చేద్దామనుకుంటున్నారు. ముక్కలు చేద్దామనుకుంటున్నారా? అనగానే ఇందిరాదేవి కూడా కల్పించుకుని ఇద్దరినీ తిడుతుంది. తర్వాత అందరూ వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: హీరోయిన్‌తో నిశ్చితార్థం చేసుకున్న హీరో కిరణ్‌ అబ్బవరం - ఫోటోలు వైరల్‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget