అన్వేషించండి

Satyabhama Serial Today July 1st: సత్యభామ సీరియల్: కాళీ.. కిడ్నాప్.. సంధ్య పెళ్లి.. నిజాలు తెలుసుకున్న సత్య, రుద్ర చేసిన పనికి భైరవికి గాయం!  

Satyabhama Today Episode సంధ్య ద్వారా విషయం తెలుసుకున్న సత్య తల్లిదండ్రులను నిలదీసి కాళీ బెదిరింపుల గురించి నిజాలు తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సంధ్య సత్య దగ్గరకు వచ్చి కాళీ మళ్లీ బెదిరిస్తున్నాడు అని అందుకే విశ్వనాథం ఇళ్లు అమ్మేస్తున్నారు అని విషయం చెప్తుంది. సత్య షాక్ అయిపోతుంది. క్రిష్‌తో చెప్పి విషయం చెప్పి సాల్వ్ చేయించమని సంధ్య అంటుంది. దాంతో సత్య ముందు ఇంటికి వెళ్దామని సంధ్యని తీసుకొని ఇంటికి వెళ్తుంది. 

రుద్ర: ఎందుకిలా జరుగుతుంది. రేణుక బిడ్డను కన్నది అంటే నేను జీవితాంతం దానితోనే బతికి చావాలి. కుదరదు. అది కుదరదు. ఏదో ఒకటి చేయాలి. పంకజం మినుములు మేడ మీద ఆరపెట్టడానికి తీసుకెళ్తే వాటిని చూసిన రుద్రకు వాటిని మెట్ల మీద పడేసి రేణుక పడేలా చేయాలి అనుకుంటాడు. 

రుద్ర వాటిని మెట్ల మీద చల్లి తల నొప్పి అని టీ తీసుకురమ్మని రేణుకని పిలుస్తాడు. రుద్ర మాటలు  విన్న  మహదేవయ్య భైరవిని సీరియస్‌గా చూడగా భైరవి తనకుఇ అర్థమైంది అని రేణుక టీ తీసుకొస్తుంటే అడ్డంగా వెళ్లి రేణుకని ఆపి తాను టీ తీసుకొని వెళ్లి రుద్రకి ఇవ్వడానికి మెట్లు ఎక్కి మినుముల మీద కాలు వేసి జారి పడిపోతుంది. మహదేవయ్య అందరిని తిడతాడు. రేణుకకి ఏమైనా అయింటే ఏంటి పరిస్థితి అని సీరియస్ అవుతాడు. రేణుక మాత్రం భర్తని అనుమానంగా చూస్తుంది. 

విశాలాక్షి: ఈ ఇళ్లు వదులుకుంటే మన పరిస్థితి ఏంటి అండి.
విశ్వనాథం: ఇళ్లు వదులుకుంటే అద్దె ఇంట్లో ఉంటాం. కానీ మన పరువు పోతే ఏంటి పరిస్థితి. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇంత కంటే వేరే దారి లేదు విశాలాక్షి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో సత్యకి అస్సలు తెలీకూడదు. 
సత్య: ఏం జరుగుతుంది ఈ ఇంట్లో. ఎందుకు నా నుంచి నిజాలు దాస్తున్నారు. ఎందుకు నన్ను పరాయివాళ్లలా చూస్తున్నారు. ఈ ఇంటి సమస్యల నుంచి నన్ను దూరంగా ఉంచుతున్నారు. 
విశ్వనాథం: సంధ్య అక్కకి మొత్తం చెప్పేశావా. ఎందుకు చెప్పావ్. నిన్నే.. ఈ ఇంటి విషయాలు గుమ్మం దాటి వెళ్లాల్సిన అవసరం ఏముంది. మీ నాన్న చేతకాని వాడు ఏం చేయలేడు అని డిసైడ్ అయిపోయావా. వెళ్లు ఈ విషయం ఊరు అంతా చెప్పు.
సత్య: ఎందుకు నాన్న సంధ్య మీద అరుస్తున్నారు. ఈ ఇంటి విషయం నాతో చెప్పడం తప్పా.
విశ్వనాథం: తప్పే అమ్మ. ఈ ఇంటికి యజమాని నేను. ప్రాబ్లమ్ వస్తే నేనే చూసుకుంటా. నువ్వు నెత్తిన పెట్టుకోవాల్సిన పని లేదు. 
సత్య: మా నాన్న ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడరు. నా నుంచి ఏదో దాయాలని చూస్తున్నారు. నాన్న సమస్య ఏంటో చెప్పండి. ఏంటి నాన్న ఇది. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతే కూతురు పరాయి అయిపోతుందా.. 
విశ్వనాథం: అత్తారింటికి వెళ్లిన కూతురు ఇక చుట్టమే. అవసరం అయితే మీ అత్తింటిని అడుగు.
సత్య: సరే అయితే మీ కూతురు ఇక లేదు అనుకోండి. 
విశాలాక్షి: తప్పు సత్య అలా మాట్లాడకు.
సత్య: నాన్న కనీసం నా ముఖం కూడా చూడటం లేదు. అంత తప్పు నేను ఏం చేశాను. కాళ్లు కడిగి కన్యాదానం చేశారు కానీ నన్ను ఆ ఇంటికి అమ్మేయలేదు కదా అమ్మ. పెళ్లి వల్ల దూరం అయ్యాను అంటే చెప్పమను బంధాలను వదులు కొని ఈ ఇంటికి వచ్చేస్తా.
శాంతమ్మ: ఇక చాలు అమ్మ ఇప్పటికే వీడు కష్టాలు భరించలేక సగం చచ్చి భరిస్తున్నాడు. గుండెల్లో చాలా కష్టం భరిస్తున్నాడు. గుండెలు బిగ పట్టుకొని బాధ పడుతున్నాడు. చస్తూ బతుకుతున్నాడు. 

విశాలాక్షి: మన ఇంట్లో ఈ అల్లకల్లోలాలకు కారణం ఆ కాళీ కారణం. వాడు ఈ ఇంటి వైపు చూడడు అనుకున్నాం. కానీ పగ పట్టిన పాములా వాడు ఈ ఇంటి మీద పగ పట్టికూర్చొన్నాడు. సంధ్య జోలికి రాకుండా ఉండాలి అంటే వాడికి ఇరవై లక్షలు ఇవ్వాలి అంట లేదంటే సంధ్యని ఇచ్చి పెళ్లి చేయాలి అంట.
సత్య: వాడి బెదిరింపులకు ఎందుకు భయపడుతున్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తాడంట. ఓ నాతో చెప్పకూడదు అనా..
విశాలాక్షి: చెప్పకూడదు అని కాదు అమ్మ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. చెప్తే నువ్వు ఏం అయిపోతావా అని ఆలోచిస్తున్నాం.
సత్య: ఏం పర్లేదు నేను తట్టుకుంటా చెప్పమ్మ.
విశాలాక్షి: వాడు నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నీ మీద జరిగిన అఘాయిత్యం తాలూకు వీడియో వాడి దగ్గర ఉంది అంట. వాడి మాట వినకపోతే ఆ వీడియో నెట్‌లో అప్ లోడ్ చేస్తాడంట. 
విశ్వనాథం: ఇరవై లక్షలు ఇస్తే ఆ వీడియో డిలీట్ చేస్తానన్నాడు. 
సత్య: నాన్న మీరు ఆ కాళీకి ఒక్క పైసా ఇవ్వకండి. వాడు మిమల్ని బెదిరిస్తున్నాడు. నన్ను కిడ్నాప్ చేసింది కాళీ కాదు క్రిష్. పైగా ఆ రోజు నా మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదు. నన్ను నమ్మండి. వాడు మీకు వీడియో చూపించాడా. లేదు కదా మరి ఎలా నమ్ముతున్నారు. నాకు ఆ రోజు అన్నం పెట్టడానికి చేయి లోపల పెట్టగానే సత్య అన్న ట్యాటూ చూశాను.
విశ్వనాథం: కాళీనే నిన్ను మాయ చేయడానికి అలా ట్యాటూ వేయించుకోవచ్చు కదా. కిడ్నాప్ చేసింది క్రిష్ అని నువ్వు అనుకునేలా తప్పు దోవ పట్టించుకోవాలి అనుకునుండొచ్చు కదా.
సత్య: వాడికి ఆ అవసరం ఏంటి.
విశ్వనాథం: నిన్ను క్రిష్‌కి దూరం చేయడం. అది వర్క్‌ట్ కాలేదు కాబట్టే ఇప్పుడు ఇలా మన వెంట పడుతున్నాడు. నిజంగా నిన్ను క్రిష్‌ కిడ్నాప్ చేసి ఉంటే నీతో నీచంగా ప్రవర్తించి ఉంటే నీ కళ్లలోకి చూసే ధైర్యమే ఉండేది కాదు. నిన్ను ఇంతలా ప్రేమించే వాడే కాదు. 


సత్య: నాకు అంతా అయోమయంగా ఉంది నాన్న. నేను క్రిష్‌నే అడుగుతాను.
విశ్వనాథం: వద్దు. మనకి కాళీ ఒక్కడే శత్రువు. అల్లుడిని కూడా చేర్చుకోవద్దు. కాళీ నిన్ను కిడ్నాప్ చేశాడని అల్లుడికి తెలిస్తే ఎలాంటి అనుమానాలు అయినా రావొచ్చు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి మాటలతో రామ్ దగ్గర మహాలక్ష్మిని ఇరికించేసిన సీత.. రామ్ మాటలకు నోరెళ్లబెట్టిన మహా!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget