అన్వేషించండి

Trinayani Serial Today July 4th: 'త్రినయని' సీరియల్: మాడిపోయిన ఉలూచి పాదాల గురించి తిలోత్తమను ప్రశ్నించిన పెద్దబొట్టమ్మ.. డబ్బుకు లొంగిపోయిన సుమన!

Trinayani Serial Today Episode ఉలూచి సాక్సులు తీసి చూసిన పెద్దబొట్టమ్మ పాదాలు మాడిపోవడానికి కారణం తిలోత్తమే అని ఆమెను అందరి ముందు ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode తిలోత్తమ హాసినికి గిఫ్ట్‌ ఇస్తుంది. అందరూ హాసినిని గిఫ్ట్ ఓపెన్ చేయమని అంటారు. తిలోత్తమ వజ్రాల హారాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడంతో హాసిని నోరెళ్లబెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. రేటు ఎంత అని అడుగుతారు. దానికి తిలోత్తమ రేటుదేముంది నచ్చితే చాలు అని అంటుంది. దానికి పెద్దబొట్టమ్మ కొనుక్కొని వస్తే కదా అని అంటుంది. 

నయని: ఆ హారాన్ని కొనలేదా నీకెలా తెలుసు పెద్దమ్మ.
పెద్దబొట్టమ్మ: ఆ హారం ఇక్కడెక్కడా దొరకదు నయని సర్పదీవి నుంచి తీసుకొచ్చింది మీ అత్తయ్య.
వల్లభ: నిజమా మమ్మీ ఎప్పుడూ చెప్పలేదు నాకు.
తిలోత్తమ: ఇప్పుడు చెప్పుతున్నా కదా అక్కడి నుంచి తీసుకొచ్చాను. అంత క్వాలిటీ ఆర్నమెంట్ ఇక్కడెక్కడ దొరుకుతుంది. 
విక్రాంత్: బ్రో ఇంకా అలా చూస్తూ ఉంటావా ఏంటి దాన్ని వదిన మెడలో వేయు.
సుమన: ఎంత బాగుందో కళ్లార్పకుండా చూడాలి అనిపిస్తుంది అక్క. ఎంత బాగుందో నీ మెడలో..
తిలోత్తమ: హాసిని నువ్వు తర్వాత గదిలోకి వెళ్లి అద్దంలో చూసుకుందువు గాని ముందు కేక్ కట్ చేయ్. 

హాసిని, వల్లభలు కలిసి కేక్ కట్ చేస్తారు. హాసిని ముందు నయనికి తినిపిస్తుంది. ఇక సుమన పెద్దబొట్టమ్మను ఉద్దేశించి కేకు తినడానికి వచ్చావ్ కదా తినిపో అంటుంది. విక్రాంత్ సుమనను తిడతాడు. పెద్ద బొట్టమ్మ ఆపుతుంది. ఇక ఉలూచికి కాళ్లకు సాక్సులు ఎందుకు వేశారని అడుగుతుంది. సర్పదీవి నుంచి ఉలూచిని తిలోత్తమ తీసుకొచ్చిందని ఆ రోజు నుంచే సాక్సులు వేశారని అవి తీసేస్తే ఉలూచి మళ్లీ పాము పిల్లలా మారుతుందని నయని పెద్దబొట్టమ్మతో చెప్తుంది. 

పెద్దబొట్టమ్మ: బిడ్డని నా చేతికి ఇవ్వండమ్మా అప్పుడు వాటిని తీసి చూసినా పాము పిల్లలా మారదు. 
సుమన: నేను ఇవ్వను. ఈవిడ చెప్పిన మాటలు వింటే ఎలా.
తిలోత్తమ: నిజమే ఉలూచిని చూశాక వెళ్లిపోక ఇంకా ఇక్కడేం పని.
పెద్దబొట్టమ్మ: లేదమ్మా పాప కాళ్లకి ఏదో అయిందని అనిపిస్తుంది ఒక్కసారి నన్ను చూడనివ్వు.
సుమన: వద్దు వెళ్లిపో..
వల్లభ: ఏం అవసరం లేదు వెళ్లిపో నువ్వు.
విశాల్: ఆగండి ఎందుకు అలా దబాయిస్తున్నారు. పసి పిల్లని పట్టుకొని కాళ్లకి ఏమైందో చూస్తాను అంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. 
నయని: చెల్లి పాపని ఇవ్వు.
సుమన: ఇవ్వను అక్క. 
నయని: ఏదైనా జరిగితే నాదీ పూచి.. 
సుమన: కోటీశ్వరురాలు మాటిస్తే బిడ్డను ఎందుకు ఇవ్వను. ఇదిగో తీసుకో పెద్దబొట్టమ్మ. 

పెద్దబొట్టమ్మ పాపని తీసుకొని సాక్సులు తీస్తుంది. ఉలూచి రెండు కాళ్లు నల్లగా మాడిపోయి ఉంటాయి. పెద్దబొట్టమ్మ షాక్ అయిపోతుంది. తిలోత్తమ తన బండారం బయట పడిపోతుందని తెగ టెన్షన్ పడుతుంది. ఇలా ఎందుకు అయిందని అందరూ అడిగితే మంట వల్ల అని పెద్దబొట్టమ్మ  అంటుంది. తిలోత్తమకు సమాధానం చెప్పమని అంటుంది.

తిలోత్తమ: నేను ఏం చెప్తాను. 
పెద్దబొట్టమ్మ: బిడ్డ కాలు ఎందుకు కాలాయ్.. ఎలా కాలాయ్.
విశాల్: పసి పాప పాదాలు కాలిపోవడం ఏంటి.
పెద్దబొట్టమ్మ: ఇవి ఎలా కాలాయో మీ అమ్మ చెప్పాలి బాబు.
నయని: పెద్దబొట్టమ్మ గుర్తు పడుతుంది. ఏం జరిగిందో అత్తయ్య చెప్పాలి.
తిలోత్తమ: నా చేయి కాలినప్పుడు ఉలూచి కాలు కూడా కాలుండొచ్చు. జాలి పడి నేను సాక్సులు వేసి తీసుకొస్తే  నన్ను అడుగుతారు ఏంటి. నేను ఏదో చేసినట్లు నింద వేస్తే బాగుండదు చెప్తున్నా.
దురంధర: అసలేం జరిగిందో నువ్వు చెప్తే తప్ప మాకు ఎలా తెలుస్తుంది వదిన.
పావనా: గాయత్రీ, ఉలూచిలను సర్పదీవికి తీసుకెళ్లింది నువ్వే కదా అక్కాయ్. 
తిలోత్తమ: క్షేమంగా తిరిగి వస్తే సంతోషించక ఇలా మాట్లాడుతారేంటి.
పెద్దబొట్టమ్మ: తిలోత్తమమ్మ నీ రూపు రేఖలు మారినట్లు బిడ్డని కూడా మార్చాలి అని చూశావా. 
తిలోత్తమ: నోర్ముయ్..
సుమన: నా బిడ్డకు ఏదో జరిగింది. ఏదో చేశారు. తిలోత్తమ అత్తయ్య అని నమ్ముకుంటే ఇలా చేస్తారా. 
తిలోత్తమ: సుమన నన్ను అపార్థం చేసుకోవద్దు. పాప కాళ్లు నార్మల్ అవుతాయి సర్జరీ చేయిస్తాను. పాదాల్లో ప్రాణం ఉంది. నా కుడి అరచేయి అయితే నిర్జీవంగా ఉంది. నాకు తనకు తేడా ఉంది. 
సుమన: ఆపరేషన్ చేసి పసిదాని ప్రాణం నలుపుతారా.
తిలోత్తమ: ఏం చేయమంటావ్. పోనీ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నువ్వే ట్రీట్మెంట్ చేయించుకుందువుగానీ. 
హాసిని: చేసింది అంతా చేసి డబ్బుతో మ్యానేజ్ చేయాలి అనుకుంటున్నారా.
తిలోత్తమ: సుమన నేను చెప్పింది విను ముందు ఆ సాక్సు వేయించి పాపని తీసుకో. 
పెద్దబొట్టమ్మ: నిలదీస్తే సమాధానం తెలుస్తుందమ్మా.
సుమన: చెప్పింది చేయ్. ఇంక వెళ్లు. వెళ్లనివ్వండి. తన వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. 
పెద్దబొట్టమ్మ: నయని, విశాల్ బాబు బిడ్డను మీరే ఆదుకోవాలి జాగ్రత్తయ్యా.

హాసిని గదికి వచ్చి తిలోత్తమ ఇచ్చిన హారం అద్దంలో చూసుకుంటుంది. తిలోత్తమ, వల్లభలు బయట నుంచి హాసినిని చూస్తూ ఉంటారు. హాసినికి కళ్లు తిరుగుతాయి. హాసిని అక్కడే తిలోత్తమ పెట్టిన పేపర్ మీద ఏదో రాస్తుంది. వల్లభ వెళ్లి హాసినిని డిస్ట్రబ్ చేయడంతో పిచ్చి గీతలు గీసేస్తుంది. తిలోత్తమ వల్లభను తిడుతుంది. మరోవైపు సుమన మేకప్ వేసుకుంటుంది. అది చూసి విక్రాంత్ తిడతాడు. పాపని పట్టించుకోకుండా మేకప్ ఏంటి అని తిడతాడు. పాప పాదాలు మాడిపోయినా పట్టించుకోకుండా ఏం చేస్తున్నావ్ అని తిడతాడు. తన తల్లి డబ్బు ఇస్తాను అని అంది అదంతా నాటకం అని విక్రాంత్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మితో లక్కీ వీడియో కాల్ మాట్లాడటం చూసేసిన మిత్ర.. తన అక్క బతికే ఉందని అరవిందకు చెప్పిన జాను!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Daaku Maharaj Collection Day 1: 'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
Hyderabad Drugs: పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
India HMPV Cases: భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు, ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే
భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు, ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Embed widget