అన్వేషించండి

Satyabhama Serial Today October 24th: సత్యభామ సీరియల్: నందిని, హర్షల క్లోజ్‌నెస్‌కి కుళ్లుకుంటున్న మైత్రి.. ఆ ఫోటోలతో భర్తని ఆట పట్టించిన సత్య! 

Satyabhama Today Episode సంజయ్ సీక్రెట్‌గా తీసిన ఫొటోలు గురించి సత్య క్రిష్‌కి చెప్పడం క్రిష్‌ సంజయ్ తప్పు లేదన్నట్లు మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య తులసి కోటకి పూజ చేస్తుంటే సంజయ్ సీక్రెట్‌గా ఫోటోలు తీస్తాడు. సత్య అది గమనించి సంజయ్‌ని పిలుస్తుంది. వస్తావా రావా అని అడిగితే నువ్వు పిలిస్తే ఎలా రాకుండా ఉంటాను సత్య అంటాడు. నా పర్మిషన్ లేకుండా నా ఫొటోలు తీస్తావేంటి అని తిడుతుంది. ఇంతలో క్రిష్ అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతాడు.

సత్య: నిన్నటి నుంచి చెప్తున్నా అతని ప్రవర్తన బాలేదు అని పట్టించుకుంటున్నావా. ఇప్పుడు చూడు.
క్రిష్: అసలు లొల్లి ఏంటి.
సత్య: దొంగతనంగా అసభ్యంగా నా ఫొటోలు తీస్తున్నాడు.
క్రిష్‌: ఏంటి బ్రో ఇది పద్ధతేనా.
సంజయ్: నువ్వు కూడా ఏంటి బ్రో సత్యలా ఎగ్జైట్ అవుతున్నావ్. నాకు మన పద్ధతి అంటే చాలా ఇష్టం.  సత్య సాక్ష్యాత్తు అమ్మవారిలా పూజ చేస్తుంటే ముచ్చట అనిపించి ఫోటోలు తీశా కావాలంటే నువ్వే చూడు. నా కాబోయే  అమ్మాయికి ఇలా పద్ధతిగా ఉండమని చెప్పడానికి తీశాను కావాలంటే మీ ముందే డిలీట్ చేస్తా ఇదిగో.
క్రిష్: సారీ బ్రో రా సత్య
సంజయ్: పిచ్చి సత్య ఎంత ఆవేశ పడ్డ నువ్వేం చేయలేవు. నేను నా కోసం దాచుకున్న ఫోటోలు సేఫ్‌గా దాచుకున్నా. 

హర్ష ఆరు బయట ఉంటే నందిని కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది.  హైదరాబాద్ ప్రయాణం ఎప్పుడని అడుగుతుంది. నేను వస్తానని అడుగుతుంది. నువ్వు ఎందుకు అని హర్ష అడిగితే మొగుడి చేయి పట్టుకొని మొత్తం తిరుగుతా అంటుంది. మైత్రి ఉంటుంది కదా అని అంటే మైత్రి పని అయిపోతే తనని బస్ ఎక్కించేద్దాం అంటుంది. ఇక హర్ష నాకు కూడా నీతో తిరగాలి అని ఉందని అందుకే నీతో చెప్పకుండా మూడు టికెట్లు బుక్ చేశా అంటాడు. ఆ మాటలు చాటుగా విన్న మైత్రి కోపంతో నందిని, హర్షల పెళ్లి ఫొటో కింద  విసిరేస్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. నందిని ఇష్టమైన ఫొటో అని గోల గోల చేస్తుందని అంటారు. మైత్రి బాగా భయపడి నట్లు సా.. సా సారీ అని చెప్పి క్లీన్ చేస్తానని గాజు పెంకులు తీస్తుంది. తప్పు నాదే నేను క్లీన్ చేస్తానని టెన్షన్ నటిస్తుంది. ఇంతలో ఓ పెంకు మైత్రికి గుచ్చుకుంటుంది. ఇక హర్ష మైత్రి చేతికి గాయం అవ్వడంతో ఫస్ట్‌ ఎయిడ్ చేస్తుంటే నందిని పెద్దగా అరుస్తుంది. 

ఫొటో గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ ఈ డ్రామా అంతా ఏంటని అందరి మీద కస్సుబుస్సులాడి నేను నా ఫొటో క్లీన్ చేసుకుంటానని అందరినీ పొమ్మంటుంది. ఇక హర్ష ఇంకెప్పుడు మన పెళ్లి ఫొటో గురించి తక్కువ చేసి మాట్లాడను సాయంత్రం కల్లా మంచి ఫొటో తీసుకొస్తానని చెప్పి క్షమాపణ చెప్తాడు. ఇక హైదరాబాద్ వెళ్తామని అంటే సంధ్య కూడా వస్తానని అంటుంది. ఇక మైత్రి సంధ్యని వాడుకొని నాటకం మొదలు పెడతానని అనుకుంటుంది. 

మరోవైపు క్రిష్‌ స్నానం చేసి టవల్ చుట్టుకొని వస్తుంటే సత్య చూసి ఫొటో గ్రాఫర్‌లా ఫొటోలు తీస్తుంది. క్రిష్‌ వద్దు సత్య వద్దు సత్య అని అంటూ సిగ్గుతో చేతులు అడ్డుపెట్టుకుంటాడు. వావ్ ఎంత అందం బుజ్జి నోరు ఇరుక్కం, ముక్క ఇరుక్కం, ఆ టవల్ జారితే ఉంటుంది అని వెటకారంగా నవ్వుతూ ఫొటోలు తీస్తుంది. క్రిష్ సత్య దగ్గర ఫొన్ లాక్కుంటుంది. నీకు అవసరం అయితే మంచిగా రెడీ అయి ఫొటోలకు ఫోజు ఇస్తాకదా అని అంటాడు. దానికి సత్య ఇప్పుడు అర్థమైందా పర్మిషన్  లేకుండా ఫొటోలు తీస్తే ఎలా ఉంటుందో అని అంటుంది. ఇక క్రిష్‌ కవిత చెప్తా అది ఇది అనీ సత్యని నవ్వించేస్తాడు. 

నందిని డల్‌గా ఉంటే హర్ష వచ్చి ప్రయాణానికి రెడీ అవ్వు అంటే అటక మీద పెద్ద సూట్‌కేస్ ఉంది తీయ్ అని అంటుంది. దానికి నందిని ఇంట్లో అందరినీ రమ్మని పిలిచానని చెప్తుంది. హర్ష ఎందుకు అని అంటే మరి మీ చెల్లిని రమ్మని పిలిచావ్ కదా అందరం తీర్థయాత్రలకు వెళ్దామని అంటుంది. ఇక సంధ్య నోరు తెరిచి అడిగింది కదా అంటాడు. ఇక నందిని రాను అనేస్తుంది. ఇక హర్ష వెళ్లబోతే నందిని లాగితే తన ఒడిలో పడిపోతాడు. ఇక నందినితో మొన్న నువ్వు ఎందుకు పుట్టింటికి వెళ్లావు అంటే చిన్నన్న పిలిచాడు కదా అందుకే అంటే అన్న ఎవరికైనా అన్న చెల్లి ఎవరికైనా చెల్లే అని హర్ష అంటే నందిని సంధ్య రావడానికి ఓకే అంటుంది. మరోవైపు మహదేవయ్య రాత్రి పడుకోకుండా నిద్ర మానుకొని క్రిష్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేమగా మాట్లాడి నువ్వు చేస్తా అంటేనే పని చెప్తా అంటాడు. ఈ ఇంట్లో నిన్ను తప్ప ఇంకెవరినీ నమ్మనని నువ్వు మాత్రం నా మాట కాదు అంటున్నావ్ ఎదురు చెప్తున్నావ్ బాధగా ఉందని అంటాడు. నేనే కాదు కదా నీకు నీ మనుషులు ఉంటారు అంటూ మాట్లాడుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను, లక్కీలకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి.. కంపెనీ కోసం పాట్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget