అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 2nd: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్‌లో దీప వింత ప్రవర్తన.. 'దీప నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా': జ్యోత్స్న, 

Karthika Deepam 2 Serial Episode స్వప్న, కావేరిలు శ్రీధర్‌ని చూడకుండా తప్పించడానికి దీప కావేరి వాళ్లని వెళ్లిపోమనడంతో కార్తీక్, జ్యోత్స్నలలో అనుమానాలు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode: కావేరి, స్వప్నలు కార్తీక్ ఫ్యామిలీ ఉన్న హోటల్‌కే రావడంతో దీప వాళ్లని చూస్తుంది. శ్రీధర్‌కి సైగ చేస్తుంది. శ్రీధర్ వాళ్లని చూసి తన పని అయిపోయింది అనుకుంటాడు. ఇక కాంచన, జ్యోత్స్నలు కార్తీక్‌కి పెళ్లి గురించి శుభవార్త చెప్పమని అడుగుతారు. 

దీప: మనసులో.. ఇప్పుడు ఈయన ఎలా తప్పించుకుంటాడు. పాపం కాంచన గారిని చూస్తుంటే బాధేస్తుంది. ఇక ఈ రోజుతో ఆవిడకు నిజం తెలిసిపోయినట్లే. 
కాంచన: రేయ్ ముందు నువ్వు పెళ్లి గురించి చెప్పరా.
కార్తీక్: చెప్పడానికే పిలిచాను అమ్మ కానీ దాని కంటే ముందు.
శ్రీధర్: కార్తీక్ మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. (వీడి పెళ్లి నా చావుకి వచ్చింది.)
కార్తీక్: ఏమైంది నాన్నకి.. 
స్వప్న: ఏంటి బాస్ సైలెంట్‌గా ఇంత సర్‌ప్రైజ్ ఇచ్చావ్. స్పెషల్ దీప కూడా ఇక్కడే ఉంది. 
శ్రీధర్: వీడే వీళ్లని ఇక్కడికి రమ్మన్నాడా. వీళ్లని రమ్మనడం, దీపని రమ్మనడం ఇదేదో అనుకోకుండా జరిగినట్లు లేదు కావాలనే ఇలా ప్లాన్ చేశారా. 
కార్తీక్: అమ్మ స్వప్న అంటే తినే. 
కాంచన: ఇప్పుడు కాలు నొప్పి తప్పిందా అమ్మ.
స్వప్న: తగ్గిందమ్మా..
దీప: వీళ్లు ఇక్కడే కూర్చొంటే శ్రీధర్ గారు ఎలా వస్తారు.
స్వప్న: ఆంటీ నా గురించి బాస్ ఏమైనా చెప్పారా.. చెప్పే ఉంటారులే..వాగుడు కాయ అని, రేడియో మింగేసిందని, అవతల వాళ్ల తల తింటుందని చెప్పేఉంటారులే. నన్ను చూస్తే అలా అనిపిస్తుందా. 
కాంచన: అస్సలు అలా అనిపించడం లేదు. వీడు ఇంకా తక్కువ చెప్పాడు అనిపిస్తుంది. 
స్వప్న: మీరు కూడా నన్ను బాస్‌లాగే ఆటపట్టిస్తున్నారు.
దీప: నిజం తెలీక వీళ్లు పరిచయాలు చేసుకుంటున్నారు. వీళ్లు కూడా నాలా మోసపోయిన ఇద్దరు ఆడవాళ్లు. 
శ్రీధర్: అక్కడేం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఏ క్షణం అయినా బాంబ్ పేలొచ్చు ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి. 
స్వప్న: ఆ సీట్ కాళీగా ఉంది ఏంటి.
కార్తీక్: మా నాన్న కూడా వచ్చారు. ఇప్పుడే అటు వెళ్లారు. రాగానే పరిచయం చేస్తానులే.
దీప: నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే వీళ్లకి నిజం తెలిసిపోయేలా ఉంది. శ్రీధర్ దగ్గరకు వెళ్లి.. వాళ్లు అక్కడే కూర్చున్నారు అండి. అక్కడికి వచ్చారు అంటే అందరికీ నిజం తెలిసిపోతుంది.
శ్రీధర్: నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అమ్మ. నువ్వు నా గురించి ఆలోచించి పిలవకపోతే నేను వాళ్లకి దొరికిపోయే వాడిని.
దీప: నేను ఇప్పటికి మీ గురించి ఆలోచించడం లేదు అండి. నిజం తెలిస్తే కాంచన గారు బతకరు. ఆ విషయం మీకు తెలుసు. ఇది వాళ్లతో మీరు ఎప్పటికైనా చెప్పాల్సిందే కానీ ఇది సమయం కాదు. కాంచన గారి గురించే కాదు పిల్లల గురించి ఆలోచించడండి. మీరు చాలా గొప్పవారు అని వాళ్ల మనసులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి వారో తెలిస్తే వాళ్లు తట్టుకోలేరు. ఒక రకంగా మీరు అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. మనుషుల నమ్మకాలతో మాత్రం ఆడుకోకండి సార్. 
జ్యోత్స్న: ఏదో జరుగుతోంది. బావ నేను ఇప్పుడే వస్తాను.
శౌర్య: అందరూ వెళ్తున్నారు కానీ ఎవరూ రావడం లేదు ఏంటి.
జ్యోత్స్న: దీప మామయ్యతో మాట్లాడుతుందేంటి ఏదో జరుగుతోంది. 
కాంచన: వాళ్లకి మీ నాన్నని పరిచయం చేద్దామని చెప్పి ఇక్కడే కూర్చొపెట్టేశాం కార్తీక్ ఒక సారి మీ నాన్నకి కాల్ చేయ్.
దీప: అవసరం లేదు కార్తీక్ బాబు మీ నాన్న గారు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు.
జ్యోత్స్న: ఇంతలా ఎలా అబద్ధం చెప్తున్నావ్ దీప ఇప్పుడే కదా నువ్వు మాట్లాడటం చూశాను. ఏదో జరుగుతోంది. 
కావేరి: సరే బాబు మేం వేరే ప్లేస్‌లో కూర్చొంటా తర్వాత వస్తే పరిచయం చేద్దువులే.
కార్తీక్: ఏం పర్లేదు కూర్చొండి.
దీప: వెళ్లనివ్వండి బాబు. వాళ్లు ఇక్కడే ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా వెళ్లనివ్వండి. 
కావేరి: మేమేం ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు దీప. స్వప్నకి కార్తీక్ తెలుసు కాబట్టి వచ్చాం. రా స్వప్న..
జ్యోత్స్న: దీప నువ్వేంటో నీ ఉద్దేశాలు ఏంటో నాకు బాగా అర్థమవుతున్నాయి. నీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు అందుకే బావ మాట్లాడకుండా.. మామయ్య రాకుండా ఆపేశావ్. ఛా .. అసలేం జరుగుతుంది. 
కాంచన: ఏంటి దీప నువ్వేనా వాళ్లతో అలా మాట్లాడింది వాళ్లు కార్తీక్‌కి తెలిసిన వాళ్లు కదా.. ఫీలవుతారు కదా. 

శ్రీధర్ వస్తాడు కాంచన స్వప్న, కావేరిల గురించి చెప్తుంది. ఇక పెళ్లి గురించి మాట్లాడి అన్నావ్ కదా చెప్పు అని జ్యోత్స్న అంటే కార్తీక్ మనసులో ఇప్పుడు అందరి మూడ్‌ బాలేదు అని దీప కూడా కొత్తగా ప్రవర్తిస్తుందని తర్వాత చెప్తా అనుకుంటాడు. తర్వాత చెప్తా అని అనేస్తాడు. ఇక జ్యోత్స్న దీప తనని మోసం చేస్తుందని అనుకుంటుంది. దీప బయటకు వెళ్తే కార్తీక్ దీప దగ్గరకు వెళ్లి ఇవాళ ఏమైంది వింతగా ప్రవర్తించారని అడుగుతాడు. చేయి కడుక్కుంటూ అని చెప్పి వెళ్లి చాలా సేపటి తర్వాత వచ్చి చేయి కూడా కడుక్కోకుండా వచ్చావని, కంగారుగా ఉన్నావని ఏమైందని అడుగుతాడు. స్వప్నవాళ్లు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్నట్లు మాట్లాడావ్ అని అడుగుతాడు. దాంతో దీప కవర్ చేస్తుంది. అయినా కార్తీక్ అడుగుతాడు. దీప చెప్పబోయే టైంకి శౌర్య రావడంతో దీప ఆపేస్తుంది. శౌర్యతో వెళ్లిపోతుంది. దీప ఏదో విషయం దాచేస్తుందని కార్తీక్ అనుకుంటాడు. 

జ్యోత్స్న దగ్గరకు వచ్చిన పారిజాతం వెటకారంగా పాటలు పాడుతుంది. దీప ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్త పడమని చెప్పినా నువ్వు పట్టించుకోలేదు అని పారిజాతం అంటుంది. ఇప్పటి వరకు దీప, బావల మీద నమ్మకం ఉందని కానీ ఈ రోజు రెస్టారెంట్‌లో దీపలో కొత్త దీప కనిపించిందని, కార్తీక్ తనని పెళ్లి చేసుకోవడం దీపకు ఇష్టం లేదు అని జ్యోత్స్న పారుతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కాళీ.. కిడ్నాప్.. సంధ్య పెళ్లి.. నిజాలు తెలుసుకున్న సత్య, రుద్ర చేసిన పనికి భైరవికి గాయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget