Satyabhama Serial September 4th: సత్యభామ సీరియల్: అందరి ముందు క్రిష్‌కి ముద్దు పెట్టేసిన సత్య.. కిడ్నాపర్ జేబులో ఫొటో మార్చేసిన ఆర్‌డీఎక్స్ గ్యాంగ్!
Satyabhama Today Episode సత్య, క్రిష్‌లను కలపడానికి సత్య ఫ్రెండ్స్ జ్యూస్‌లో మందు కలపడం ఆ మందు సత్య తాగేసి క్రిష్‌కి ముద్దు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode ఆర్‌డీఎక్స్ గ్యాంగ్ రౌడీ చనిపోయాడని అతన్ని గదిలో పెట్టేస్తారు. ఇక రాధిక రౌడీ జేబులోని సత్య ఫొటో తీసి భైరవి ఫొటో మార్చేస్తుంది. ఒకవేళ అతడు లేచినా కిడ్నాప్ చేయాల్సింది భైరవిని అనుకుంటాడని అంటుంది. దానికి జరా చనిపోయిన వాడు ఎందుకు లేస్తాడని అంటుంది. మరో వైపు సంగీత్ మొదలు కావడంతో రాధిక, దీప్తి, జర డ్యాన్స్‌తో అదరగొడతాడు. కళ్లాజోడు కాలేజీ పాప అంటూ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరోవైపు రౌడీలకు తాగిన మైకం దిగి లేస్తారు. ఇక్కడ పడుకున్నాం ఏంటి అని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు.
హర్ష పెళ్లికొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేయబోతున్నారని తన మామయ్య, అత్తయ్యని పిలుస్తాడు. డ్యాన్స్ నా వల్ల కాదు అని మహదేవయ్య అంటే అందరూ పట్టుపడతారు. దాంతో ఇద్దరూ డ్యాన్స్ చేయడానికి లేస్తారు. నీలి రంగు చీరలోనా చందమామ నువ్వే జాణ అంటూ డ్యాన్స్ వేస్తారు. మహదేవయ్య, భైరవి స్టెప్పులకు అందరూ గోల గోల చేస్తారు. మరోవైపు ఆర్ డీ ఎక్స్ గ్యాంగ్ జ్యూస్‌లో మందు కలుపుతారు. క్రిష్‌తో మందు తాగించాలని అనుకుంటారు. క్రిష్ ఒక్కడితో తాగిస్తే అనుమానం వస్తుందని అందుకే అన్ని గ్లాస్‌లలో మందు కలుపుతారు. క్రిష్ ఒంటరిగా కూర్చొని ఉంటే రాధిక, ర మందు గ్లాస్‌లతో వెళ్లి క్రిష్ పక్కన కూర్చొంటారు. తాగమని జూస్ ఇస్తారు. ఇంతలో సత్య అక్కడికి వస్తుంది.
ఇది క్రిష్ జూస్ తాగే టైం కాదని మందు తాగుతాడని అంటుంది. దానికి రాధిక దీన్ని మందు అనుకొని తాగితే అంతే కిక్ ఇస్తుందని అంటుంది. సత్య ఆ గ్లాస్ తీసుకొని క్రిష్‌కి ఇచ్చి తాగమని చెప్తుంది. క్రిష్ ఎంతకీ తాగకపోతే సత్య తాగేస్తుంది. రాధిక, జర ఎంత చెప్పినా వినదు మొత్తం తాగేస్తుది. ఇక క్రిష్ కూడా తాగుతాడు. మందులా ఉందేంటని అనుకుంటాడు. క్రిష్ జరా దగ్గర ఉన్న గ్లాస్ కూడా తీసుకొని తాగేస్తాడు. ఇక సత్య క్రిష్‌ని తీసుకొని వెళ్తుంది. ఇద్దరం డ్యాన్స్ చేద్దామని సత్య క్రిష్‌ని లాక్కొని వెళ్తుంది. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని అనే పాటకు సత్య, క్రిష్ డ్యాన్స్ చేస్తారు. సత్య తాగిన మైకంలో క్రిష్‌ని అందరి ముందు ముద్దు పెట్టుకుంటుంది. అందరితో పాటు క్రిష్ కూడా షాక్ అయిపోతాడు. అందరూ క్లాప్స్ కొడతారు. ఇక సంతోషంతో జరా కూడా తాగేస్తుంది.
ఇక జరా గోల భరించలేమని మిగతా ఇద్దరూ అనుకుంటారు. ఇంతలో వాళ్లు చనిపోయారనుకున్న బొండాం రౌడీ లేచి బయటకు వస్తాడు. ముగ్గురు అతన్ని చూసి షాక్ అయిపోతారు. ఇక ముగ్గురు వాడు ఆత్మ అని అనుకుంటారు. బతికాడా ఏంటో అనే అనుమానంతో సంధ్యని పిలిచి ఎవరైనా కనిపిస్తున్నాడా అంటే సంధ్య కనిపించలేదని అంటుంది. ముగ్గురూ బిత్తర పోతారు. ఆత్మని కూడా చంపేస్తా అని జరా అంటూ తింగరి తింగరిగా ప్రవర్తిస్తుంది. ఇక ఆ రౌడీ జేబులో సత్య ఫొటో బదులు భైరవి ఫొటో ఉంటుంది. అది చూసి వెతికి వెతికి చచ్చిపోయానని భైరవి ఫొటోతో మాట్లాడుతాడు. ఇంతలో నిజంగానే వాడి ఎదురుగా భైరవి వస్తుంది. తాను కిడ్నాప్ చేయాల్సింది భైరవినే అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.