అన్వేషించండి

Satyabhama Serial Today October 16th: సత్యభామ సీరియల్: మామతో స్వీట్‌ తినిపించి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సత్య.. ఎదురు తిరిగిన భార్యని చంపడానికి రుద్ర ప్లాన్! 

Satyabhama Today Episode రేణుక భర్త మీద తిరగబడటంతో రేణుకని చంపేయ్ మని రుద్ర రంగా అనే రౌడీకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. 

Satyabhama Serial Today Episode సత్య ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ మహదేవయ్యతోనే పోలీసులకు ఇప్పిస్తుంది. రుద్ర సత్య మీద కోప్పడతాడు. ఇక రేణుక ఆయుధం లేకుంటే మీకు ప్రాణం విలువ తెలుస్తుందని అంటే రుద్ర కొట్టడానికి వెళ్తాడు. క్రిష్‌ అడ్డకోవడంతో నువ్వు నీ పెళ్లాన్ని కంట్రోల్‌లో పెట్టుకోలేవు కానీ నేను నా పెళ్లాన్ని తాటతీస్తా అంటాడు. 

క్రిష్: వదిన కానీ సత్య కానీ తప్పేం మాట్లాడారు. 
భైరవి: ఏంట్రా ఇన్నాళ్లు మనం బతికిన బతుకు తప్పా నీ బాపు తప్పా మనం తప్పా. నీ పెళ్లాం మామకి సూక్తులు చెప్పే అంత గొప్పదా.
రుద్ర: మన దగ్గర ఇప్పుడు ఆయుధాలు లేవని శత్రువులు పండగ చేసుకుంటారు. మన పరువు ఏం కావాలి. మనకు రక్షణ ఏం ఉంది. 
భైరవి: జరిగింది ఏదో జరిగింది పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మన ఆయుధాలు తీసుకురా.
క్రిష్: పరువు పోతాది సత్య చేసిన పని వల్ల బాపు ఇమేజ్ ఆకాశం అంత ఎత్తుకి ఎదిగింది. రేపు ఈ న్యూస్ వైరల్ అవుతుంది. జనం వచ్చి బాపునకి దండలు వేస్తారు. ఒకసారి ఆలోచించు.
సత్య: నేను చేసిన పని మామయ్యకి నచ్చలేదేమో క్రిష్ మౌనంగా ఉన్నారు నేను వెళ్లి ఆయుధాలు తీసుకొస్తా.
క్రిష్: అవసరం లేదు సత్య. బాపు వాటిని వెనక్కి తీసుకురమ్మన్నా నేను ఒప్పుకోను. చదువు లేనేవాళ్లు ఆవేశంతో ఆలోచిస్తే చదువు ఉన్న వాళ్లు తెలివితో ఆలోచిస్తారు. బాపు మాట్లాడు సత్య చేసింది మంచి పనే కదా.
మహదేవయ్య: వీడు నా వైపు మాట్లాడటం లేదు నేనే వాడి వైపు మాట్లాడుతా. అవునురా సత్య మంచి నిర్ణయం తీసుకుంది. 

ఇక ఈ గొడవ ఆపి రేపు పండగకి నందినిని పిలవమని జయమ్మ అంటుంది. భైరవి నేను పిలవను అంటుంది. దాంతో క్రిష్ నేను పిలుస్తాను. మా అమ్మకి కూతురు అవసరం లేకపోయినా నాకు నా చెల్లి కావాలి అంటాడు. ఇక నందిని హర్ష బట్టలు సర్దుతూ పాత సామాన్ల వాడు పాత బట్టలు అడిగాడు ఇవ్వడానికి తీస్తున్నా అంటుంది. క్రిష్‌ సరే అని ఇంతలో నందిని చీర విషయంలో మైత్రిని నందిని అనుకున్న సీన్ గుర్తొచ్చి అమ్మో నా బట్టలు ఎవరికీ ఇవ్వొద్దని అంటాడు. ఎందుకని నందిని అంటే ప్లీజ్ అని అంటాడు. దానికి హర్ష ఎందుకో నీకు తెలుసు నా మీద కోపంతోనే అలా ఇస్తాను అంటున్నావ్ కదా అని అంటాడు. ఇక ఇంతలో నందినికి హర్ష కాల్ చేస్తాడు. నందిని క్రిష్‌ మీద అరుస్తుంది. దానికి క్రిష్ నీతో పొట్లాడి చాలా రోజులు అయింది అని అంటాడు. ఇక నందినిని క్రిష్‌ పిలిస్తే నువ్వు పేరంటానికి పిలుస్తున్నావా అని అంటుంది. నందిని రాను అని అంటుంది. దాంతో క్రిష్ నిన్ను చూసి చాలా రోజులు అయిందే రావే అని అంటాడు. దాంతో నందిని నీ కోసం వస్తానని అంటుంది. 

సత్య: (మహదేవయ్య సత్య ఇచ్చిన జలక్‌ గురించి ఆలోచిస్తూ ఉంటే సత్య స్వీట్ తీసుకొని వచ్చి ఇస్తుంది) ఇది పండగ స్వీట్స్ కాదు నేను గెలిచిన ఆనందంలో ఇచ్చినవి తీసుకొనే పెద్ద మనసు మీకు ఉందా. తీయగా ఉందా చేదుగా ఉందా.
మహదేవయ్య: మహదేవయ్య అంటే మహావృక్షం. అదో గెలుపు అని పొంగిపోతున్నావా. పిచ్చి పిల్ల. నేనేమీ ఆయుధాలు అమెరికా నుంచి తీసుకురాలేదు లోకల్గా తెచ్చా రేపు ఈ టైంకి వాటికంటే డబుల్ తెప్పిస్తా చూస్తావా.
సత్య: నేను చూడటం కాదు మీ కొడుకు కాని కొడుకు చూస్తాడు. అప్పుడు ఇదేంటి అని ప్రశ్నిస్తాడు మీరే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప ఇంకేం చేయలేరు.
మహదేవయ్య: వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు.
సత్య: అది అంత తేలిక కాదు కాబోయే ఎమ్మెల్యే గారు. నేనే మీకు ఎదురుతిరిగితే నాకు సపోర్ట్ చేశాడు అంటే దాని అర్థం తనకు మీరు ఎంతో నేను అంతే కదా. అంత తేలికగా తీసుకోకుండి ఇది చాలా పెద్ద విషయం. 

రుద్ర రేణుక మాటలకు రగిలిపోతూ ఉంటాడు. రేణుక రావడంతో ఎందుకు నోరు లేస్తుందని అంటాడు. నేను మొగుడిని అని మర్చిపోయావా అని అంటాడు. దానికి రేణుక నువ్వు నా మొగుడివి అని మర్చిపో నీ వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది. నాకు నువ్వు ఏం ఇస్తున్నావ్ అని నీతో బతకాలి అని అంటుంది. నువ్వు పెట్టే ప్రతీ ఇబ్బందిని తట్టుకొని బతికింది నా బిడ్డ కోసం కానీ జీవితంలో నన్ను తల్లి అనే పిలుపునకు దూరం చేశావ్ ఇప్పుడు నువ్వు నన్ను గిల్లితే నేను రక్కుతా అని సీరియస్ అవుతుంది. రుద్ర షాక్ అయిపోతాడు. రెచ్చిపోతే అందరి ముందు నీ గుట్టు విప్పుతా అని అంటుంది. రుద్ర రేణుకని తోసేసి బయటకు వెళ్తాడు. రేణుక పక్కన బల్లంలా తయారైందని రేణుక చనిపోవాలని అనుకొని రౌడీ రంగాకి ఫోన్ చేసి తన పెళ్లాన్ని చంపమని చెప్తాడు. ఇంతలో అక్కడ సత్యని చూసి షాక్ అయిపోతాడు. సత్య ఫుల్ క్లాస్ ఇస్తుంది. మీరు ఎవర్ని చంపినా ఆ పాపం ఊరికే పోదని అంటుంది. ఉదయం క్రిష్ గుమ్మానికి పూలు కడుతూ ఉంటాడు. సత్యని చూసి కావాలనే పడిపోయి సత్య పట్టుకునేలా చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: మీడియా ముందు మామని ఇరికించేసిన సత్య.. ఇక నో వెపన్స్.. మైత్రి, హర్షల సరసాలు చూసేసిన నందిని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Politics: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం -  టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Politics: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం -  టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Sobhita Dhulipala :  కాక్​టైల్​ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్​లో స్టన్ చేస్తోందిగా
కాక్​టైల్​ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్​లో స్టన్ చేస్తోందిగా
Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Sobhita Dhulipala : పెళ్లికూతురు నగలు ఎలా ఉండాలో తెలుసా? శోభిత ధూళిపాళను చూసి ఫాలో అయిపోండి
పెళ్లికూతురు నగలు ఎలా ఉండాలో తెలుసా? శోభిత ధూళిపాళను చూసి ఫాలో అయిపోండి
Embed widget