అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 25th: కార్తీకదీపం 2 సీరియల్: ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. తనకు జ్యోత్స్నకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందన్నాడేంటి? కుప్పకూలిపోయిన పారు!

Karthika Deepam 2 Serial Episode తండ్రి చేసిన పనికి జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానని కార్తీక్ ఇంట్లో అందరితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode ఇంట్లో అందరికీ ఓ విషయం చెప్పాలని కార్తీక్ తన తల్లిదండ్రుల్ని తీసుకొని సన్నాయి మేళాలతో జ్యోత్స్న ఇంటికి వస్తాడు. తను తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానని అది చెప్పేటప్పుడు దీప కూడా ఉండాలని అంటాడు. కార్తీక్ ఏం చెప్తాడా అని దీప, జ్యోత్స్న, పారిజాతంలు తెగ టెన్షన్ పడతారు. ఇక కార్తీక్ దీప గురించి చెప్తే ఇక్కడేం జరుగుతుందో తనకే తెలీదని అనుకుంటూ జ్యోత్స్న చాకు తీసుకొని నిల్చుంటుంది. అది పారు చూస్తుంది. 

పారిజాతం: కత్తి ఎందుకు తీశావే.. 
జ్యోత్స్న: ఏం మాట్లాడకు
పారిజాతం: కార్తీక్ దీప పేరు చెప్పగానే ఇది దీపని పొడిచేసేలా ఉంది ఇప్పుడేం చేయాలి. ఏదో తేడా జరిగేలా ఉందే.
దీప: మనసులో.. ఇప్పుడు కార్తీక్ బాబు జ్యోత్స్ని పెళ్లి చేసుకోను అని చెప్తారు. కారణం అడిగితే జీవితాంతం శౌర్యకి ఫ్రెండ్‌గా ఉంటాను అంటారు. దాన్ని వీళ్లు ఎలా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి.
కార్తీక్: నా జీవితానికి సంబంధించినది అని ఎందుకు అంటున్నాను అంటే నేను ఇప్పుడు జరిగిపోయిన పెళ్లి గురించి మాట్లాడుతున్నా. జరిగిపోయిన పెళ్లి ఎవరిది అని అడగకండి అది నాదే. 
పారిజాతం: అయిపోయింది అంతా సర్వనాశనం అయిపోయింది.
జ్యోత్స్న: నో డౌట్ గ్రానీ చెప్పింది నిజమే శౌర్య బావ కూతురే. వీళ్లిద్దరికీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది. అది ఇప్పుడు చెప్పబోతున్నాడు.
శివనారాయణ: ఏదో మమల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నావ్ అని అర్థమైంది అదేదో తొందరగా చెప్పు మనవడా.
కార్తీక్: దీపని చూస్తూ.. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటారు. ఇక్కడ ఆ పెళ్లి అయిన జంటకు మళ్లీ పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి అయిన జంట ఎవరూ అని చూస్తున్నారా నేను జ్యోత్స్న..
 
కార్తీక్ మాటకు జ్యోత్స్న ఎమోషనల్ అయిపోతుంది. పారు మాత్రం గుండె పట్టుకొని కుప్పకూలిపోతుంది. కార్తీక్ వెళ్లి పారిజాతాన్ని లేపుతాడు. నేను విన్నది నిజమేనా అని అడుగుతుంది. అక్షరాలా నిజం అని కార్తీక్ అంటాడు. ఇక దీప కూడా హమ్మయ్యా అనుకుంటుంది. పారిజాతం మనవడిని చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఇక బాజాతో వచ్చావేంటి అని అడిగితే ముహూర్తం పెట్టిన తర్వాత మొదటి సారి ఫ్యామిలీ మొత్తం వచ్చామని అందుకే మంత్ర వాయిద్యాలతో వచ్చానని అంటాడు. ఇక రేపే నిశ్చితార్థానికి షాపింగ్‌కు వెళ్తామని అంటే కార్తీక్ వద్దని షాపింగ్‌కి బట్టలు ఇంటికే వస్తాయని అంటాడు. కార్తీక్ తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నువ్వు హ్యాపీనా అని అడుగుతాడు. దాంతో కాంచన నాకు ఉన్న ఒకే ఒక కల ఇది అని చాలా హ్యాపీ అని అంటుంది. ఇక దీప వెళ్లిపోతే కార్తీక్ కూడా వెనకాలే వెళ్తాడు. జ్యోత్స్న కాంచన దగ్గరకు వెళ్లి కాంచన ఆశీర్వాదం తీసుకుంటుంది. కాంచన తన వెంట తెచ్చిన చీర జ్యోత్స్నకి ఇస్తుంది. అందరూ జ్యోత్స్నకి కార్తీక్ పేరు చెప్పి సెటైర్లు వేస్తారు.

శోభ అనసూయ చేతిలోని తమలాపాకు తీసుకొని నములుతుంది. ఇక శోభ అనసూయ మధ్య మాటల వార్ జరుగుతుంది. పాపని తీసుకురావడం లేదని ఇన్‌డైరెక్ట్‌గా శోభ సెటైర్లు వేస్తుంది. రేపు పాపని తీసుకొద్దామని అనసూయ అంటుంది. 

దీప: కార్తీక్ బాబు అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్ బాబు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు దాని వల్ల ఏ గొడవలు అవుతాయా అని అనుకున్నాను మీరు ముఖ్యంగా అందరి గురించి ఆలోచించారు. భర్త న్యాయం చేయకపోయినా కొడుకుగా మీరు న్యాయం చేశారు. 
కార్తీక్: జీవితం అంటే మన కోసం కాదు మన వాళ్ల కోసం బతకాలి అని మిమల్ని చూసి తెలుసుకున్నాను దీప.  నా తండ్రి నా తల్లిని మోసం చేసిన తర్వాత అతన్ని కొట్టాలి అనిపించింది. నర్శింహ స్థానంలో మా నాన్న ఉంటే శౌర్య స్థానంలో నేను ఉన్నాను దీప. నా తండ్రి చాలా మంచోడు అనుకున్నాను కానీ ఆయన కూడా నేను అసహ్యించుకునే నర్శింహ లాంటివాడే. ఎందుకో మా అమ్మలో నాకు జ్యోత్స్న కనిపించింది. అమ్మ ప్రేమ నిజం కానీ మా నాన్న ప్రేమ అబద్థం.. జ్యోత్స్న ప్రేమ నిజం జ్యోత్స్న మీద నాకు ప్రేమ ఉంది అనేది అబద్ధం మా అమ్మకి నిజం తెలిస్తే ఎంత బాధ పడుతుందో జ్యోత్స్నకి కూడా నిజం తెలిస్తే అంతే బాధ పడుతుంది కదా. చేయని తప్పునకు జ్యోత్స్నని ఎందుకు బాధ పెట్టాలి అని ఇలా చేశాను. ఇప్పుడు నా కారణంగా మీకు ఎలాంటి నిందలు రావు. ఇప్పుడు మనం మనలాగే ఉండొచ్చు.
దీప: ఇప్పుడు నాకు మీ మీద కూడా గౌరవం పెరిగింది బాబు. 
కార్తీక్: ముందు ఈ పెళ్లి జరగాలి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా. స్వప్న నా చెల్లి తనకు ఏ అన్యాయం జరగకుండా చూస్తాను. మా అమ్మకి ఈ నిజం తెలీకుండా చూడాలి. 

దీప రాత్రి శౌర్యకి అన్నం తినిపిస్తుంటుంది. ఇక్కడే మనం ఉందామని రోజూ కార్తీక్‌ని చూడొచ్చని అంటే దీప కార్తీక్‌కి పెళ్లి అవుతుందని అంటుంది. ఇక శౌర్య నాన్న గురించి అడిగాను కానీ ఇప్పుడు నాకు నువ్వు కార్తీక్ ఉంటే చాలు అనిపిస్తుందని చెప్తుంది. దీప ఏడుస్తూ మనసులో మీ నాన్న కార్తీక్‌ బాబులా ఉండడని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. నర్శింహ రెండో పెళ్లి చేసుకోకపోయి ఉంటే నువ్వు ఈ ఊరిలో సంతోషంగా ఉండేదానివని అనుకుంటాడు. తన తండ్రి చేసిన తప్పు కారణంగా తన జీవితం మారిపోయిందని కార్తీక్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: గంటలమ్మ గుండె ఆగినంత పని చేసిన గాయత్రీ పాప.. సుమనను శపించిన పెద్దబొట్టమ్మ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget