అన్వేషించండి

satyabhama serial today august 20th episode: సత్యభామ సీరియల్: తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైత్రిని ఇంటికి తీసుకొచ్చిన హర్ష.. నందిని రియాక్షన్ ఏంటో!

satyabhama today episode మైత్రి తల్లిదండ్రులు చనిపోయారన్న విషయం తెలుసుకున్న హర్ష ఫ్యామిలీ మొత్తం మైత్రి దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

satyabhama serial today episode జ్వరం వచ్చిన తన పక్కనే రాత్రంతా ఎందుకు దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నావని సత్య క్రిష్‌ని ప్రశ్నిస్తుంది. నీకు సాయం చేయడం వెనుక చెప్పుకొనే పెద్ద కారణాలు లేవని క్రిష్ అంటాడు. రొటీన్‌గా చేశానని అంటాడు. రెండు నెలలు కలిసి ఉండే నువ్వే నా కోసం అన్ని చేస్తే నిన్ను ప్రేమించిన నేను ఇంకెన్ని చేయాలని క్రిష్ అంటాడు. 

సత్య: మనం కలిసి ఉండేది రెండు రోజులు, రెండు నెలలు, రెండు సంవత్సరాలు అని లెక్కలేసుకొని బతకడం ఎందుకు. మనసుని కష్టపెట్టుకొని బతకడం ఎందుకు.  నీ ప్రవర్తన చాలా అసహజంగా కనిపిస్తుంది. నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. అందరూ మైత్రి దగ్గరకు వెళ్లి
క్రిష్: అలా ఏం లేదు. 
సత్య: సరే నీ కారణం ఏదైనా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను కోరుకునేది ఒక్కటే నీ బాధకి కారణం నేను కాకూడదు. కోర్టు గొడవ తర్వాతా నువ్వు ముందు క్రిష్‌లా లేవు మనసులో ఏదో పెట్టుకొని పైకి ఒకలా మాట్లాడుతున్నావ్ నా మీద నమ్మకం ఉంది అంటూనే నమ్మకం లేనట్లు ప్రవర్తిస్తున్నావ్. దగ్గరగా ఉంటూనే దూరంగా ఉంటున్నావ్. నేను తప్పులు చేశాను వాటిని నేను తవ్వుకోవాలి అనుకోవడం లేదు. నిన్ను ఇలా చూడాలి అని నేను అనుకోవడం లేదు. నిన్ను ఇలా చూస్తుంటే గిల్టీగా ఉంది నీ కోసం కాకపోయినా నా కోసం నువ్వు మారుతావా. ఎప్పటిలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడటం నీ కళ్లలో బాధ పడనివ్వకూడదు.
క్రిష్: మనసులో అర్థమైంది నీకు నిజమైన స్నేహం వద్దు నటించాలి అంతే కదా. నాకు ఏం కావాలో నువ్వు ఇవ్వనప్పుడు నీకు ఏం కావాలో ఇస్తా నీతో నటిస్తా.

క్రిష్, సత్య ఇద్దరూ చేతులు కలుపుకుంటారు. సత్య హ్యాపీగా ఫీలవుతుంది. నందిని, అత్తతో కలిసి వంట గదిలో సాయం చేస్తుంది. నీ భర్త పనులు చూసుకో అని విశాలాక్షి అంటే నీ కొడుకుకి నా పనులు నచ్చవత్తమ్మ అని నందిని చెప్తుంది. తాను అలా అనలేదని హర్ష అంటాడు. 

నందిని: నువ్వేమైనా నా శత్రువువా మొన్న నీకు తల రుద్దుతా అంటే వద్దని బాత్‌రూమ్‌లోకి దూరావ్. నిన్న షర్ట్‌ గుండీలు పెడతా అంటే వద్దన్నావ్. రాత్రి ఏమైందో చెప్పనా.
హర్ష: సిగ్గు పడుతూ తల పట్టుకొని ఓయ్ ఆపు. అందరూ నవ్వుకుంటారు.
నందిని: నువ్వు చెప్పు మామయ్య ఇలాంటి వన్నీ అత్తమ్మ నీకు చేస్తుందా లేదా. విశ్వనాథం, విశాలాక్షి ఒకర్ని ఒకరు చూసుకొని సిగ్గుపడతారు.

మరోవైపు మైత్రి ఫ్రెండ్ స్వప్న హర్షకి కాల్ చేసి మైత్రి తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోయారని చెప్తారు. హర్ష కంగారు చూసి ఇంట్లో వాళ్లు చూసి ఏమైందని అడిగితే హర్ష పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లిన వాళ్లకి యాక్సిడెంట్ అయి చనిపోయారని అంటాడు. నందిని దానికి ఫీలై నేను నిన్ను వెళ్లొద్దని చెప్పినందుకే ఇలా అయిందని అంటున్నావా అని నందిని ఫీలవుతుంది. హర్ష మైత్రి దగ్గరకు వెళ్తుంటే నందినిని కూడా వెళ్లమంటారు. నందిని వెళ్లనంటే హర్ష ఒప్పిస్తాడు. అందరూ వెళ్తారు.  మైత్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. మైత్రికి హర్ష దగ్గరుండి సేవలు చేస్తుంటే నందిని ఫీలవుతుంది. నేను ఎవరి కోసం బతకాలి చనిపోతానని మైత్రి ఏడుస్తుంటే ఓదార్చుతారు. పెళ్లి వాళ్లు కూడా దురుదృష్టవంతురాలని వదిలేశారని ఏడుస్తుంది. అందరూ మైత్రిని ఓదార్చుతారు. ఇక నువ్వు మా కోడలు అవ్వాల్సిన దానివి నువ్వు మాకు పరాయి దానివి కాదు అని మా కూతురివే అని ఓదార్చుతారు. 

మరోవైపు క్రిష్ బాబీ దగ్గర సత్య జయమ్మ దగ్గర తన బాధని చెప్పుకుంటారు. క్రిష్ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్పమని జయమ్మ సత్యని అడుగుతుంది. దానికి సత్య క్రిష్‌లో తనకి తెలియని మంచి తనం ఉందని తానంటే ఇష్టం ఉందని చెప్తుంది. మరోవైపు క్రిష్ సత్య తనతో జీవితాంతం కలిసి ఉంటానని చెప్పడం లేదని ఫీలవుతాడు. అటు బాబీ ఇటు జయమ్మ క్రిష్‌ సత్యలను ఒదార్చే ప్రయత్నం చేస్తారు. ఇక క్రిష్ సత్య దూరం అవుతుందని తెలిసి కూడా సంతోషం నటిస్తానని అంటుంది. నువ్వు కూడా క్రిష్‌కి దగ్గరవ్వడానికి ప్రయత్నించాలని చెప్తుంది జయమ్మ సత్య సరే అంటుంది. ఇక సత్య గదిలో బెలూన్స్ సర్దుతుంటే క్రిష్ కేక్ పట్టుకొని వస్తాడు. ఇక మన స్నేహం మళ్లీ పుట్టిందని సెలబ్రేట్ చేయడానికి తీసుకొచ్చా అని అంటాడు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్న కిడ్నాప్ విషయం తెలుసుకున్న మనీషా, దేవయాని.. మిత్రలా తల్లీకూతుళ్లతో మాట్లాడిన అర్జున్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Embed widget