అన్వేషించండి

Karthika Deepam 2 September 4th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి, బావతో పాటు అమ్మానాన్నలుగా కూడా మీరే కావాలని అంటోన్న జ్యోత్స్న.. దాసు తన తండ్రే కాడని తేల్చేసిందిగా!

Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న తనకు ఆస్తితో పాటు కార్తీక్‌ భార్య స్థానం కూడా కావాలని తల్లిదండ్రులుగా సుమిత్ర, దశరథ్‌లే కావాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode చిన్నప్పుడు సుమిత్ర కూతురిని తీసేసి ఆ స్థానంలో తన కూతుర్ని మార్చడం తాను చూశానని దాసు తన కన్నతల్లి పారిజాతంతో చెప్తాడు. సైదులుతో పారిజాతం చేయించిన పని మొత్తం తాను చూశానని అంటాడు. దాంతో పారిజాతం బిత్తరపోతుంది. డ్రైవర్ కూడా చనిపోవడం తనకు తెలుసని అంటాడు. ఇదంతా ముందే చెప్తే నన్ను కూడా చంపేస్తావని అప్పుడు చెప్పలేదని దాసు అంటాడు. దాసు మాటలకు పారిజాతం ఏడుస్తుంది..

పారిజాతం: నిజానికి ఇవన్నీ చేసింది నీ కోసమేరా. నిన్ను ఈ ఇంటికి దూరం చేశాడనే ఇలా చేశాను. శివనారాయణ కుటుంబం మీద నేను తీర్చుకుంటున్నాను. అయినా ఈ నిజం నువ్వు నాతో చెప్పొచ్చు కదా జ్యోత్స్నతో ఎందుకు చెప్పావురా.
దాసు: వైజాగ్‌లో ప్రశాంతంగా బతుకుతున్నవాడిని ఇక్కడికి వచ్చింది నిజం చెప్పడానికే అమ్మ. నా కూతురికి ఓ నిజం చెప్పాను ఇప్పుడు నీకు కూడా ఓ నిజం చెప్పాలి కదా అమ్మ. సైదులు గాడిది నీలా రాతి గుండె కాదమ్మా ఆ రోజు నువ్వు చంపమని ఇచ్చిన దశరథ్ అన్నయ్య కూతుర్ని వాడు చంపలేక ఆ పాపని బస్‌స్టాండ్‌లో వదిలేశాడు. ఆ బిడ్డ బతికే ఉంది. ఓ మనసున్న మనిషి తనని తీసుకెళ్లాడు.
అనసూయ: దీప ఇంట్లో తమ్ముడి ఫొటో చూస్తూ మనసులో.. ఓ అర్థరాత్రి బస్ స్టాండ్‌లో ఎవరో వదిలేసిన బిడ్డను తెచ్చి నువ్వు పెంచుకున్నావ్. దీప ఎవరి కన్న బిడ్డో ఏంటో.   
దాసు: అతను తీసుకున్న బిడ్డే ఈ ఇంటి అసలైన వారసురాలు. ఈ ఆస్తికి యువరాణిగా బతకాల్సిన బిడ్డ ఎక్కడ బతుకుతుందో ఏంటో.
పారిజాతం: ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసా.
దాసు: తెలుసుకుంటానమ్మా.
పారిజాతం: ఎందుకురా తెలుసుకోవడం.
దాసు: నిజం చెప్పడానికి.
పారిజాతం: నిజం చెప్తే నీ కూతురి బతుకు ఏమవుతుందో తెలుసా. 
దాసు: నా కూతురి బతుకు బాగు పడుతుంది.
పారిజాతం: రేయ్ దాసు గుండె పగిలిన నిజాలు ఇన్నాళ్లు ఎలా దాచుకున్నావ్రా. రేయ్ దాసు ఇవి ఇక్కడితో ఆపేయ్‌రా.నువ్వు ఈ నిజాలు బయట పెడితే ఆ దశరథ్, శివనారాయణ నన్ను బతకనివ్వరురా.
దాసు: నిజానికి నేను వచ్చింది నిజాలు చెప్పడానికి కాదురా నా కూతుర్ని కళ్లారా చూసి పోవడానికి కానీ నా కూతుర్ని నువ్వు డబ్బున్న అహంకారిలా మార్చేశావు. అసలైన వారసురాలు వచ్చింద అంటే నా కూతురు అహంకారం మొత్తం పోయి కాశీలా మారుతుంది. ఒక మనిషి ఎలా ఉండాలో ఆ దీపని చూసి నేర్చుకోవచ్చు. ఈ ఇంటి అసలైన వారసురాలు ఎక్కడుందో నాకు తెలీదు కానీ ఎక్కడుందో వెతికి పట్టుకుంటా తనతో కూడా నిజం చెప్తా. ఆ ఒక్క మనిషికి నిజం చెప్పి ఆపేస్తా. దాసుకి నువ్వు ఆపలేవమ్మా ఇక దాసుకి ఈ ఇంటి వారసురాల్ని వెతకడం ఒక్కటే పని.
పారిజాతం: దాసు దాసు అని అరిచి గుండె పట్టుకుంటుంది. దాసు నిజం చెప్పేలోపు నేను రెండు పనులు చేయాలి. ఒకటి కార్తీక్, జ్యోత్స్నలకు పెళ్లి చేయాలి రెండు దీపని ఇంటి నుంచి తరిమేయాలి. 

మరోవైపు స్వప్న కార్తీక్‌కి కాల్ చేసి అర్జెంట్ అని కలవాలని అంటుంది. ఇక దీపని తీసుకొని రమ్మని అంటుంది. కార్తీక్ వద్దని అంటే దీప ఇంటికే వెళ్తానని అంటుంది. మరోవైపు జ్యోత్స్న ఆ నిజం తెలిసి కుప్పకూలిపోతుంది. నిజం జీర్ణించుకలేకపోతున్నానని అంటుంది. 

జ్యోత్స్న: దాసు నా తండ్రి, కాశీ నా తమ్ముడు అందుకే వాళ్లని కొట్టినప్పుడు నువ్వు నా మీద చేయి ఎత్తావు. వాళ్ల లాంటి లైఫ్ నాకు వద్దు గ్రానీ. చిన్నప్పటి నుంచి నేను అలాగే పేదరికంలో పెరిగి ఉంటే నేను దీపలా ఉండేదాన్నేమో. కానీ ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించిన తర్వాత నేను ఇప్పుడు దాసు కూతుర్ని అని తెలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నా పరిస్థితి ఏంటి. పోనీ అసలైన వారసురాలు తిరిగి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి. నాకు నిజం తెలిసినట్లే దానికి నిజం తెలుస్తుందంటావా.
పారిజాతం: తెలుస్తుంది కాదు దాసు గాడే చెప్తా అంటున్నాడు. ఈ ఇంటికి అసలైన వారసురాలివి నువ్వే. మీ నాన్నకి మీ తాత చేసిన అన్యాయం వల్లే ఇందంతా చేశా. సుమిత్ర కూతురు ఎక్కడుందో తెలీదు అది వస్తుందని ఎవరికీ తెలీదు.
జ్యోత్స్న: అవును నేనే ఈ ఇంటి వారసురాల్ని నాకు ఈ ఇళ్లు కావాలి బావతో పెళ్లి కావాలి. నేను భవిష్యత్‌లో ఈ ఇంటి వారసురాల్ని కాదు అని తెలిసినా కార్తీక్ భార్యలా నాకు ఓ విలువైన స్థానం ఉంటుంది. లేదంటే నిజం తెలిసిన రోజున పని మనిషి కూతురిగానే మర్చిపోతా. ఏం జరిగిందో ఇక్కడితో మర్చిపోదాం. నువ్వు నా గ్రానీ. నేను దశరథ్, సుమిత్రల ఒన్‌ అండ్ ఓన్లీ డాటర్‌ని అంతే.  
పారిజాతం: అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. కానీ నువ్వు నీ తండ్రి దాసు, తమ్ముడు కాశీకి సాయం చేయాలి. రేపు నీకు పెళ్లి అయి ఈ కోట్ల ఆస్తులు నీకు వచ్చిన తర్వాత వాళ్లకి రెండు మూడు కోట్లు పడేస్తే వాళ్లు సెట్ అయిపోతారు కదా.
జ్యోత్స్న: ఎవరు తండ్రి ఎవరు తమ్ముడు నేను దశరథ్, సుమిత్రల కూతుర్ని. కానీ నీ కొడుకు నీ మనవడికి సాయం చేస్తా నీ కోసం. 

జ్యోత్స్న కిందకి వచ్చి ఇళ్లంతా చూస్తూ ఇది నా ఇళ్లే అని అనుకుంటుంది. ఇంతలో సుమిత్ర జ్యోత్స్న కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. జ్యోత్స్న చూస్తూ ఉండిపోతుంది. నేను నీ కూతుర్ని అని తెలిస్తే ఇంత ప్రేమగా చూస్తావా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో దశరథ్ కూడా వచ్చి ల్యాప్‌ట్యాప్‌లో  కారు చూపించి ఈ మోడల్ అడిగావు కదా కలర్ ఓకేనా అని అడుగుతాడు. జ్యోత్స్న మనసులో నేను మీ బిడ్డ కాదని తెలిస్తే కారు కూడా ఎక్కనివ్వరని అనుకుంటుంది. తనకు ఈ ఆస్తి బావతో పాటు అమ్మానాన్నగా కూడా మీరే కావాలని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న కొత్తగా కనిపిస్తుందని సుమిత్ర అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గ్రానీని అడిగి నిజం నిర్ధారించుకున్న జ్యోత్స్న ఇప్పుడేం చేయనుంది.. అసలైన ఆట ఇప్పుడు మొదలైందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget