Seethe Ramudi Katnam Serial Today July 1st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి మాటలతో రామ్ దగ్గర మహాలక్ష్మిని ఇరికించేసిన సీత.. రామ్ మాటలకు నోరెళ్లబెట్టిన మహా!
Seethe Ramudi Katnam Serial Today Episode రామ్‌ని మచ్చిక చేసుకోవడానికి తనని బయటకు తీసుకెళ్లమని విద్యాదేవి సీతతో చెప్పడం సీత రామ్‌ని ఒప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode ఆస్తి కోసం ప్రేమ జంటని విడదీశారని, ఓ గొప్ప మనిషిని అవమానించారని మరో మంచి మనిషిని బాధ పెట్టారని.. బాధ పడిన మనసు ఊరుకోదు గాండ్రిస్తుందని సీత మహాతో అంటుంది. మీరు ఎవర్నీ ప్రేమించలేదు మిమల్ని ఎవరూ ప్రేమించరని.. కేవలం లొంగదీసుకోవడం మాట వినేలా చేసుకోవడం మాత్రమే వచ్చని సెటైర్లు వేస్తుంది.
సీత: ఈ కుటుంబాన్ని మీ బానిసలా చేసుకున్నారు. కానీ రేవతి పిన్ని కిరణ్ గారు మీ బానిసలు కదా. కిరణ్ గారు ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తారు. రేవతి పిన్ని కిరణ్ గారి పెళ్లి జరుగుతుంది. ఆ ప్రేమ పెళ్లికి నా సాయం తప్పకుండా ఉంటుంది. ఆ పెళ్లి మీ స్వార్థానికి గొడ్డలి పెట్టు. ఇది మీ మీద ఒట్టు.
మహాలక్ష్మి: మనసులో.. కిరణ్ గాడు నిజంగా తిరిగి వస్తాడా. రేవతిని పెళ్లి చేసుకుంటాడా. వాడి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు.
కిరణ్ దుబాయ్‌లో ఉన్నట్లు చూపిస్తారు. అక్కడ కిరణ్ ల్యాప్‌టాప్‌లో రేవతి ఫొటో చూసి రేవతి మన ప్రేమను గెలిపించుకోవడానికి దేశం దాటి పరాయి దేశం వచ్చాను. మన లక్ష్యానికి చాలా దగ్గర్లో ఉన్నాను. లక్ష్యం చేరుకోవడానికి ఇంకొన్నాళ్లు పట్టొచ్చని, నా కోసం నువ్వు ఎదురు చూస్తుంటావని మహాలక్ష్మి ఎదురుగా తనకు ధీటుగా వచ్చి నిల్చొని నిన్ను నా దాన్ని చేసుకుంటా అని అనుకుంటాడు. ఇక రేవతి కూడా కిరణ్ ఫొటో చూసి ఎమోషనల్ అవుతుంది. ఆరు బయట సీత, విద్యాదేవిలు మాట్లాడుకుంటే అర్చన చాటుగా వింటుంది.
విద్యాదేవి: సీత నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. రామ్‌ని నువ్వు మచ్చిక చేసుకోవాలి. రామ్‌ని నిన్ను ఒకటి చేయాలి అని నేను అనుకున్న ప్లాన్‌ని మహాలక్ష్మి తెలివిగా తిప్పి కొట్టింది. అందుకే సీత లేనిదే నేను లేను ఉండలేను అనేంతలా నువ్వు రామ్‌ని మచ్చిక చేసుకోవాలి. మీరు ఇద్దరూ ఇంట్లో ఉంటే కలవడం కుదరదు కాబట్టి రామ్‌ని తీసుకొని బయటకు వెళ్లు.
సీత: మీరు చెప్తుంటే చాలా బాగుంది టీచర్. మంచి రోజు తీసుకొని మామని బయటకు తీసుకెళ్తా.
విద్యాదేవి: మొద్దు పిల్ల ముహూర్తం చూసుకోవా మరి. ఇప్పుడే తీసుకెళ్లు. మీరు కలిసి వెళ్లేది మంచి రోజు.
సీత: సరే టీచర్ ఈ రోజే మామని బయటకు తీసుకెళ్తా.
అర్చన: ఇంత ప్లాన్ చేస్తారా మీ పని ఇప్పుడే మహాకి చెప్తా. మహా మని ఇంట్లో ఉన్న తాటకి లాంటి టీచర్‌ని మర్చిపోతున్నావ్ మహా. తనని వీలైనంత త్వరగా ఇంటి నుంచి పంపకపోతే మన కొంప కొల్లేరు చేసేలా ఉంది.
మహాలక్ష్మి: అది మళ్లీ ఏం చేసింది.
అర్చన: ఇంట్లో ఉంటే నువ్వు రామ్, సీతలను కలవ నివ్వడం లేదు అని రామ్‌ని తీసుకొని బయటకు వెళ్లమని సీతకు సలహా ఇస్తుంది. ఇద్దరినీ మళ్లీ ఒకటి చేయాలని బయటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేయమని చెప్తుంది. షాపింగ్ పేరుతో సీత కూడా బయటకు తీసుకెళ్తా అంటుంది. ఇద్దరూ బయటకు వెళ్లడం మొదలు పెడితే వాళ్లని ఆపలేం మహా. వెంటనే రామ్‌తో మాట్లాడు మహా.
మహాలక్ష్మి: ఇప్పుడే రామ్‌తో మాట్లాడుతా. ఆ టీచర్ ప్లాన్ తిప్పి కొడతా. రెండు రోజుల పాటు రామ్ బయటకు ఎక్కడికి వెళ్లకుండా చేస్తా.
సీత: మామ ఈ రోజు నువ్వు చాలా ముద్దు వస్తున్నావ్ మామ. మామ నేను అడిగింది చేస్తావా. ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దామా.
రామ్: షాపింగా.. నేను ఇంకా రొమాన్స్ అనుకున్నా.. సరేలే వెళ్దాం.
సీత: థ్యాంక్స్ మామ.. పద పద..
రామ్: ఇప్పుడు కాదు. ఇప్పుడు కుదరదు సీత ఆఫీస్‌లో పని ఉంది. పిన్ని చాలా వర్క్ ఉంది. ఈ రోజు రేపు కూడా పని చేస్తే కూడా వెళ్లాలి అంటే కుదరదు. ఎల్లుండి తీసుకెళ్తా.
సీత: ప్లీజ్ మామ ఎలా అయినా కుదిరించుకో. ప్లీజ్ మామ. నీకు నా మీద ప్రేమ లేదు.
రామ్: ఈ బెదిరింపులే వద్దు. మనం ఎల్లుండి వెళ్దాం. నన్ను విసిగించకుండా అవతలకి వెళ్లు.
మహాలక్ష్మి: రామ్ నేను చెప్పినట్లు ఆఫీస్‌కి వెళ్లాడు. సీత ప్లాన్ వర్కౌట్ అవ్వదు.
సీత, రామ్‌లు కిందకి వస్తారు. సీత డల్‌గా ఉండటం చూసి మహాలక్ష్మి వాళ్లు నవ్వుకుంటారు. కానీ రామ్ కిందకి వచ్చి తాను సీత షాపింగ్‌కి వెళ్తున్నామ్ అని అంటాడు. జనార్థన్, గిరిధర్ వచ్చి ఆఫీస్‌కి వెళ్దామంటే రామ్ రాను అనేస్తాడు. మహాలక్ష్మి రామ్ మీద సీరియస్ అవుతుంది. సీత మొదటి సారి ఓ కోరిక కోరిందని చీర కొనమంది అని అంటాడు. రామ్ మాత్రం ఇప్పుడే వెళ్లి చీర కొనాలి అని అంటాడు. దానికి రామ్ సీత మీ కోసం సారీ కొనాలి అంటుంది పిన్ని అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు.
రామ్: సీతకి ఎప్పటి నుంచో పిన్నికి చీర కొని పెట్టాలని కోరిక ఉందట. ఈ రోజు కోడలు అత్తకి, అత్త కోడలికి గానీ బహుమతులు కొనిస్తే వాళ్లు అన్యోన్యంగా ఉంటారు అంట. మా పెళ్లి అయినప్పటి నుంచి పిన్నికి సీతకి గొడవలు వస్తున్నాయి కదా. అందుకే వాళ్లు సెట్ అవ్వాలి అని సీతని షాపింగ్‌కి తీసుకెళ్లి సారీ కొనిస్తా. ముందు సీత షాపింగ్‌కి వెళ్దామంటే ఎందుకో అని వద్దు అన్నా తర్వాత ఈ కారణం చెప్తే వద్దు అనలేకపోయా.
మహాలక్ష్మి: ఈ రోజు మంచి రోజు అని ఎవరు చెప్పారు. ఇలాంటివి నేను వినలేదు. నేను ప్రతి పండగకి ఇంట్లో అందరికీ కొంటున్నా కదా.
సీత: పండక్కి కొనడం వేరు ఈ రోజు వేరు.
రామ్: సీత అబద్ధం చెప్పినా నిజం చెప్పినా తను చెప్పిన దాంట్లో మీకు మంచి జరుగుతుంది అంటే ఏమైనా చేస్తా. సీత అర్చన, మహాలక్ష్మిలను చూసి వెటకారంగా నవ్వుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ఢీ లేటెస్ట్ ప్రోమో... నా తలకొరివి మీరే పెట్టాలి - కన్నీళ్లు పెట్టించిన చైతన్య మాస్టర్ తల్లి