అన్వేషించండి

Kiran Abbavaram Engagement: హీరోయిన్‌తో నిశ్చితార్థం చేసుకున్న హీరో కిరణ్‌ అబ్బవరం - ఫోటోలు వైరల్‌ 

Kiran Abbavaram: టాలీవుడ్‌ హీరోహీరోయిన్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్‌లు నేడు సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

Kiran Abbavaram and Rahasya Gorak Engagement: టాలీవుడ్‌ హీరోహీరోయిన్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్‌లు నేడు రహస్యంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కాగా వీరిద్దరు త్వరలో పెళ్లీ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. 'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్‌ అబ్బవరం. ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించింది రహస్య గోరక్‌. ఆన్‌స్క్రీన్‌పై రొమాన్స్‌ చేసిన వీరిద్దరు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమలో పడ్డారు. ఈ మూవీ సెట్‌లో పరిచయం ఏర్పడిన వీరిద్దరు మొదట్లో స్నేహితులుగా ఉన్నారు. అదే స్నేహ పరిచయం కొన్నిరోజులుగా ప్రేమగా మారింది. 

దాంతో వీరిద్దరు సీక్రెట్‌గా వెకేషన్స్‌, డిన్నర్‌ డేట్స్‌ వెళ్లి మీడియా కంటపడ్డారు. దాంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చిచినా పట్టించుకోలేదు. అలా అని ఈ వార్తలను ఎప్పుడూ ఖండించలేదు.  తాజాగా ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తూ ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించిన ఈ లవ్‌బర్డ్స్‌ తాజాగా ఉంగరాలు మార్చుకున్నారు. ఈ రోజు(మార్చి 12న) ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇక ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి తేదీ బయటికి రానుంది. ఇప్పటికీ ఈ విషయంపై స్పందించడానికి కిరణ్, రహస్య ముందుకు రాలేదు. ‘రాజా వారు రాణి గారు’తో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో పనిచేయడం మొదలుపెట్టాడు. కానీ రహస్య మాత్రం పూర్తిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం కిరణ్ అబ్బవరం సినిమా పనులను చూసుకోవడంలో రహస్య బిజీ అయిపోయిందని తెలుస్తోంది. మరి ఈ వారంలో వీరి ఎంగేజ్‌మెంట్ నిజంగా జరుగుతుందా లేదా చూడాలి. 

గతేడాది రహస్యంగా వెకేషన్‌

గతేడాది కిరణ్ అబ్బవరం ఒక ట్రిప్‌కు వెళ్లాడు. అదే సమయంలో రహస్య కూడా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరిద్దరి ఫోటోల బ్యాక్‌గ్రౌండ్స్‌ను బట్టి ఒకే ట్రిప్‌కు వెళ్లారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ మరింత గట్టిగా వినిపించడం మొదలయ్యింది. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరంకు ప్రశ్న ఎదురయ్యింది. తనకు, రహస్యకు మధ్య ఏముంది అనే ప్రశ్నకు ఏది ఉన్నా కలిసే చెప్తామంటూ సమాధానమిచ్చాడు కిరణ్. దీంతో ప్రేక్షకులంతా వీరిద్దరి రిలేషన్‌ను కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇంతలోనే వీరి ఎంగేజ్‌మెంట్‌పై రూమర్స్ వైరల్ అవ్వడం మొదలయ్యింది.

ఒకే సినిమాతో..

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్.. ఇద్దరూ నటులుగా తమ కెరీర్లను షార్ట్ ఫిల్మ్స్‌తోనే ప్రారంభించారు. ఆ తర్వాత కిరణ్ కంటే ముందుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రహస్య.  పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు  కలిసి ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో హీరోహీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ సినిమా వారి కెరీర్ ని మలుపు తిప్పింది. ఏలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.  దీంతో హీరోగా కిరణ్ అబ్బవరంకు, హీరోయిన్‌గా రహస్య గోరక్‌ ఖాతాలో పెద్ద హిట్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని రూమర్స్ కూడా మొదలయ్యాయి. దీనిపై వీరు పెద్దగా స్పందించకపోయినా.. కొన్నిసార్లు కవర్ చేయబోయి దొరికిపోయారు.

టాప్ హెడ్ లైన్స్

Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget