Brahmamudi Serial Today July 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కళ్యాణ్ కు కోటి రూపాయల కట్నం ఇచ్చామన్న అనామిక – మీ నాన్న చేసిన రెండు కోట్ల అప్పు రాజ్ తీర్చాడన్న లాయర్
Brahmamudi Today Episode: అనామిక, కళ్యాణ్ కేసు సంబంధించిన వాదోపవాదాలు కోర్టులో చాలా ఆసక్తికరంగా జరగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్ట్ గా జరిగింది.
Brahmamudi Serial Today Episode: పోలీసులు కళ్యాణ్‌ను కోర్డు గ్గరకు తీసుకొస్తారు. ధాన్యలక్ష్మీ ఏడుస్తుంది. అలాంటి ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి మీ బాధకు కారణమయ్యాను నన్ను క్షమించు అమ్మా అని కళ్యాణ్ చెప్తాడు. మరోవైపు రాజ్ మీడియా మీద కోప్పడుతుంటే కావ్య పక్కకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు ఆవేశపడితే గొడవ పెద్దదవుతుంది అని సర్ధి చెప్తుంది. ఇంతలో అనామిక తన తల్లిదండ్రులతో కలిసి కోర్టు దగ్గరకు వస్తుంది. నేను వెళ్లి అనామికతో మాట్లాడి వస్తానని కావ్య వెళ్తుంది. కోర్టు దగ్గర మహిళా సంఘాలు ధర్నా చేయడాన్ని చూసి హ్యాపీగా ఫీలవుతుంది అనామిక.
కావ్య: చూడు అనామిక నువ్వు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఇప్పటికీ ఏమీ మించి పోయింది లేదు నా మాట విను.
అనామిక: ఇంత దూరం వచ్చాక ఇక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఏదున్నా కోర్టు లోపలే తేల్చుకుందాం..రండి నాన్నా..
రుద్రాణి: హమ్మయ్యా ఎక్కడ ఈ కావ్య, అనామికను కన్వీన్స్ చేసి కేసు వాపస్ తీసుకునేలా చేస్తుందని చాలా భయపడ్డాను.
రాహుల్: కావ్య మాట్లాడినంత మాత్రానా అనామిక ఎందుకు ఒప్పుకుంటుంది మమ్మీ.
రుద్రాణి: ఓరేయ్ నువ్వు కావ్యను తక్కువ అంచనా వేస్తున్నావు. అది ఆఖరి నిమిషంలో కూడా అనుకున్నది సాధించగలదు. దానికి ఆ అవకాశం ఇవ్వకుండా అనామికను ఆదిలోనే ఆపేసి దాని గోతి అదే తవ్వుకుంది. ఇక కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం పద.
అంటూ అందరూ లోపలికి వెళతారు. కోర్టులో వాదోపవాదాలు మొదలవుతాయి.
అనామిక లాయర్: మిలాట్ నా క్లయింట్ అనామిక ఇవాళ కోర్టుకు రావడానికి కారణం ఆమె అనుభవించిన శారీరక, మానసిక హింసలు మాత్రమే కారణం. పెళ్లికి ముందు నుంచే అప్పు అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి అయినా కూడా సంబంధం కంటిన్యూ చేశాడు. ఈ విషయంలోనే అనామిక ఓకసారి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. ఈ కళ్యాణ్, అనామికను కట్నం కోసం వేధిస్తూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను.
జడ్జి: నీ తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ ఉన్నారా?
కళ్యాణ్ లాయర్: ఎస్ మిలార్డ్. ముద్దాయి తరపున వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి. కళ్యాణ్ స్వతహాగా కవి. ఇలాంటి కవులకు సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. కానీ పీపీ గారు వారి క్లయింట్ తరపున చాలా అభియోగాలు మోపారు. కానీ అవన్నీ కరెక్టు కాదని వారే ఒప్పుకోవాల్సి వస్తుంది.
అని కళ్యాణ్ లాయర్ అనామికను ప్రశ్నిస్తాడు. తర్వాత కళ్యాణ్ కవితలు రాయడమే తప్పా బిజినెస్ చూసుకోడని అనామిక అతన్ని ఎన్నో రకాలుగా టార్చర్ చేసిందని వాదిస్తాడు. తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అని ఆరోపించారు. అంటే ముందు కట్నం ఇచ్చారన్నా మాట అని మీరెంత కట్నం ఇచ్చారని లాయర్ అడగ్గానే కోటి రూపాయలు ఇచ్చామని అనామిక అబద్దం చెప్తుంది. దీంతో లాయర్... కట్నం తీసుకోవడం నేరమైతే ఇవ్వడం కూడా నేరమే ముందు వీళ్ల నాన్నని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పగానే అనామిక షాక్ అవుతుంది. తర్వాత అనామిక పెళ్లి రోజు ఒక వడ్డీ వ్యాపారి వచ్చి తన అప్పు తీర్చకపోతే పెళ్లి ఆపేస్తానని బెదిరించడంతో.. అతనికి రెండు కోట్లు ఇచ్చి పెళ్లి జరిగేలా రాజ్ చేశారని అలాంటి కుటుంబం అదనపు కట్నం కోసం వేధించడం ఏంటని ప్రశ్నిస్తాడు. తర్వాత అనామిక లాయర్ వాదిస్తూ అప్పుతో కళ్యాణ్‌కు ఉన్న రిలేషన్ గురించి అడుగుతుంది. దీంతో జడ్జి ఈ భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైన అప్పును రేపు కోర్టులో ప్రవేశపెట్టండి అని కోర్టును వాయిదా వేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్