Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today August 20th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్న కిడ్నాప్ విషయం తెలుసుకున్న మనీషా, దేవయాని.. మిత్రలా తల్లీకూతుళ్లతో మాట్లాడిన అర్జున్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర కిడ్నాప్ అయిన విషయం మనీషా దేవయానిలకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today August 20th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్న కిడ్నాప్ విషయం తెలుసుకున్న మనీషా, దేవయాని.. మిత్రలా తల్లీకూతుళ్లతో మాట్లాడిన అర్జున్! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today august 20th episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today August 20th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్న కిడ్నాప్ విషయం తెలుసుకున్న మనీషా, దేవయాని.. మిత్రలా తల్లీకూతుళ్లతో మాట్లాడిన అర్జున్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/e0ea2a44a5700ca5430103b6138f83551724124471065882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ ఫ్యామిలీ ట్రీలో మిత్ర పక్కన లక్ష్మీ ఫొటో చూసి అరవింద ఎమోషనల్ అవుతుంది. ప్రేమతో ఫొటోని ముద్దాడుతుంది. అది చూసి సంయుక్త అలియాస్ లక్ష్మీ కూడా ఫీలవుతుంది. మరోవైపు లక్కీ రాఖీ కడితే ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని జున్ను ఆలోచిస్తుంటాడు. ఇక అర్జున్ వచ్చి సలహాలు ఇస్తుంటాడు. పెన్ను, బ్యాగ్, డ్రస్‌లు ఇలాంటివి చెప్తే అవన్నీ వాళ్ల నాన్న కొనిస్తాడని ఆయన కొని ఇవ్వనివి నేను ఇవ్వాలని జున్ను అంటాడు.
జున్ను: బాబా వాళ్ల నాన్న కొనివ్వనివి కాకుండా వాళ్ల నాన్ననే లక్కీకి గిఫ్ట్‌గా ఇస్తే.
అర్జున్: ఏంటి వాళ్ల నాన్నని గిఫ్ట్ ఇస్తావా ఎలా.
జున్ను: వాళ్ల నాన్న బొమ్మ గీసి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది.
అర్జున్: మనసులో ఒక వైపు మిత్ర ఎక్కడున్నాడో తెలీదు. ఎవరు తీసుకెళ్లిపోయారో తెలీదు. అసలు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈ సమయంలో మిత్ర బొమ్మ గీసి తన కూతురికే ఇస్తా అంటున్నాడు జున్ను. ఏంటి ఈ విచిత్రం.
జున్ను: బాబా నిన్నే ఎలా ఉంది నా ఐడియా.
అర్జున్: గుడ్ ఐడియా జున్ను. జున్ను ఇక్కడ ఫాదర్ ప్లేస్‌లో మిత్ర ఫొటో ఉంది ఏంటి.
జున్ను: అదా జయదేవ్ తాత పెట్టారు నాకు ఇష్టం లేదు కానీ అందాక అద్దె నాన్నలా ఉంటారని ఉండనిచ్చాను.
అర్జున్: ఎవరు ఏ ప్లేస్‌లో ఉండాలో అదే ప్లేస్‌లో ఉంటారు.
అరవింద భోజనం చేయకుండా దీక్షితులు గారు చెప్పిన మిత్ర గండం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లక్కీ నానమ్మ దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతుంది. జయదేవ్ కూడా వచ్చి లక్కీని సర్ది చెప్పి మీదకు పంపేస్తాడు. ఇక అరవింద జయదేవ్ దగ్గర మిత్ర కిడ్నాప్ గురించి చెప్పి బాధ పడుతుంది. మిత్ర కచ్చితంగా వస్తాడని జయదేవ్ అరవిందకు ధైర్యం చెప్తాడు. దేవయాని, మనీషా అది చూస్తారు. దేవయాని మనీషాతో జయదేవ్ పైకి ధైర్యం చెప్పినా లోపల చాలా బాధ పడుతున్నారని అనుకుంటారు.
మరోవైపు సంయుక్త, వివేక్ బయట ఆలోచిస్తూ ఉంటే జయదేవ్ అక్కడికి వెళ్లి మిత్ర గురించి ఎస్ఐ ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు. లేదని వివేక్ చెప్తాడు. అరవింద, మనీషాలు చాటుగా ఆ మాటలు వింటారు. మిత్రని ఎవరు ఎత్తుకెళ్లారని జయదేవ్ అనడం దేవయాని, మనీషా విని షాక్ అయిపోయి వాళ్ల దగ్గరకు వెళ్తారు.
మనీషా: అసలేం జరుగుతుంది ఇక్కడ. జయదేవ్ అంకుల్ మిత్రకి ఏమైంది వివేక్ ఏమైంది చెప్పు సూటిగా అడుగుతున్నాం కదా సూటిగా చెప్పండి.
దేవయాని: మా దగ్గర ఏమైనా దాస్తున్నారా మీరు.
వివేక్: అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు.
మనీషా: ఏంటి మిత్రని కిడ్నాప్ చేశారా
జయదేవ్: మనీషా ప్లీజ్ గట్టిగా అరవకు అరవింద వింటే కంగారు పడుతుంది.
మనీషా: ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎలా దాచారు. నాకు తెలీకూడదు అని ఎందుకు అనుకున్నారు. నాకు తెలియాలి కదా నాకు చెప్పాలి. మీకు నా కంటే సంయుక్త ఎక్కువ అయిపోయిందా తనకు చెప్పి నా దగ్గర దాస్తారా.
దేవయాని: ఈలెక్కన సాయంత్రం మిత్ర మాట్లాడినట్లు సాయంత్రం లక్కీతో మాట్లాడింది ఎవరు.
వివేక్: అర్జున్ గారు.
మనీషా: ఏంటి అర్జున్తో మాట్లాడించారా. వ్యాపారంలో మిత్రకు తను బద్ద శత్రువు. పోయి పోయి ఆయనతో మాట్లాడించారా.
సంయుక్త: అర్జున్ గారు అలాంటి వారు కాదు ఆయన మీద నిందలు వేయొద్దు.
జయదేవ్: మనీషా ఇక నువ్వేం మాట్లాడొద్దు నీ వల్ల అనవసరంగా విషయం అరవిందకు తెలిసేలా ఉంది. దయచేసి నువ్వు కాస్త అరవడం ఆపు. అమ్మా సంయుక్త మనం వీలైనంత తొందరగా మనం మిత్రని కనిపెట్టాలి.
మనీషా: మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉండండి మిత్రని ఎలా కనిపెట్టాలో ఎలా తీసుకురావాలో నాకు తెలుసు.
మనీషా కంగారుగా ఉంటే దేవయాని ధైర్యం చెప్తుంది. జయదేవ్, సంయుక్త, వివేక్, జానులు హాల్‌లో టెన్షన్‌గా కూర్చొని ఉంటే లక్కీ వచ్చి నాన్న వచ్చాడా అని అడుగుతుంది. అరవింద కూడా వచ్చి మిత్ర గురించి ఆరా తీస్తుంది. వివేక్ ఆఫీస్ పని అని చెప్పి కవర్ చేస్తాడు. మిత్ర గండాల గురించి అరవింద టెన్షన్ పడుతుంది. అందరి మీద అరవింద అరుస్తుంది. ఫోన్ చేయమని గొడవ పెడుతుంది. సంయుక్త కూడా ఫోన్ చేయ్ అంటే వివేక్ అర్జున్‌కి కాల్ చేస్తాడు. అర్జున్‌కి అర్థమైనట్లు మిత్ర అన్నయ్య పెద్దమ్మ నీతో మాట్లాడుతుందని చెప్తాడు. అర్జున్ అర్థం చేసుకొని అరవిందతో మిత్రలా మాట్లాడుతాడు. తాను కొంచెం బిజీగా ఉన్నానని చెప్తాడు. అరవింద మిత్ర అనుకొని అర్జున్ మీద సీరియస్ అవుతుంది. రమ్మన్నా రావడం లేదని కోప్పడుతుంది. నీ గొంతు ఎందుకు అలా ఉందని అడుగుతుంది. అర్జున్ భయంతో ఫోన్ కట్ చేసేస్తాడు.
అరవింద: వివేక్ నేను ఇప్పుడు మాట్లాడింది మిత్రతోనేనా. వాడి గొంతు ఏంటి అలా ఉంది. నా దగ్గర ఏమైనా దాస్తున్నారా.
వివేక్: ఏం లేదు పెద్దమ్మ మీరు కంగారు పడొద్దు.
మనీషా: వీళ్లంతా ఏదో దాస్తున్నారు. వీళ్లందరి కంటే నేను ముందు మిత్రని కనిపెట్టి ఆంటీ మనసులో స్థానం సంపాదించాలి.
అర్జున్ మిత్రలా మాట్లాడటం జున్ను వినేసి అర్జున్‌ని అడుగుతాడు. దాంతో మిత్ర కనిపించడం లేదని అర్జున్ జున్నుతో చెప్తాడు. మరోవైపు మిత్ర తిండి నిద్ర లేకుండా పడుకొని ఉంటాడు. రౌడీలు మిత్రను కిడ్నాప్ చేసిన వ్యక్తితో మాట్లాడి రేపు సాయంత్రం వరకు దాస్తామని చెప్తాడు. ఇక ఉదయం మిత్ర ఇంటికి ఓ మహిళ వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: శ్రీమంతురాలయ్యే ఐడియా సుమనకు చెప్పిన పెద్దబొట్టమ్మ.. ఆ తవ్వకంలో ఏం మాయ ఉందో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)