అన్వేషించండి

Satyabhama Serial Today July 25th: సత్యభామ సీరియల్: తండ్రి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన నందిని.. చెల్లితో బాధ పంచుకున్న హర్ష, సత్యకి మాటచ్చిన క్రిష్!

Satyabhama Serial Today Episode విశ్వనాథానికి బెయిల్ రాలేదని క్రిష్‌ సత్యకు చెప్పగానే సత్య తన మామయ్యతో భర్త చేతులు కలిపి ఇలా చేశాడని నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode తన తండ్రి మాట్లాడుతుంటే ఎందుకు మధ్యలో వచ్చేశావని క్రిష్‌ బయటకు వచ్చిన సత్యని ప్రశ్నిస్తాడు. సత్య తన తండ్రి గురించి టెన్షన్‌గా ఉందని బెయిల్ వచ్చిందా అని అడుగుతుంది. దానికి క్రిష్ రాలేదని చెప్తాడు. సత్య క్రిష్‌ని తిడుతుంది. నిన్ను నమ్మి ఇంట్లో ఉండిపోయానని బెయిల్ ఇప్పిస్తాను అని మాట ఇచ్చి మోసం చేశావని క్రిష్ని తిడుతుంది. 

క్రిష్: సత్య నేను చెప్పేది విను సత్య. 
సత్య: నడి రోడ్డు మీద మర్డర్‌ చేసిన వాడికి కూడా బెయిల్ దొరుకుతుంది. కానీ మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఆయనకు ఎందుకు దొరకదు. నువ్వు మీ బాపుతో చేతులు కలిపావ్. మా  నాన్న బయటకు రావడం నీకు ఇష్టం లేదు అందుకే నన్ను మీ వాళ్లతో కలిసి బయటకు వెళ్లకుండా గుమ్మం దగ్గరే కట్టేశావ్ ఒప్పుకో. అందరూ కలిసి నాకు మా నాన్నని దూరం చేస్తున్నారు నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు. నీకు మీ బాపునకి తేడా లేదా.
క్రిష్‌: ఎమోషనలై నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావ్ సత్య. లోకంలో ఎవరు నిందలు వేసినా భరిస్తాను కానీ నువ్వు నిందలు వేస్తే మాత్రం తట్టుకోలేను. ఈ రోజు ఎలా అయినా మామయ్యకి బెయిల్ వస్తుందని అనుకున్నా. కానీ కేవలం  మామయ్య వల్లే బెయిల్ రద్దు అయింది. హత్య చేశావా అని జడ్జి అడిగితే ఎవరీ వాదనలు పట్టించుకోవద్దు నాకు శిక్ష వేయండని మామయ్యే అడిగిండు. బాధలో ఉన్నావ్ నువ్వు ఏమన్నా పట్టించుకోను మళ్లీ మళ్లీ చెప్తున్నా మామయ్యని విడిపించడమే నా పని. నువ్వు చేయాల్సిందల్లా మాటలు పడకు బాపు ఏం చెప్తే అది చేయ్. పార్టీ ప్రెసిడెంట్ వస్తే బాపుని బద్నాం కాకుండా చూడు ప్లీజ్.

హర్ష, సంధ్య ఇంటికి వస్తే భర్త బెయిల్ మీద వచ్చాడని విశాలాక్షి దిష్టి తీస్తాను బయటే ఆగమను అని హడావుడి చేస్తుంది. హర్ష తల్లిని ఆపి బెయిల్ రాలేదని చెప్తాడు. శాంతమ్మ, విశాలాక్షి షాక్ అయిపోతారు. నాన్న కోపరేట్ చేయడం లేదని తనకి శిక్ష వేయమని జడ్జినే అడిగారు అని అంటాడు. ఇంతలో నందిని వచ్చి బెయిలూ రాదు మీ నాన్న బయటకు రాడు అని అంటుంది. శాంతమ్మ ఆవేశంతో మా మీద కోపం ఉంటే ఇలాంటి టైంలో చూపించకూడదమ్మ అని నందినీతో అంటుంది.

నందిని: మీ మీద కోపం ఉంది నాకు కాదు మా బాపునకి. మామయ్య బయటకు రాకూడదని కోరుతుంది నేను కాదు మా బాపు. నాకు కోపం వస్తే మీదకి అరుస్తా మా బాపుకి కోపం వస్తే అంతు చూస్తాడు.
హర్ష: మీ నాన్నకి ఎందుకు అంత కోపం మేం ఏం చేశాం.
నందిని: మా బాపు ఏమైనా చెప్పాడు అంటే ఆ దేవుడైనా వినాల్సిందే. కాదు కూడదు అని ఎదురు తిరిగితే మాడు పగిలేలా కొడతాడు. కోర్టుకు సత్య రాలేదు కాదా.. రాలేదు కాదు మా బాపు రానివ్వలేదు. ఇది నా అనుమానమే కానీ నా అనుమానం నిజం అవుతుంది.
శాంతమ్మ: హర్ష ఆ ఇంట్లో ఏం జరుగుతుందో సత్యకి కాల్ చేసి అడుగురా.
నందిని: సత్య చెప్పదు అంత ధైర్యంతో మీకు ఎవరూ చెప్పరు. కాళ్లు పట్టుకుంటే మా బాపు లొంగడు. ఎదురు తిరగాలి. నాకు తెలిసిన ఓ లాయర్ ఉన్నాడు రేపు కలు లాభం కలుగుతుంది. నా మీద నమ్మకం పెట్టుకో నష్టం జరగదు.

మహదేవయ్య కుటుంబం కొత్త ఇంటికి చేరుకుంటారు. భైరవి వచ్చి భర్తకు ఫొటోలు తీస్తుంది. ఎమ్మెల్యేలా ఉన్నావని అంటే మహదేవయ్య ఫొటోలు తీసుకోమని అంటాడు. ఇక క్రిష్‌ రెడీ అయి వస్తాడు. కొత్త ఇళ్లు ఎలా ఉందని మహదేవయ్య అడిగితే క్రిష్‌ ఎలుకల బోను నుంచి పులి బోనులోకి వచ్చినట్లుందని అంటాడు. తిడుతున్నావా పొగుడుతున్నావా అని మహదేవయ్య అడిగితే గొప్పగా ఉందని చెప్తున్నా అంటాడు. కొడుకు మాటలకు మహదేవయ్య మీసం మెలేస్తాడు. ఇక సత్య అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది. అదృష్టం తనని ముందుకు తోస్తున్నప్పుడు చిన్నకోడలు వెనక్కి లాగుతుందని అంటాడు. సత్య అక్కడి నుంచి వెళ్లిపోతుంటే క్రిష్‌నానమ్మ గంట ఊపుతూ ఉంటుంది. ఇక సత్య నవ్వడం లేదని భైరవి మాటలు అంటుంది. ఇక మహదేవయ్య ఇంట్లో ఏడుపు ముఖం పెట్టుకోవద్దని అంటాడు. ఇక తన తల్లి గంట కొట్టడంతో మహదేవయ్య ఇంతకు ముందు మంచితనంతో సత్యకు స్వేచ్ఛ ఇస్తే తను అందరి ముందు అవమానించింది ఈసారి అలా జరకూడదని అంటాడు. ఇక ఇంటికి వారసుడిని ఇవ్వమని అంటాడు. ఇంతలో పంతులు వస్తారు.

సత్య, క్రిష్‌లు పూజ చేస్తారు. సత్య అందరికీ హారతి ఇచ్చి అత్తమామల ఆశీర్వాదం తీసుకుంటుంది. పార్టీ ప్రెసిడెంట్ లంచ్‌కి వస్తున్నాడు అని దగ్గరుండి ఏర్పాట్లు చూడమని అంటాడు. సత్య సరే అంటుంది. ఇక హర్ష సత్యకి కాల్ చేసి నందిని మరో లాయర్‌ని కలవమని చెప్పిందని తన తండ్రికి బెయిల్ రాకుండా చేసింది తన తండ్రి అనే చెప్పిందని అంటాడు. ఇక సత్య అలా ఏం ఉండదని అంటుంది. అంతా క్రిష్‌ చూసుకుంటాడని అంటుంది. ఇక హర్ష సత్యని ఎక్కువ ఆలోచించొద్దని తాను చూసుకుంటానని చెప్తాడు. మరోవైపు మహదేవయ్య క్రిష్‌తో నువ్వు కంట్రల్ తప్పుతున్నావని అనిపిస్తుందని అంటాడు. మీ మామ కోసం కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావని అడుగుతాడు మహదేవయ్య దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. తనకు జ్యోత్స్నకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందన్నాడేంటి? కుప్పకూలిపోయిన పారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Embed widget