(Source: ECI/ABP News/ABP Majha)
Satyabhama Serial September 27th: సత్యభామ సీరియల్: ఒళ్లంతా రక్తం.. తండ్రి చేతికి గన్ ఇచ్చి తనని చంపేయ్‌మన్న క్రిష్.. సత్య మీద ఫైర్!
Satyabhama Today Episode మహదేవయ్య విషయంలో సత్య, క్రిష్‌లు గొడవపడటం సత్య గొంతు పట్టుకోవడానికి క్రిష్ వెళ్లి సత్యని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode హర్ష మైత్రితో మాట్లాడుతూ నందినికి ఏం పనులు రావని చెప్తాడు. దాంతో నందిని హర్ష మీద ఫుల్ ఫైర్ అవుతుంది. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నువ్వే పట్టుపట్టి చేసుకున్నావ్ కదా ఇలా వేరే వాళ్ల ముందు పరువు తీస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
హర్ష: సారీ మైత్రి నందిని బదులు నేను చెప్తున్నా.
మైత్రి: నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు నందినికి తన కోపంతో అర్థం ఉంది. తనని అర్థం చేసుకో. తన ప్రేమలో నిజాయితీ ఉంది. నీ మొండితనంతో తనని పెళ్లి చేసుకున్నావ్. తన తాహతుకు తగ్గ అత్తిళ్లు కాకపోయినా సర్దుకుపోతుంది. తన ఇష్టాన్ని గౌరవించు. ఓ మంచి మనిసిని ఇబ్బంది పెట్టకు.
సత్య: గొడవ పడిన క్రిష్ ఇంత వరకు రాలేదు అక్కడ ఏం జరిగిందో ఏంటో.
క్రిష్: బాపు.. బాపు.. (ముఖం అంతా రక్తం చింది వస్తాడు) బాపు రాసి పెట్టుకో నువ్వు ఎమ్మెల్యే అవ్వడం గ్యారెంటీ.
భైరవి: ఏమైందిరా చిన్నా ఆ చచ్చిన ఎమ్మెల్యే కొడుకు నోరు నొక్కేశావా.
క్రిష్: నీ కొడుకు అవతారం చూస్తుంటే తెలీడం లేదా అమ్మ అక్కడ ఏం జరిగి ఉంటుందో. వాడికి రంగు పడింది. నిద్రలో కూడా ఎమ్మెల్యే టికెట్ గురించి ఆలోచించడు. అది ఈ క్రిష్ గాడి దెబ్బ..
మహదేవయ్య: షబాష్‌రా చిన్నా ఈ బాపు పేరు నిలబెట్టావ్. నా కొడుకు అనిపించుకున్నావ్ ఎందుకురా నీకు నేను అంటే అంత ప్రేమ అంత అభిమానం? కోట్లాటకు పో అంటే ముందు వెనక ఆలోచించకుండా పోవడమేనా.
క్రిష్: ఇది నువ్వు ఇచ్చిన ప్రాణం బాపు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ గురించి ఆలోచిస్తా కానీ నా ప్రాణాల గురించి కాదు. ఎవడో నా బాపుతో పెట్టుకుంటే ఎలా ఊరుకుంటా అలా సైలెంట్‌గా ఉంటే నేను నీ కొడుకునే కాదు. నీలో ఉన్నది నా రక్తం బాపు. నీ మీద ఈగ కూడా వాలదు.
భైరవి: చూశావా పెనిమిటి ఎంత మంచి కొడుకుని కని నీ చేతిలో పెట్టానో.
మహదేవయ్య: వీడిని నువ్వు కని నా చేతిలో పెట్టలే నేనే నా చేతిలోకి తీసుకొని గొప్పోడిని చేశా. నేను రాజు అయితే వీడు నా కిరీటం అని పెంచా. మొన్నటి వరకు వీడికి కవచం లెక్క నిలబడి పెంచా ఇప్పుడు వీడు నాకు కవచకుండల్లా మారాడు. చిన్నా ఇక చాలురా నా కోసం బతికింది ఇక నువ్వు నీకు నచ్చినట్లు బతుకురా. నా గురించి మర్చిపో పట్టించుకోకు. నేను అసలు నీ బాపునే కాదు అనుకో.
క్రిష్: ఏమన్నావ్ బాపు. అని చేతిలో గన్‌పెట్టి షూట్ చేయ్ బాపు. షూట్ చేయ్ నువ్వు నా బాపువి కానప్పుడు నాకు ఈ ప్రాణంతో పని లేదు ఈ ప్రాణమే అవసరం లేదు బాపు. చంపేయ్ బాపు. నీకు కొడుకుని కాను అంటే నేను బతికుండి వేస్ట్. అంటూ గన్ మహదేవయ్యకి ఇచ్చి తనని నుదిటిన గురి పెడతాడు. తర్వాత మహదేవయ్య కాళ్లు పట్టుకొని బాధపడాడు. సత్య పాపం చూస్తూ ఉండిపోతుంది.
భైరవి: ఏయ్ చిన్నా లేరా ఏదో మాట వరసకి అన్నాడు.
క్రిష్: మాట వరసకి కూడా నేను ఆ మాట తట్టుకోలేనమ్మా.
సత్య లోపలికి వెళ్లిపోతుంటే భైరవి ఆపి నీ మొగుడిని నువ్వు పట్టించుకోవా అని అంటుంది. దానికి సత్య మీరంతా ఉన్నారు కదా అంటుంది. ఎవరున్నా ఎంత మంది ఉన్నా పెళ్లాం పని పెళ్లాం చేయాలని రక్తం కడిగి ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. సత్య క్రిష్ మీద బిందెలతో నీరు పోసి రక్తం పోయేలా కడుగుతుంది. క్రిష్ సత్యని చూస్తూ ఉంటాడు. ఇక క్రిష్ బట్టలు మార్చుకొని లోపలికి వస్తాడు.
మరోవైపు నందిని హర్ష మీద అలిగి బెడ్ మీద పడుకొని ఉంటుంది. హర్ష వచ్చి పక్కన కూర్చొంటే పక్కనుంచి లేచి వెళ్లిపోతుంది. హర్ష నందినితో నువ్వు అంటే నాకు ఇష్టమని మైత్రి ఆరోగ్యం బాగుపడాలని మాత్రమే తన అభిప్రాయం ఉందని ఇంకేం లేదని అంటాడు. నందిని మాత్రం కావాలని నన్ను పెళ్లి చేసుకొని నీ పాత దోస్త్ కనిపించగానే నన్ను వదిలేశావ్ అంటుంది. హర్ష దేవుడితో పెళ్లాన్ని ఇచ్చినప్పుడు ఆ పెళ్లాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఓ గైడ్ కూడా మా ముఖాన పడేయొచ్చు కదా దేవుడా అని కోరుతాడు. ఆ సీన్ కామెడీగా ఉంటుంది. మరోవైపు క్రిష్ మీద సత్య కోపంగా ఉంటుంది. క్రిష్ సత్య దగ్గరకు వచ్చి కొద్ది రోజులు ఓపిక పడితే నీకు నచ్చినట్లు ఉంటానని అంటాడు. చాలా తేలికగా ఒంటికి అంటిన రక్తం కడిగేసుకున్నావ్ అని కానీ నా కళ్ల నుంచి ఆ రక్తం పోవడం లేదని రేపు ఆ రక్తం నీది అయితే నా పరిస్థితి ఏంటి అని సత్య అడుగుతుంది. దాంతో క్రిష్ ఎందుకు అంత బాధ పడుతున్నావ్ అని అడుగుతాడు.
క్రిష్ తన బాపు నా బలం ఆయన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని అంటాడు. మీ బాపు తన స్వార్థం కోసమే అని అంటుంది. తండ్రిని సత్య అలా అంటుంటే క్రిష్ కోపంతో సత్య గొంతు పట్టుకోవాలని వెళ్లి ఆగిపోతాడు. నోర్ ముయ్ సత్య. నా బాపు గురించి ఇంకొక్కసారి మాట్లాడితే నిజంగానే రాక్షసుడిని అవుతా అని అరుస్తాడు. సత్య ఎంత చెప్పినా వినడు. మన ఇద్దరి చుట్టూ గీత గీసి మన గురించి మాత్రమే ఆలోచించు నేను నిన్ను ప్రేమిస్తున్నా నీకు ఏ లోటు రాదని సర్ది చెప్తాడు. ఇక మైత్రి ఇంటి నుంచి వెళ్లిపోవాలని బ్యాగ్ సర్దుకుంటుంది. హర్షని తిట్టి నన్ను ఆపొద్దని నందినిని ఆపార్థం చేసుకోవద్దని నా వల్ల నందిని బాధ పడటం నాకు ఇష్టం లేదని అంటాడు. ఆ మాటలు విన్న నందిని కోపంతో రగిలిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.