అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Satyabhama Serial Today July 2nd: సత్యభామ సీరియల్: నిజం తెలుసుకున్న క్రిష్ ఊరుకుంటాడా.. కాళీకి చెక్ పెట్టడానికి తండ్రితో కలిసి సత్య మాస్టర్ ప్లాన్..!

Satyabhama Serial Today Episode సత్య చెప్పిన ప్లాన్ ప్రకారం విశ్వనాథం కాళీకి కాల్ చేసి డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode కాళీ బెదిరింపుల గురించి క్రిష్‌కి చెప్పొద్దని సత్య తల్లిదండ్రలు సత్యతో చెప్తారు. వీడియో గురించి తెలిస్తే క్రిష్ అపార్థం చేసుకునే అవకాశం ఉందని భయపడతారు. క్రిష్‌కి విషయం చెప్పొద్దని సత్య దగ్గర మాట తీసుకుంటారు. మరోవైపు రేణుక కడుపులో బిడ్డతో ఏడుస్తూ మాట్లాడుతుంది. 

రేణుక: నిన్ను కడుపులో మోయడానికో కనడానికో ఘోష పడుతున్నట్లు లేదు బిడ్డ. నిన్నుఆ యమధర్మరాజు నుంచి కాపాడుకోవడానికే ఘోష పడుతున్నా, తపన పడుతున్నా. రుద్ర వచ్చి రేణుకని గట్టిగా పట్టుకొని బాధ పెట్టడంతో.. ఎందుకయ్య ఎందుకు ఇంత పగ పట్టినావ్.
రుద్ర: ఎందుకో నీకు తెలుసు. అనుకున్నది చేసే వరకు వదిలిపెట్టనని నీకు కూడా తెలుసు. మోసం చేసి బిడ్డను కందాం అని నువ్వు అనుకుంటే మోసంతోనే నీ కళ్లు కప్పి బిడ్డ లేకుండా చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఈ రోజు తప్పించుకున్నావ్. మా అమ్మ జాగాలో నువ్వు ఉండాల్సింది. 
రేణుక: ఇది మన బిడ్డ అయ్యా.. నీ బిడ్డ అయ్యా..
రుద్ర: అయితే నా బిడ్డ నాకు ఇచ్చేయ్. తొమ్మిది నెలలు ఆగలేనే.
రేణుక: మరీ ఇంత రాక్షసత్వం ఏంటయ్యా.
రుద్ర: కారణం నువ్వే.. రెచ్చగొడుతున్నావ్. నాకు ఇష్టం లేని పని చేస్తున్నావ్. అందరి ముందు నా ఇజ్జత్ తీస్తున్నావ్.
రేణుక: ఏం చేస్తే నా బిడ్డ జోలికి రాకుండా ఉంటావ్ చెప్పవయ్యా..
రుద్ర: పారిపో నా కళ్లకు కనిపించకుండా ఎక్కడికైనా పారిపో..
రేణుక: ఇది నా ఇళ్లు నువ్వు నా పెనిమిటి విడిచిపెట్టి ఎక్కడికి పోతాను.
రుద్ర: నాతో ఉండాలి అంటే నేను చెప్పినట్లే ఉండాలి. 
రేణుక: ఒక్క బిడ్డ విషయంతో తప్ప ఇంకేదైనా నువ్వు చెప్పినట్లు ఉంటాను.
రుద్ర: ఏయ్.. నీ చుట్టూ ఉన్న మంది నిన్ను నా నుంచి కాపాడుతారు అనుకుంటున్నావేమో. కానీ అది కల. ఏ వైపు నుంచి ఎలా నీ బిడ్డకు చావు వస్తుందో నీకు తెలీదు. ఆ బిడ్డను వెలుగు చూడనివ్వవు. ఇది పక్కా రాసి పెట్టుకో.
రేణుక: నువ్వు నీ నాయన మాటలు పట్టించుకోకు. ఎట్లా చేసి అయినా సరే ఈ అమ్మ నిన్ను బతికించుకుంటుంది.

క్రిష్ విశ్వనాథం సేటు దగ్గర అప్పునకు వెళ్లడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సత్య వచ్చి వాటర్ తాగి పొలమారుతుంది. క్రిష్ వెళ్లి ప్రేమగా సత్యకు సేవలు చేస్తాడు. అది చూసి సత్య సైలెంట్ అయిపోతుంది. ఇక క్రిష్ సత్యని తీసుకొచ్చి కూర్చొపెట్టి మాట్లాడుతాడు.

క్రిష్: బాధగా అనిపిస్తుంది. మన అనుకున్న వాళ్లు మనల్నిదూరం పెడుతుంటే కష్టంగా అనిపిస్తుంది. మన వాళ్లు మన దగ్గర నిజాలు దాచి పెడుతుంటే గుండెలు పిండేసినట్లు అవుతుంది. 
సత్య: నిజమే నిజమేదో అబద్ధమేదో నాకు తెలుసుకోవాలి అని ఉంది. అదే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్.
క్రిష్: ఇరవై లక్షల అప్పుకోసం మీ నాన్న ఇళ్లు తాకట్టు పెట్టి సేల్ అగ్రిమెంట్ చేస్తున్నాడు. కళ్లారా చూశా.. అప్పు చేస్తున్న విషయం నీకు తెలీదా. ఇరవై లక్షల అప్పు అంటే చిన్న మాట కాదు. చిన్న అవసరం అయితే కాదు. నాకు చెప్పొద్దు అనుకున్నారేమో కానీ నీకు అయినా చెప్పాలి కదా. కూతురివి..
సత్య: (క్రిష్‌కి తండ్రి నిజం చెప్పొద్దు అనడంతో క్రిష్‌కి విషయం తెలీకూడదని మాట్లాడుతుంది) నాకు కూడా చెప్పొద్దు అనుకున్నారేమో. 
క్రిష్: మీ తండ్రికూతుళ్ల మధ్య బంధం నాకు తెలుసు సత్య. దాపరికాలు ఉండవు. ఆయన బాధ పడితే నువ్వు చూడలేవు. వేరేలా అనుకోకు సత్య. నీకు కూడా చెప్పలేదు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏం లేదు మళ్లీ కాళీ గాడు ఏమైనా తగులుకున్నాడేమో అని. నువ్వేమంటావ్ సత్య. నీకు ఏ అనుమానం రావడం లేదా.
సత్య: మనసులో.. జవాబు చెప్పలేని మనిషిని ప్రశ్నించి లాభం లేదు క్రిష్. నువ్వు ఆల్రెడీ కాళీకి బుద్ధి చెప్పావ్ కదా.. వాడు పారిపోయాడు కదా..
క్రిష్: నాకు అలా అనిపించడం లేదు. వాడివి చిల్లర బెదిరింపులు అనుకున్నా ఇప్పుడది తప్పు అనిపిస్తుంది. మనసులో ఏదో పెద్ద పగ పెట్టుకొని ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అనిపిస్తుంది. నువ్వేంటి సత్య అంత ఈజీగా మాట్లాడుతున్నావ్. వాళ్ల అవసరాలు ఏంటి.. మనవాళ్లే కదా వాళ్లు కూడా పైసలు అవసరం అయితే నన్ను అడగొచ్చు కదా. నేను ఇస్తా కదా. నేను కూడా ఆ ఇంటి మనిషినే కదా. 
సత్య: ఎందుకు అంత లోతుగా ఆలోచిస్తావ్. మా నాన్నకి ఆత్మాభిమానం ఎక్కువ ఎవరి ముందు ముఖ్యంగా తన వాళ్ల  ముందు చేయి చాచరు. తన తంటాలు తానే పడతారు.
క్రిష్: నువ్వు అబద్ధం చెప్తున్నావ్. మనిద్దరం చాలా కాలంగా కలిసి బతుకుతున్నాం. ఇంత వరకు నువ్వు నన్ను అర్థం చేసుకోలే. నా ప్రేమను అర్థం చేసుకోలే. దగ్గరైనట్లే ఉంటావ్ కానీ మన నడుమ తగ్గనంత దూరం ఉంటుంది. మంచిగానే మాట్లాడుతావ్ కానీ నా మంచి తనం అర్థం చేసుకోవు. మూడు ముళ్లు మనల్ని దగ్గర చేసినా మన మనసులు దగ్గరవ్వడానికి ఏవేవో కారణాలు అడ్డుపడుతున్నాయ్. నీ లెక్క నీ ఫ్యామిలీ కూడా నన్ను అపార్థం చేసుకుంటుంది. నన్ను దూరం పెడుతుంది. ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారో అని ఎదురు చూస్తున్నాను సత్య.
సత్య: క్రిష్ వెళ్లిపోగానే.. మన మనసులు దగ్గర అవ్వాలి అంటే నేను కొన్నింటిని మర్చిపోవాలి. కొన్నింటికి అలవాటు పడాలి. నువ్వు చేసిన కొన్ని తప్పులు క్షమించాలి. అన్నింటికి మించి వీటిన్నింటికి నా మనసును ఒప్పించాలి.

సత్య తన తండ్రికి కాల్ చేసి ఇళ్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న సంగతి క్రిష్‌కి తెలిసిపోయిందని చెప్తుంది. క్రిష్‌తో అబద్ధం చెప్పాను అని కాళీ కోసం తీసుకున్నట్లు చెప్పలేదు అని కాకపోతే ఆ ఇరవై లక్షలు ఎందుకు తీసుకున్నారో తెలుసుకునే వరకు క్రిష్ వదిలిపెట్టడని దాని గురించి టెన్షన్‌గా ఉందని అంటుంది. ఇక సత్య తన తండ్రితో కాళీకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వను ఏం చేస్తారో చేసుకోమని చెప్పమంటుంది. విశ్వనాథం భయపడతాడు. అన్నీ తేల్చేద్దామని సత్య విశ్వనాథానికి ఏం చేయాలో చెప్తుంది. సత్యని విశ్వనాథం ఒప్పించే ప్రయత్నం చేసినా సత్య ఒప్పుకోదు. అయితే ఇదంతా జరిగేటప్పుడు నందిని ఇంట్లో ఉంటే క్రిష్‌కి విషయం తెలిసిపోతుందని నందినిని బయటకు పంపిస్తా అంటాడు. ఇక విశ్వనాథం సత్య చెప్పినట్లు కాళీకి కాల్ చేస్తాడు. డబ్బులు ఇవ్వను అని అన్నింటికి సిద్ధపడే మాట్లాడుతున్నానని అంటాడు. దాంతో కాళీ రగిలిపోతాడు. తానేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసుకుంటాడు.

ఇక ఉదయం మహదేవయ్య అందరినీ పిలుస్తాడు. సత్య అక్కడ లేకపోవడంతో భైరవి సత్య గురించి అడుగుతుంది. గదిలో సత్య కాళీని తన తండ్రి రెచ్చగొట్టాడని వాడు వచ్చి అల్లర చేసేలోపు తాను ఆ ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్‌లో దీప వింత ప్రవర్తన.. 'దీప నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా': జ్యోత్స్న,

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget