అన్వేషించండి

Satyabhama Serial Today August 27th: విడాకులపై పునరాలోచనలో పడ్డ సత్య- వచ్చే వారమే విచారణ అంటూ షాక్ ఇచ్చిన కృష్ణ

Satyabhama Today Episode సత్య ప్రెగ్నెంట్ కాదని, అసలు కాపురమే చేయలేదని తెలిసిపోతుంది. విడాకులు ఇచ్చేయాలని పట్టుబడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode: మహదేవయ్య పెద్దమ్మ ఇంటికి రావడంతో మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. అప్పటి వరకు సత్య ప్రెగ్నెంట్‌ అని అంతా అనుకొని సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. 

ఇంతలో పెద్దమ్మ బాంబు పేలుస్తుంది. అసలు సత్య కడుపు పండలేదని చెబుతుంది. అంతా షాక్ అవుతారు. ఇన్నేళ్లు అనేక మందిని చూసిన తనకు తల్లికాబోయే స్త్రీ ఎలా ఉంటుందో తనకు తెలుసు అంటుందామె. తల్లి అవుతున్న ఆనందం సత్యలో లేదని కనీసం శారీక మార్పులు కూడా లేవని, మొహంలో ఆ కళ కనిపించడం లేదని చెబుతుంది. 

ఇంతలో పెద్దమ్మ మాటలకు మహదేవయ్య  అడ్డుపుడుతూ డాక్టర్ రిపోర్టు సంగతి అడుగుతాడు. వాటి గురించి తనకు తెలియదని... వాటినే నమ్మాలని భావిస్తే తాను వెళ్లిపోతానంటూ బెదిరిస్తుంది. అలా వద్దని వారిస్తాడు. ఇంతలో మరో బాంబు పేలుస్తుంది. అసలు నీ చిన్న కొడుకు, కోడలు కలిసి కాపురం చేయడం లేదని కూడా చెబుతుంది. 

పెద్దమ్మ చెబుతున్న మాటలు వింటున్న ప్రతి ఒక్కరు షాక్‌ అవుతుంటారు. సత్య పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోతారు. ఫ్యామిలీలో అందర్నీ సత్య మోసం చేసిందని పెద్దమ్మ తిడుతుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అని మహదేవయ్యను ప్రశ్నిస్తుంది. వారసులు వస్తున్నారని మీసాలు తిప్పుకోవడం కోదని ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త తెలుసుకోమని చెబుతుంది. 

అక్కడ పూజ కోసం ఏర్పాటు చేసిన చేసిన హోమగుండం సాక్షిగా సత్యను పెద్దమ్మ నిలదీస్తుంది. నిజంగా నీకు గర్భం ఉంటే తన కళ్లల్లో చూస్తు హోమగుండం సాక్షిగా చెప్పాలని ఆదేశిస్తుంది. లేదని సత్య సమాధానం చెబుతుంది. ఇద్దరూ కలిసి కాపురం చేశారా అని ప్రశ్నిస్తుంది. దానికి కూడా లేదనే సత్య నుంచి సమాధానం చెబుతుంది. అంతే అమ్మవారికి అవమానం జరిగిన ఇంట్లో తాను ఉండలేనని అక్కడి నుంచి పెద్దమ్మ వెళ్లిపోతుంది. 

ఆవేశంతో వచ్చిన మహదేవయ్య కృష్ణ చెంప చెల్లుమనిపిస్తాడు. సత్యవైపు తిరిగి ఆడదానివి అయిపోయావ్ లేదంటే అంటూ కోపంగా కళ్లు ఏర్రజేస్తారు. కృష్ణ కలుగుజేసుకొని తండ్రి మహదేవయ్యకు ఎదురెళ్తాడు. ఏదైనా అనాలనుకుంటే తనను అనాలని... తప్పంతా తనదేనంటూ చెప్తాడు. సత్యకు వారిస్తున్నా వినకుండా మాట్లాడతాడు. 

Also Read: గౌరి, శంకర్ ల మధ్య ఎడబాటు – అభయ్ ని తొక్కేయాలని రాకేష్ ప్లాన్

సత్యకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా అమెను హింసించానని చెప్పుకొస్తాడు. అయితే ఆమె మనసులో తనకు స్థానం లేదని తెలుసుకొని అంతకు మించి ముందుకు వెళ్లలేకపోయానని చెప్తాడు. ఆమె నిన్ను దగ్గర రానివ్వకపోతే ఇంకా ఎందుకు కలిసి ఉండటం... ఆమెను తన పుట్టింట్లో దించేసి రమ్మని తల్లి సలహా ఇస్తుంది. 

ఇంతలో సత్య పేరెంట్స్ కలుగుచేసుకొని... సమస్యలు ఉంటే పరిష్కరించి దంపతులను కలపాలే తప్ప ఇలా విడిపోమని సలహా ఇవ్వడం బాగాలేదని అంటారు. అయితే మీ అమ్మాయి చేస్తున్నది ఏమైనా బాగుందా అని ప్రశ్నిస్తారు. ఇలా రెండు కుటుంబాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. సత్య చేసింది తప్పే అయిన సర్దిచెప్పాలని పేరెంట్స్ రిక్వస్ట్ చేస్తారు. పెద్దావిడ ఇంట్లో ఉందన్న నమ్మకంతో తామంతా బాధను దిగమించి ఉంటున్నామని అంటారు. తన తల్లిని ఎప్పుడూ గౌరవిస్తానని కానీ ఎదురించే పరిస్థితి వస్తే మాత్రం సత్య, కృష్ణ కారణమవుతారని అంటూ మహదేవయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

Also Read: దివ్యాంకకు వార్నింగ్ ఇచ్చిన సురేష్ – కౌషికిని శాశ్వతంగా జైలుకు పంపేందుకు దివ్యాంక ప్లాన్

కన్నవాళ్లతో మాట్లాడిన సత్య మీరు ఎక్కడ బాధపడతారో అని ఇన్నిరోజులు ఈ విషయాలు అన్నీ దాచిపెట్టానని చెబుతుంది. అన్నీ తెలుసన్న పేరెంట్స్‌. అన్నింటినీ సర్దుకునేలా చేస్తావనే నమ్మకం తమకు ఉందని అంటారు. అసలు ఆ ఇంటికి కోడలిగా రావడమే పెద్ద తపన్న వాళ్లు ఇప్పుడు సమస్యలను వదిలేసి పారిపోయి మరో తప్పు చేయొద్దని చెబుతారు.

కన్నవారు చెప్పడంతో ఆలోచనలో పడుతుంది సత్య. విడాకులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన కృష్ణ గుడ్ న్యూస్ అంటూ షాకింగ్ న్యూస్ చెబుతాడు. విడాకులకు సంబంధించి ఆఖరి హియరింగ్‌ డైట్‌ చెబుతాడు. ఆ మాట విన్న సత్య షాక్ అవుతుంది. 

Also Read: సీక్రెట్ ఆపరేషన్ కు ప్లాన్ చేసిన జేడీ, అమర్ – ముందు చంపేది అమర్ పిల్లల్నే అంటూ తీవ్రవాది వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP DesamTimelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP DesamIndias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Sreemukhi: నేనూ హిందువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
నేనూ హిందువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
Racharikam Trailer: చూస్తా ఉండూ... సీఎం, పీఎం అవ్వాలంటే జైలుకి వెళ్లడం ఒక క్వాలిఫికేషన్ అవుతాది - ‘రాచరికం’ ట్రైలర్ బీభత్సమే!
చూస్తా ఉండూ... సీఎం, పీఎం అవ్వాలంటే జైలుకి వెళ్లడం ఒక క్వాలిఫికేషన్ అవుతాది - ‘రాచరికం’ ట్రైలర్ బీభత్సమే!
Embed widget