అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీక్రెట్ ఆపరేషన్ కు ప్లాన్ చేసిన జేడీ, అమర్ – ముందు చంపేది అమర్ పిల్లల్నే అంటూ తీవ్రవాది వార్నింగ్

Nindu Noorella Saavasam Today Episode: ఉగ్రవాదులను పట్టుకోవడానికి అమర్, జేడీ సీక్రెట్ ఆపరేషన్ కు ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఉగ్రవాదులు పిల్లలను కిడ్నాప్‌ చేసి ఒక రూంలో బంధిస్తారు. ఇంతలో అమర్‌ స్కూల్‌ లాండ్‌ ఫోన్‌ కు కాల్‌ చేస్తాడు. ఉగ్రవాదులను మీకేం కావాలని అడుగుతాడు. రాఖీ కావాలని.. మేము సేఫ్‌గా బార్డర్‌ దాటాలని డిమాండ్‌ చేస్తాడు. ఇంతలో జేడీ ఫోన్‌ తీసుకుని మాట్లాడగానే ఉగ్రవాది జేడీని కూడా బెదిరిస్తాడు. మీరు నాతో తోక జాడిస్తే నేను మిమ్మల్ని చంపను.. ఇక్కడున్న పిల్లల ప్రాణాలు తీసేస్తా అంటాడు. దీంతో అమర్‌ అక్కడ ఒక్క స్టూడెంట్‌కు ఏం జరిగినా నీ ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తాడు. మరోవైపు బంటి ఫంక్షన్‌ దగ్గరకు వచ్చి స్టోర్‌ రూంలో స్నాక్స్‌ ఉంటాయి కదా వెళ్లి నేను ఒక్కడినే తినేస్తానని వెళ్లి ఉగ్రవాదులకు దొరికిపోతాడు.

బంటి: అంకుల్‌ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు.

అంజు: ఒరేయ్‌ నిన్ను తిట్టడానికి కూడా మనసు రావటం లేదురా? పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు.

బంటి: అంటే ప్రిన్సిపాల్‌ గారు స్టోర్‌ రూంలో స్నాక్స్‌ పెడతా అన్నారు. వాటికోసం వెళ్తుంటే వీళ్లకు దొరికిపోయాను.

అమ్ము: అరేయ్‌ బయట ఎవ్వరూ లేకపోవడం చైర్స్‌ పడిపోవడం. దూరంగా పోలీసులు ఉండటం. ఇవన్నీ చూసినా నీకు డౌట్‌ రాలేదా?

 అనగానే వచ్చిందని కానీ స్నాక్స్‌ కోసం ఇలా దొరికిపోయాను. అనగానే అంజు ఉగ్రవాదులకు చెప్పి బంటి గాణ్ని కొట్టిస్తుంది. బయట అందరూ కంగారు పడుతుంటారు. ఏం చేద్దామని అమర్‌ను జేడీ అడుగుతుంది. అయితే రాఖీని వదిలే ప్రసక్తే లేదు అంటాడు అమర్‌. పై ఆఫీసర్‌కు ఫోన్‌ చేసి అక్కడి సిచ్యువేషన్‌ చెప్తాడు అమర్‌. రాఖీని మనం అప్పగిస్తున్నామని.. అతన్ని అక్కడికి తీసుకుని రావడానికి 8 గంటలు అవుతుందని చెప్పండి పై అధికారి చెప్తాడు. అయితే మేము ఫైట్‌ చేస్తామని పై అధికారిని అడిగితే ఆయన పర్మిషన్‌ ఇస్తాడు. మరోవైపు మిస్సమ్మ ఏడుస్తుంది.

మనోహరి: ఇప్పుడు కానీ ఇది పిల్లల్ని కాపాడటానికి ఏమైనా చేస్తే అమర్‌ దృష్టిలో ఇది మంచిదై పోతుంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంటికి తీసుకెళ్లాలి. బాధపడకు మిస్సమ్మ. అమర్‌ ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాడు. మనం ఇంటికి వెళ్దాం రా..

మిస్సమ్మ: నీ ముసలి కన్నీళ్లు, నాటకాలు వేరే వారి దగ్గర చూపించు నా దగ్గర కాదు. నా పిల్లలు నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కణ్నుంచి కదలను. నీకు అంతగా వెల్లాలని ఉంటే నువ్వు వెళ్లు.

 అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రాథోడ్‌ను పిలిచి తనను ఒక్కసారి ఆయన దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. రాథోడ్‌, అమర్‌ దగ్గరకు వెళ్లి చెప్పగానే వద్దని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏడుస్తుంది. జేడీ మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంది.

జేడీ: హలో భాగమతి.. ఐ యామ్‌ జేడీ. ఒక ఆడపిల్లగా మీ బాధని. పిల్లల గురించి మా భయాన్ని అర్థం చేసుకోగలను. అలాగే ఒక ఆఫీసర్‌ లా ఆయన బాధ్యతను కూడా అర్థం చేసుకోగలను.  ఇప్పుడు మీరొచ్చి ఆయనతో మాట్లాడటం వల్ల ఆయన ఎమోషనల్‌ అవుతారు.

మిస్సమ్మ: థాంక్యూ.. అయినా నేను ఆయన్ని కలవాలన్నది. పిల్లల కోసమే కాదు. లోపల ఉన్నది పిల్లలు మాత్రమే కాదు. ఆయన ప్రాణం. పిల్లలకు చిన్న గీత పడకుండా తీసుకొస్తారని తెలుసు.

 అని మిస్సమ్మ చెప్తుంటే.. అమర్‌ వింటాడు. ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. మరోవైపు తీవ్రవాదులు పిల్లలను వచ్చి అమర్‌ పిల్లలు ఎవరని అడిగితే అంజు లేచి నేనే అని ధైర్యంగా చెప్తుంది. మీరు నన్నేం చేయలేరని.. మా మీద చిన్న గీత కూడా పడకుండా మమ్మల్ని తీసుకెళ్తారని చెప్తుంది. ఇంతలో అమర్‌ ఫోన్‌ చేసి మీ కండీసన్స్‌  కు ప్రభుత్వం ఒప్పుకుందని ఇంకో మూడు గంటల్లో ఇక్కడికి వస్తాడని అమర్‌ చెప్తాడు.

      మీరు చెప్పినట్టు చేయకపోతే ముందు చంపేది అమర్‌ పిల్లల్నే అని తీవ్రవాది వార్నింగ్‌ ఇస్తాడు. అయితే సీక్రెట్‌ ఆపరేషన్‌ చేయడానికి అమర్‌, జేడీ ప్లాన్‌ చేస్తుంటారు.  మరోవైపు ఆరు ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఆరు పక్కనే మిస్సమ్మ వచ్చి మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అని అడగ్గానే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మళ్లీ ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది - పెళ్లి గురించి నరేష్ మాటలు వింటే మతిపోవాల్సిందే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget