Satyabhama Serial Promo Today October 25th: సత్యభామ సీరియల్ ప్రోమో: దమ్ముంటే ఆ విషయంలో చిన్నాని ఆపు: సత్యతో మహదేవయ్య ఛాలెంజ్
Satyabhama Promo Today మహదేవయ్య క్రిష్‌ని నర్శింహని చంపమని చెప్పడం దమ్ముంటే క్రిష్‌ని ఆపు అని సత్యతో ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Promo సత్యభామ సీరియల్ రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. క్రిష్ మహదేవయ్య కొడుకు కాదు అనే విషయం ఈ మధ్య ఎపిసోడ్స్‌లో తెలిసింది. ఈ విషయం సత్యకు తెలిసిపోతుంది. మామ తన భర్తని బలి పశువు చేస్తున్నాడు అని తెలుసుకున్న సత్య భర్తని కాపాడుకోవడానికి మామ మహదేవయ్యతోనే యుద్ధం చేస్తోంది. ఈ తరుణంలో తాజాగా వచ్చిన ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏముందంటే..
" మహదేవయ్య రాత్రి క్రిష్ ఇంటికి వచ్చే వరకు నిద్ర పోకుండా ఉంటాడు. క్రిష్ వచ్చి బాపు ఏమైంది అని అడిగితే నర్శింహ ఎమ్మెల్యే రేపు అధిష్టానానికి కలవడానికి వెళ్తున్నాడని మనం వాడి కంటే ముందు వెళ్లి అధిష్టానాన్ని కలవాలని చెప్తాడు. అదృష్టం మనవైపు ఉంటే సరే సరి లేదంటే అక్కడే నర్శింహని చంపేద్దామని మహదేవయ్య అంటాడు. దానికి క్రిష్ సరే అంటాడు. క్రిష్, మహదేవయ్య సంభాషణ సత్య వింటుంది. తర్వాత మహదేవయ్య సత్యతో చేతనైతే నీ భర్త నాతో రాకుండా ఆపు అని అంటాడు. చిన్నాకి నువ్వు ఎక్కువో నేను ఎక్కువో దీంతో తేలిపోతుందని అంటాడు." దీంతో ప్రోమో పూర్తవుతుంది.
గతంలో మహదేవయ్య భార్య భైరవి, మహదేవయ్య తమ్ముడు చక్రవర్తి భార్య ఇద్దరికీ ఒకే రోజు డెలివరీ అవుతుంది. ఇద్దరికీ కొడుకులు పుడతారు. అయితే మహదేవయ్య అప్పటికే రౌడీ అయిండటంతో అతని శత్రువులు హాస్పిటల్ దగ్గరకు వచ్చి నీకు వంశం లేకుండా చేస్తాం నీ కొడుకుల్ని చంపేస్తాం అంటారు. అప్పుడు భయపడిన మహదేవయ్య తన కొడుకుల్ని కాపాడుకోవడానికి తమ్ముడు కొడుకైన క్రిష్‌ని తన కొడుకుగా పెంచుకొని తన కొడుకుని తమ్ముడికి బెదిరించి అప్పగిస్తాడు. చక్రవర్తి దగ్గర పెరిగిన మహదేవయ్య చిన్నకొడుకు సంజయ్‌ని గత ఎపిసోడ్స్‌లో చక్రవర్తి పెళ్లి పేరుతో మహదేవయ్య ఇంట్లో వదిలి వెళ్లిపోతాడు. సంజయ్ రావడం రావడమే సత్య అందానికి ముగ్ధుడై సత్యని సొంతం చేసుకోవాలని తెగ ట్రై చేస్తుంటాడు.
సంజయ్ ప్రవర్తన గ్రహించిన సత్య భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సంజయ్ మాయ మాటలకు క్రిష్ సత్యనే బుజ్జగిస్తాడు. తాజా ప్రోమో ప్రకారం సత్య క్రిష్‌ని మహదేవయ్యతో పాటు అధిష్టానం దగ్గరకు వెళ్లకుండా ఆపగలుగుతుందో లేదో చూడాలి. మరోవైపు మైత్రిని ఫారెన్ పంపాలని ప్రయత్నిస్తున్న హర్ష పాస్‌పోర్ట్ పని మీద మైత్రితో పాటు నందిని, సంధ్యలను తీసుకొని హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతాడు. మైత్రి నందిని, హర్షలను విడదీయడానికి తెగ ప్రయత్నిస్తుంటుంది. సంధ్య కూడా వస్తుందని తెలియడంతో సంధ్యని అడ్డుపెట్టుకొని హర్ష, నందిని మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. అధిష్టానాన్ని కలవడానికి క్రిష్‌వాళ్లు కూడా హైదరాబాద్ బయల్దేరడం, హర్ష వాళ్లు కూడా హైదరాబాద్ బయల్దేరడంతో అందరూ అక్కడి కలుసుకొని ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకుంటారేమో చూడాలి. ఇవన్నీ తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.