Trinayani Serial Today July 25th: 'త్రినయని' సీరియల్: గంటలమ్మ గుండె ఆగినంత పని చేసిన గాయత్రీ పాప.. సుమనను శపించిన పెద్దబొట్టమ్మ!
Trinayani Serial Today Episode ఉలూచి పాదాలు నయం అవ్వాలని పాలు తీసుకొచ్చిన పెద్దబొట్టమ్మ ముఖం మీద సుమన ఆ పాలు విసిరేయడంతో పెద్దబొట్టమ్మ సుమనను శపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today July 25th: 'త్రినయని' సీరియల్: గంటలమ్మ గుండె ఆగినంత పని చేసిన గాయత్రీ పాప.. సుమనను శపించిన పెద్దబొట్టమ్మ! trinayani serial today july 25th episode written update in telugu Trinayani Serial Today July 25th: 'త్రినయని' సీరియల్: గంటలమ్మ గుండె ఆగినంత పని చేసిన గాయత్రీ పాప.. సుమనను శపించిన పెద్దబొట్టమ్మ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/c2ed985bcdb6ebadc8ba90068f1461051721868976708882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Today Episode నయని కత్తిని గాయత్రీ దేవి ఫొటో ముందు ఉంచి పూజ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. గాయత్రీ పాప దీపం పెట్టడానికి ప్రమిద తీసుకొని వస్తుంది. ఇక తిలోత్తమ గంటలమ్మ చేతిలోని మంత్ర దండాన్ని పాప పట్టుకునేలా చేయమని అంటుంది. ఇక దీపారాధన చేయమని అంటే తన బిడ్డలకు గండాలు వస్తున్నాయి కాబట్టి తన అక్కే దీపారాధన చేయాలని సుమన అంటుంది.
నయని: అతిథి దేవో భవ అంటారు కదా. ఈ రోజు ఈ సోనాలితో దీపం వెలిగిద్దాం.
గంటలమ్మ: బిజినెస్ చేయడానికి వస్తే మీ మర్యాదలు నాకు పుల్ల పెడుతున్నాయి. ఇక గంటలమ్మ తన మంత్రదండం కర్రని పాప చేతికి ఇస్తుంది.
తిలోత్తమ: శభాష్ గంటలమ్మ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావ్. గాయత్రీ పాపని దారి మళ్లించబోతున్నావన్నమాట.
గంటలమ్మ: నా కొడుకు రక్తపుంజిని చంపిన గాయత్రీ దేవి ఆత్మని వదిలి పెట్టను. దాన్ని ఇదే ఖడ్గంతో వేరు చేయకపోతే నా పేరు గంటలమ్మే కాదు.
గాయత్రీ పాప చేతిలో ఉన్న మంత్ర దండాన్ని కత్తి మీదకు విసిరేస్తుంది. ఆ కర్ర ముక్కలైపోతే గంటలమ్మ గుండె పట్టుకొని ఏడుస్తుంది. అందరూ ఏమైందని అనుకుంటే కర్ర విరిగినందుకు ఇలా అయిందని అంటుంది. ఇక తాను ఇంటికి వెళ్లిపోతే మందులు వేసుకుంటానని అంటే తిలోత్తమ గంటలమ్మని ఇంటికి పంపేస్తా అని తీసుకొని వెళ్తుంది. ఇక రాత్రి విక్రాంత్ పడుకోడానికి బయటకు వెళ్తుంటే సుమన మాట్లాడాలి అని ఉండమని అంటుంది. బెంగాలీ సోనాలి వ్యాపారం చేస్తానని తిలోత్తమకు చెప్పినా గాయత్రీ పాప చేసిన పనికి వ్యాపార లావాదేవీలు రద్దు చేసుకున్నదని చెప్తుంది. దాంతో విక్రాంత్ సుమనకు క్లాస్ ఇస్తాడు.
ఉదయం పెద్దబొట్టమ్మ ఇంటికి వచ్చి చేతిలో పాల గిన్నె పట్టుకొని సుమనను పిలుస్తుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. ఉలూచి పాదాలు మామూలు అవ్వాలని వేణుగోపాల స్వామి విగ్రహానికి అభిషేకం చేసిన పాలు అని వాటిని ఉలూచి తాగినా లేక ఒళ్లంతా పూసుకున్నా పాదాలు మామూలు స్థితికి వస్తాయని పెద్దబొట్టమ్మ అంటుంది. గతంలో పెద్దబొట్టమ్మ మాట నమ్మి మోసపోయిన వారు ఈ సారి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు.
విక్రాంత్: ఏంటి అలా చూస్తున్నావ్ నువ్వే చెప్పాలి.
తిలోత్తమ: సుమన మౌనంగా ఉంది అంటే అంగీకారం అనుకోకండి తనకి ఇది నచ్చలేదని అర్థం.
వల్లభ: ఇంతకు ముందు పసుపు తీసుకొచ్చి అంతా తూచ్ అని ఇప్పుడు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు.
పెద్దబొట్టమ్మ: అయ్యా అప్పుడు అజ్ఞానంతో అలా చేశాను. కానీ మా పంతాలతో పసి బిడ్డని బాధ పెట్టకూడదని ఇలా వచ్చాను.
హాసిని: అర్థమైందా అత్తయ్య మీరు తప్ప అందరూ మారిపోతారు.
విశాల్: పాలు తాగమంటే ఒప్పుకోకపోవచ్చు కానీ ఒంటికి పూస్తే ఏం పర్లేదు. ఏమంటావ్ రా.
విక్రాంత్: నాకు ప్రాబ్లమ్ లేదు బ్రో కానీ సుమన ఒప్పుకోవాలి. సుమన అడ్డు చెప్తే ఏం చేయలేం.
సుమన: అడ్డు చెప్పను. తేడా వస్తే వదలని పెద్దబొట్టమ్మకి తెలుసుకదా.
తిలోత్తమ: సుమన నువ్వు ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. అయినా సుమన ఒప్పుకున్న తర్వాత నేను వద్దు అంటే నాకు అమర్యాదగా ఉంటుంది.
సుమన పాలు తీసుకుంటుంది. ఒళ్లంతా పూయడానికి కాటన్ తీసుకురావాలా అని నయని అడిగేతే టవల్ తీసుకురమ్మని సుమన అంటుంది. ఇక సుమన పాల గిన్నెని పెద్దబొట్టమ్మ మీద విసిరేస్తుంది. దాంతో అందరూ సుమనని తిడతారు. ఇక పెద్దబొట్టమ్మ పాలు వేస్ట్ చేసిన సుమనకు ఉలూచి పాదాలు ఏ రకంగా మాడిపోయావో అలాగే సుమన పాదాలు కూడా మాడిపోతాయని శాపం పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)