అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 4th Episode: కార్తీకదీపం 2 సీరియల్: ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్.. శౌర్య తన కన్న కూతురే అని చెప్పిన కార్తీక్.. గుండె పగిలేలా ఏడ్చిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Episode శౌర్య తన కన్నకూతురని కార్తీక్ దీప ఎదురుగా నర్శింహకు చెప్పడం అది జ్యోత్స్న వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య బూచోడు అని అంటుందని అంటే నర్శింహ వచ్చాడా అని కార్తీక్ దీపని అడుగుతాడు. దానికి దీప ఏడుస్తూ అవును బాబు నిద్రపోతున్న పాపని ఎత్తుకుపోవాలి అని వచ్చాడు అని చివరి నిమిషంలో చూసి నా బిడ్డను నేను కాపాడుకున్నానని అంటుంది. ఇంటికి వచ్చి పాపని ఎత్తుకెళ్లిపోతాను అంటే మీరు ఎలా ఊరుకున్నారని ఏ సుత్తో, కత్తితో వాడిని కొట్టాల్సిందని అంటాడు. దీప ఆ విషయం వదిలేయమని అంటుంది. 

కార్తీక్: రౌడీని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు వాడిని ఎలా వదులుతాను. అసలు వాడు పాప జోలికి ఎందుకు వచ్చాడు. 
దీప: వద్దు బాబు వదిలేయండి. మీరు ఏమీ అడగొద్దు. నేను చెప్పలేను. పిలవగానే వచ్చారు సంతోషం. 
కార్తీక్: సరే దీప నీ కోసం కాదు రౌడీ కోసం అగుతాను. రౌడీ కోలుకోని అప్పుడు చెప్తా వాడి సంగతి వాడికి అప్పుడు ఉంటుంది. పాపని చూశారు కదా ఎంత భయపడిందో వాడికి చేయాల్సింది నేను చేస్తా.
జ్యోత్స్న: ఏం జరుగుతుంది. తండ్రి దూరం పెడితే అనుకోవడానికి కానీ వాడు వచ్చి తీసుకెళ్తా అన్నా దీప ఎందుకు అడ్డు పడుతుంది. ఇక్కడే ఉండిపోవడానికా.. నా అంచనా కరెక్ట్ అయితే బావని దీప హాస్పిటల్‌కి పిలుచుంటుంది. (కార్తీక్‌కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. దీప ఫోన్ చూస్తుంది కానీ కార్తీక్‌కి చెప్పదు.) ఏంటో ఎవరో కావాలనే చేస్తున్నట్లుంది. మీ ఇద్దరి మధ్య ఏదో నాకు తెలీని కథ నడుస్తుందని నాకు అర్థమైంది. అది నేనే కనిపెడతాడు. 

శౌర్య కార్తీక్.. కార్తీక్ అని కలవరించడంతో నర్స్ కార్తీక్‌తో మీ పాపకు మీరు అంటే చాలా ఇష్టం కదా అని అంటుంది. దాంతో దీప కార్తీక్‌లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. దీప బయటకు వెళ్తే నర్శింహ క్లాప్స్ కొట్టుకుంటూ వస్తాడు. దీప దగ్గరకు వెళ్లి ఏంటి కొడతావా కొట్టు కొడితే నా తల పగిలిపోవాలి అని అంటాడు. 

నర్శింహ: అదేంటే అయితే నిన్ను కలవరించాలి.. లేదంటే మా అమ్మని కలవరించాలి. కానీ ఆ కార్తీక్‌కి కలవరిస్తుంది ఏంటి. ఆడు ఇప్పుడు పాప దగ్గరే ఉన్నాడు కదా. నువ్వే కదా ఫోన్ చేసి మరీ పిలిచావ్. అన్నీ కనిపెడుతూనే ఉన్నానే.
దీప: సహనం కోల్పోయాను నర్శింహ దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో.
నర్శింహ: పాపని తీసుకెళ్లడానికే నేను ఇక్కడికి వచ్చాను.
దీప: నర్శింహ..
కార్తీక్: దీప అంత గట్టిగా అరించింది ఏంటి. 
నర్శింహ: ఇక్కడ కార్తీక్‌ని చూశాకా నా మనసు మార్చుకున్నాను. ఇక్కడే దీనికి ఓ ముగింపు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇంతకు ముందు అడిగిందే ఇప్పుడు అడుగుతున్నా శౌర్య నా కూతురు అయితే నాకు ఇచ్చేయ్. నా కూతురు కాదు అంటే వదిలేయ్.. 
కార్తీక్: ఎవర్ని ఎత్తుకెళ్తావ్‌రా..
నర్శింహ: వచ్చాడు హీరో.. 
కార్తీక్: నువ్వు ఇలాగే బాధ పడితూ ఉంటే ఇలాంటి వెధవకి బుద్ధిరాదు దీప. వీడికి కత్తిపీటే కరెక్ట్.
దీప: ముందు నేను నా కూతుర్ని కాపాడుకోవాలి.
నర్శింహ: ఇదేదో బాగుందే వాడు నిన్ను రెచ్చగొడుతున్నాడు. నువ్వు వాడిని జో కొడుతున్నాడు. సార్‌కి అసలు విషయం తెలీదా దీప. చెప్పలేదా..
కార్తీక్: ఏంటి దీప అది..
నర్శింహ: ఇలాంటి విషయాలు సార్‌కి చెప్పాలి కదా దీప. లేదంటే తప్పుగా అర్థం చేసుకోడా. కార్తీక్ సార్ నేను పాప జోలికి వచ్చింది నేను మీ దీపని బాధ పెట్టడానికి కాదు. మేడంగారికి ఇచ్చిన గడువులో నాకు ఏదో ఒక సమాధానం చెప్పలేదు కదా. ఈ పంచాయితీ ఈ రోజుతో తేలిపోవాలి. ఏం లేదు సార్ దీపని నేను ఓ మాట అడిగాను. దానికి దీప సమాధానం చెప్పడం లేదు అది చెప్తే వెళ్లిపోతా. శౌర్య నాకు పుట్టిన కూతురు అయితే నాకు ఇచ్చేయ్ మనండి నేను పోతా. అది నా కూతురు కాదు అని చెప్పమనండి ఇక జీవితంలో మీ జోలికి రాను.  
కార్తీక్: మనసులో.. ఇన్ని రోజులు దీప బాధ పడటానికి కారణం ఇదన్నమాట. 
నర్శింహ: ఆడదాని మౌనం అంగీకారం. అంటే శౌర్య నా కూతురు అని ఒప్పుకున్నట్లే కదా. మిగతా విషయాలు మీరు ఇద్దరూ మాట్లాడుకోండి నేను నా కూతుర్ని తీసుకొని పోతా. 
కార్తీక్: రేయ్.. రేయ్.. పాప జోలికి వస్తే ఊరుకోను. 
నర్శింహ: అది నా కూతురు సార్. ఆపడానికి మీరు ఎవరు.
కార్తీక్: నర్శింహ పాప ఇప్పుడే భయంతో వణికిపోతుంది. వెళ్లిపో..
దీప: నర్శింహ నన్ను నా కూతుర్ని వదిలేయ్.. మెల్లగా మాట్లాడు ఈ మాటలు దానికి వినపడకూడదు. 
నర్శింహ: నేను నా కూతుర్ని తీసుకుపోతా. 
కార్తీక్: నువ్వు పాపని తీసుకెళ్లడానికి వీల్లేదు. శౌర్య నీ కూతురు కాదురా.. శౌర్య నా కూతురు. నేనే శౌర్య కన్న తండ్రిని. నీకు కావాల్సిన సమాధానం దొరికింది కదా పోరా. 
నర్శింహ: ఇంతలా వెంటపడినా ఇది ఇన్ని రోజులు సమాధానం చెప్పలేదు ఇందుకన్నమాట. నువ్వెలాంటి దానివో ఇప్పుడు అర్థమైందే.

కార్తీక్‌ మాటలకు నర్శింహ వెళ్లిపోతాడు. హాస్పిటల్‌కి వచ్చి అదంతా విన్న అందతా విన్న జ్యోత్స్న కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో శౌర్య కూడా లేచి బయటకు వస్తుంది. దీంతో దీప శౌర్య దగ్గరకు వెళ్లి టిఫెన్ తినిపిస్తుంది. కార్తీక్ మాటలకు దీప ఆలోచలో పడుతుంది. శౌర్య అదంతా చూసిందేమో అని కంగారు పడుతుంది. ఇక పాపని దీప పడుకోపెట్టి బయటకు వెళ్తుంది. జ్యోత్స్న మధ్యలో కారు ఆపి కార్తీక్ మాటలు తలచుకొని ఏడుస్తుంది. నేను ఏమైపోవాలి అని గుండె పగిలేలా ఏడుస్తుంది. బయట కార్తీక్ ఉంటే దీప ఆవేశంగా కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. ఎదురుగా నర్స్ చేతిలో కత్తెర తీసుకొని కార్తీక్‌ భుజం మీద పెట్టి ఏయ్ నువ్వా నా కూతురి తండ్రివి అని అరుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: మాడిపోయిన ఉలూచి పాదాల గురించి తిలోత్తమను ప్రశ్నించిన పెద్దబొట్టమ్మ.. డబ్బుకు లొంగిపోయిన సుమన!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget