అన్వేషించండి

Satyabhama Serial Today July 4th: సత్యభామ సీరియల్: కాళీని పోలీసులకు పట్టించిన సత్య.. క్రిష్, సత్య చచ్చిపోయారన్న మహదేవయ్య, కథంతా మార్చేసిన క్రిష్‌! 

Satyabhama Serial Today Episode క్రిష్, సత్య ఇంట్లో లేరు అని మహదేవయ్య గన్ తీసుకొచ్చి ఇద్దరినీ వెతకి చంపేస్తాను అని హడావుడి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode కాళీ సత్యతో నీ కాపురం గురించి ఆలోచించు సత్య నేను నిన్ను కిడ్నాప్ చేసి ఒక రోజు రాత్రి అంటా నాతో ఉంచుకున్నాను అని క్రిష్‌కి చెప్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని కాళీ అంటాడు. తనని కిడ్నాప్ చేసింది ఇప్పటి వరకు క్రిష్‌ అని అనుకున్న సత్య అది తన భర్త కాదు కాళీ అని తెలియడంతో షాక్ అవుతుంది. 

కాళీ: క్రిష్‌కి నిన్ను దూరం చేయాలి అన్న ఆలోచనలో అలా చేశా. చేతి మీద సత్య అని ట్యాటూ వేసుకొని నిన్ను తప్పు దోవ పట్టించా. ఈ కాళీ అనుకుంటే ఏమైనా చేయగలడు. కిడ్నాప్ స్టోరీ నీ మొగుడికి తెలీకూడదు అనుకుంటే పైసలు ఇస్తావా నీ చెల్లిని ఇస్తావా.
పోలీసులు: వీడియో తీస్తూ.. అత్తారింటికి పదరా అన్నీ ఇస్తాం. నువ్వు మాట్లాడే మాటలు అన్నీ రికార్డ్ చేశాం. స్టేషన్‌కి పదరా చిప్పకూడు తినిపిస్తాం. 
సత్య: నీకే కాదు నాకు తెలివి ఉంది. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయావ్ పారిపోలేవ్. 

పోలీసులు కాళీని తీసుకెళ్లిపోతారు. సత్యని హగ్ చేసుకొని సంధ్య ఏడుస్తుంది. ఇక ఇంట్లో చెప్పకుండా వచ్చాను అని సత్య బయల్దేరుతుంది. విశ్వనాథం సత్యతో క్రిష్‌ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా. అపార్థం చేసుకోవడం ఈజీ కానీ అర్థం చేసుకోవడం కష్టం అని అంటాడు. తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని కాపురం చక్కదిద్దుకో అని చెప్తాడు. మహదేవయ్య ఇంట్లో అందరూ మీడియా వాళ్లు వస్తారని హడావుడి చేస్తుంటారు. మీడియా వాళ్ల వస్తారు. అందరూ ఉంటారు కానీ సత్య, క్రిష్‌ వాళ్ల కోసం మహాదేవయ్య అడుగుతాడు. మీడియా వాళ్ల ఎదురుగానే క్రిష్‌, సత్య ఇంట్లో లేరు అని రేణుక చెప్తుంది. దాంతో మీడియా వాళ్లు మీకు మీ చిన్న కోడలికి పడటం లేదా అందుకే వాళ్లు మీడియా మీటింగ్‌కి లేకుండా వెళ్లిపోయారా అని అడుగుతారు. 

మహదేవయ్య వారసుడిని నేను నన్ను ప్రశ్నించండి అని రుద్ర అంటే మహదేవయ్య రాజకీయ వారసుడు చిన్నకొడుకు అని చెప్పారు అది ఎంత వరకు నిజం అని అడుగుతారు. దాంతో మహదేవయ్య మీడియా వాళ్లని విందు ఏర్పాటు చేశాను వెళ్లండి అని పంపిస్తాడు. మరోవైపు క్రిష్ సత్య ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. క్రిష్ తనని అనుమానించడని సత్య అనుకుంటుంది. కానీ అంతలోనే అనుమానిస్తే లేనిపోని తలనొప్పి అని అనుకుంటుంది. సత్య లేకపోతే పేపర్ వాళ్ల ముందు పరువు పోతుందని బాపు ఊరుకోడు అని అనుకుంటాడు. ఇక మహదేవయ్య బయట తిరుగుతూ తెగ టెన్షన్ పడుతుంటాడు. 

రుద్ర: బాపు మీడియా వాళ్ల విందు అయిపోయింది. చిన్నా, సత్యల గురించి అడిగితే ఏం చెప్తాం.
మహదేవయ్య: చచ్చారని చెప్పు.
భైరవి: అవేం మాటలయ్యా. 
మహదేవయ్య: మరేం చేయమంటావ్. మీడియాని పిలిచి పరువు పెంచుకుందాం అంటే వీళ్లు నా పరువు తీస్తున్నారు. అసలు నేనేం తక్కువ చేశా. నా కుటుంబం మీద పడ్డ మరకలు నిజం కాదు అని చెప్దామంటే అవే నిజం అనేలా చేశారు. ఇంతలో నందిని, హర్ష వస్తారు.
నందిని: ఏమైంది అమ్మా అందరూ ఇంత టెన్షన్‌లో ఉన్నారు.
మహదేవయ్య: ఏది మీ చెల్లి ఏది. మీది సంస్కారమైన కుటుంబం అంటారు కదా. 
నందిని: చిన్న వదిన సంగతి ఓకే మరి చిన్నన్న ఏడి. ఇదేనా నీ పెంపకం.  
రుద్ర: నా తమ్ముడు మంచోడే పెళ్లి అయిన తర్వాతే ఇలా అయ్యాడు.
హర్ష: మీటింగ్ గురించి సత్యకు తెలుసు కదా వచ్చేస్తుంది మీరేం టెన్షన్ పడకండి. మీటింగ్ స్టార్ట్ చేయండి.
రుద్ర: పోనీ మీటింగ్ ఆపేద్దామా బాపు.
మహదేవయ్య: ఏం చేసినా లాభం లేదు. ఎవ్వరూ తగ్గరు. నా ఎమ్మెల్యే టికెట్ మంట కలిసినట్లే. ఎక్కడున్నా వెతికి ఆ సత్య, చిన్నాని చంపస్తా.అంటూ గన్ పట్టుకొని వస్తాడు. ఇంతలో సత్య వస్తుంది. భైరవి చెప్పకుండా వెళ్లావ్ అని సత్యని తిడుతుంది. క్రిష్‌ గురించి అడుగుతుంది. ఇంతలో క్రిష్‌ కూడా వస్తాడు.

క్రిష్‌: ఏంటి బాపు పేపరోళ్ల మీటింగ్ అన్నారు. కుటుంబం మీటింగ్ పెట్టారు. ఎవరూ రాలేదా.
రుద్ర: మీ కోసం పేపరోళ్లు అడిగితే ఏం చెప్పాలో తెలీక లోపల భోజనాలకు పంపించాం.
క్రిష్‌: ఓరి దేవుడా మా ప్లాన్ మొత్తం కరాబు చేశారు. మా బిల్డప్ అంతా వేస్ట్ అయిపోయింది. 
భైరవి: బిల్డప్ ఏందిరా నాటకాలు వేస్తున్నావా.
క్రిష్‌: నాటకాలే ఉంటి. బాపు మొదటి సారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు కదా అని గుడికి పోయి పూజ చేయించుకొని వద్దామంది సత్య అంతకంటే మంచిది ఏముంది అని దగ్గరుండి తీసుకెళ్లి వస్తున్నా. నిష్ఠతో బాపు పేరుమీద అర్చన కూడా చేయించింది. అరే నువ్వేంటి అలా చూస్తున్నావ్ దేవుడి బొట్టు తీసుకొని వచ్చావ్ కదా. బాపునకి బొట్టు పెట్టు. 
రుద్ర: ఈ మీటింగ్ టైంలో గుడికి పోవడం ఏంట్రా.
క్రిష్‌: అక్కడే ఉంది అసలు పాయింట్. మా లెక్క ఏంటి అంటే పేపరోళ్లతో మీటింగ్ అవుతుంటే బిల్డప్‌తో ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాం. అప్పుడే కదా మామ కోసం పూజలు చేస్తున్నా కోడలు అని అనుకుంటారు. అప్పుడే కదా బాపు రేంజ్ పెరుగుతుంది. ఎమ్మెల్యే టికెట్ ఎగిరొచ్చి పడుతుంది. కానీ ఏం చేస్తా ప్లాన్ అంతా పోయింది. మీరేమో ఆ సంగతి తెలుసుకోకుండా సత్య మీద ఎగిరెగిరి పడుతున్నారు. సరే సరే నేను పేపరోళ్ల సంగతి చూస్తా.
మహదేవయ్య: నేనే తెలివైన దానివి అనుకున్నా కానీ నువ్వు నా కంటే తెలివైనదానివమ్మా. 

ముందు క్రిష్‌ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని పొగుడుతాడు. తన ఫ్యామిలీ గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయని ఎవరౌనా ఏమైనా అడగొచ్చని అంటాడు. ఇక మహదేవయ్య అందరిని మీడియాకు పరిచయం చేస్తారు. ఇక సత్య తన మామయ్య ఒకరిని పరిచయం చేయడం మర్చిపోయారు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్.. శౌర్య తన కన్న కూతురే అని చెప్పిన కార్తీక్.. గుండె పగిలేలా ఏడ్చిన జ్యోత్స్న!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget