Chiranjeevi Lakshmi Sowbhagyavathi July 3rd Episode: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మితో లక్కీ వీడియో కాల్ మాట్లాడటం చూసేసిన మిత్ర.. తన అక్క బతికే ఉందని అరవిందకు చెప్పిన జాను!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode లక్ష్మి బతికే ఉందని ఇంటి బయట చూశాను అని జాను అరవిందతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: వివేక్ జానుని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇద్దరూ లక్కీ దగ్గరకు వెళ్తారు. జాను లక్కీతో మాట్లాడుతుంది. ఇక మిత్ర లక్కీని దగ్గరుండి చూసుకోమని జానుకి చెప్తాడు. దానికి జున్ను నేను చూసుకుంటాను అంటే వద్దు అని టీచర్‌కి చెప్తున్నారు అంటే మీరు పార్శియాలిటీ చూపిస్తున్నారు అని అంటాడు. మిత్ర అలా ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లక్ష్మీ మిత్రని ఒకసారి చూసి వెళ్లిపోతా అనుకొని ఇంటి లోపలికి వెళ్తుంటుంది. మిత్ర బయటకు రావడం అరవింద మిత్రలో మాట్లాడటం చూస్తుంది.
అరవింద: ఈ టైంలో కూడా ఎందుకు మిత్ర. దానికి అసలే బాలేదు. అది ఎవరి మాట వినదు. ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా మిత్ర.
లక్ష్మి: అరవింద అత్తయ్యగారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు.
మిత్ర: మామ్ ఇప్పుడు తనకి బానే ఉంది కదా. అయినా లక్కీని దగ్గరుండి చూసుకోవడానికి జాను ఉంది కదా.
లక్ష్మి: జాను ఎవర్ని చూసుకోవడానికి వచ్చింది. అసలు ఈ ఇంట్లో ఎవరికి ఏమై ఉంటుంది. వీళ్లిద్దరూ ఇంతలా మాట్లాడుకునే వ్యక్తి ఈ ఇంట్లో ఎవరు ఉన్నారు.
అరవింద: మిత్ర రేపు ఏం పని పెట్టుకోకు దీక్షితులు గారు కలవమన్నారు. నీ గండానికి సంబంధించి ఏదో పూజ ఉంది అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ కాకూడదు అన్నారు.
దీక్షితులు: లక్ష్మీతో చెప్పిన మాటలు.. నువ్వేం దిగులు పడకు లక్ష్మి నువ్వు చేసే ఈ దీక్షతో మిత్రను గండం నుంచి తప్పించు బలం లభిస్తుంది. మిత్రను కబళించే ప్రమాదాన్ని తొలగించడానికి బలం లభిస్తుంది. మరో విషయం నీ చేతుల మీదగా చేస్తే సరిపోదు. మిత్ర చేతుల మీద కూడా జరగాలి. ఈ దీక్ష అంత సేపు మిత్ర నీ పక్కనే ఉండాలి. అడుగడుగునా నీతో కలిసి అడుగేయాలి. తన సమక్షంలోనే నువ్వు పూజ చేయాలి. అలాగే మిత్ర సంబంధీకులు ఎవరో ఒకరి చేతితో నువ్వు అమ్మవారి ప్రసాదం స్వీకరించాలి. ఎవరో ఒకరు అంటే కచ్చితంగా అరవింద వస్తుంది. వారిద్దరి సమక్షంలో ఈ దీక్ష ముగుస్తుంది.
జాను: వివేక్ కంగ్రాట్స్. సంబంధం ఫిక్స్ అయింది అంట కదా.. అమ్మాయి నచ్చిందా. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు.
వివేక్: జాను స్టాపిట్. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావే నిజంగా తెలుసుకోవాలి అని అడుగుతున్నావా. నా జవాబు తెలిసే అడుగుతున్నావా.
జాను: నీ పెళ్లితో నా జీవితం ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా పెళ్లి చేసుకోకతప్పదు. నాకు దక్కని అదృష్టం తలచుకొని నేను బాధ పడకా తప్పుదు.
వివేక్: నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నా నువ్వు ఇప్పుడు అవును అన్నా నేను నీ మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉన్నాను. కేవలం నీ సమాధానం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నా.
జున్ను లక్కీతో నీకు దెబ్బ తగ్గదు కాబట్టి రెండు మూడు రోజులు స్కూల్‌కి రావు నీకే హ్యాపీ అని అంటాడు. ఇక అరవింద రావడంతో తొందరగా తగ్గిపోతుంది. స్కూల్‌కి వచ్చేయ్మని చెప్తున్నా అని అంటాడు. దీంతో లక్కీ జున్ను మాటలకు షాక్ అయిపోతుంది. జున్నుకి అర్థమైనట్లు సెటైర్లు వేస్తుంది. ఇక వసుంధర జున్నుని తీసుకొని బయల్దేరుతుంది. మధ్యలో లక్ష్మిని చూసి ఆగుతారు. ఇక లక్కీ గురించి అడుగుతుంది. బాగుందని జున్ను చెప్తాడు. ఇక లక్ష్మి మిత్ర గారి వీధిలోనే లక్కీ ఉంటుందా అని అనుకుంటుంది. జాను రాత్రి లక్కీకి అన్ని పనులు చేసి పడుకోపెట్టి ఇంటికి వెళ్లిపోతానని అంటుంది. దానికి అరవింద రాత్రి వెళ్లొద్దని చెప్తుంది. ఇది నీ అక్క ఇళ్లు అని నీకు ఇష్టం వచ్చినప్పుడు రావొచ్చు వెళ్లొచ్చని అంటుంది.
జాను: అక్క అంటే గుర్తొచ్చింది అత్తయ్యగారు. నాకు ఎందుకో అక్క చనిపోయింది అని అనిపించడం లేదు.
అరవింద: మనసులో.. నాకు అనిపించినట్లే జానుకి ఎందుకు అనిపిస్తుంది.
జాను: అక్క మనల్ని ఓ కంట కనిపెడుతుందని అనిపిస్తుంది. మనం చేసే ప్రతీది గమనిస్తుంది అని అనిపిస్తుంది. నేను అక్కని చూశాను అత్తయ్యగారు.
అరవింద: ఏంటి లక్ష్మిని చూశావా. ఎప్పుడు ఎక్కడ.
జాను: అర్జున్ గారి ఫంక్షన్‌లో మొదటి సారి. చూశా.. ఈ రోజు కూడా ఈ ఇంటి గేటు ముందు నాకు అక్క కనిపించింది. వెళ్లి చూసే సరికి మాయం అయిపోయింది. అది నేను భ్రమ అనుకోవడం లేదు. కచ్చితంగా అక్క బతికే ఉందని అనుకుంటున్నా.
అరవింద: నాకు అలాగే ఉంది జాను. అతి త్వరలో మనకు లక్ష్మీని చూసే అవకాశం వస్తుందని అనిపిస్తుంది.
జున్ను రాత్రి మిత్ర ఫోన్‌కి వీడియో కాల్ చేస్తాడు. లక్కీ భోజనం చేసిందా అని అడుగుతాడు. మిత్ర కాల్ కట్ చేసేస్తే మళ్లీ కాల్ చేస్తాడు. మిత్ర, జున్నులు ఒకర్ని ఒకరు సెటైర్లు వేస్తారు. లక్కీ నిద్ర పోతుంది అని చెప్తే జున్ను లేపమని అంటాడు. ఇక లక్కీ నిద్ర లేచి జున్ను, అర్జున్‌లతో మాట్లాడుతుంది. లక్ష్మీ అక్కడికి రావడంతో జున్ను లక్కీతో మాట్లాడమంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిపోడ్ పూర్తయిపోతుంది.