Satyabhama Serial Today March 4th: సత్యభామ సీరియల్: క్రిష్‌ని దొంగని చేసి తరిమేసిన భైరవి, సంజయ్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన జయమ్మ!
Satyabhama Today Episode క్రిష్ బాపుని చూడటానికి చాటుగా వెళ్లడం దొంగ అని సంజయ్, భైరవి తిట్టి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ తండ్రిని చూడటానికి దొంగ చాటుగా ఇంటికి వెళ్తాడు. క్రిష్ గోడ మీద ఉన్న తన ఫ్యామిలీ ఫొటో చూసి నీ రక్తం పంచుకుపుట్టకపోయినా నీ ప్రేమని పంచుకున్నా నేను అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు బాపు అని అనుకుంటాడు. గదిలోకి వెళ్లి చాటుగా మహదేవయ్యని చూస్తాడు. ఇక సంజయ్ నిద్ర పట్టడం లేదని లేచి బయటకు వస్తాడు. క్రిష్‌ని చూసి వీడి పని చెప్తా అనుకొని ప్లవర్ వాష్ పడేసి దొంగ దొంగ అని అరుస్తాడు. సంజయ కేకలకు క్రిష్ ముఖానికి రుమాలు కట్టుకొని దాక్కుంటాడు. ఇంట్లో అందరూ లేచి బయటకు వస్తారు. క్రిష్‌ని పట్టుకొని రుమాలు తీసి చూసి షాక్ అయిపోతారు. భైరవి, సంజయ్‌లు క్రిష్ మీద దొంగ అని నింద వేస్తారు.
క్రిష్: బాపుని చూడాలి అనిపించింది అందుకే వచ్చాను.
భైరవి: పొద్దుగాల నీ పెళ్లాం వస్తే చెప్పాం కదా నీకు ఈ ఇంటికి సంబంధం లేదు అని చెప్పలేదా నీకు దానికి మాటలు లేవా. సిగ్గులేదా ఇలా రావడానికి.
జయమ్మ: మీ అంత తేలికగా వాడు సంబంధం తెంచుకోలేడు. కోటి సార్లు బాపు బాపు అనుంటాడు. మీ ఆస్తులు ఏమైనా తీసుకోవడానికి వచ్చాడా బాపుని చూడటానికే కదా వచ్చాడు. ఓరేయ్ లోపలికి రారా.
భైరవి: కాళ్లు ఇరగ్గొడతా. ఇదంతా నీ వల్లే పెనిమిటి అయిన దానికి కాని దానికి వాడిని నెత్తిన ఎక్కించుకున్నావు. ఇప్పుడు ఎలా వస్తున్నాడో చూడు.
భైరవి, సంజయ్ రెచ్చిపోతారు. మహదేవయ్య సైలెంట్ అయిపోతాడు. ఏం మాట్లాడడు. క్రిష్ ఏదో ప్లాన్ ప్రకారమే వచ్చాడని అంటుంది. ఎందుకు అమ్మ నా మీద అంత కోపం పెంచుకున్నావ్ అని అంటాడు. ఇక భైరవి క్రిష్ ఫొటోలు బయట పడేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేస్తుంది. క్రిష్, జయమ్మ, రేణుక ఏడుస్తారు. ఇక క్రిష్‌ని సంజయ్ కాలర్ పట్టుకొని తోసేస్తే సత్య వచ్చి పట్టుకొని లాగిపెట్టి సంజయ్‌ని ఒక్కటి కొడుతుంది. క్రిష్ తనని తాను మర్చిపోతే నువ్వు అనే వాడివే ఉండవు అని చెప్తుంది. బాపు మీద ప్రేమతో వచ్చాడు అంతే కాని ఆస్తి కోసం కాదని అంటుంది. వద్దన్నా వచ్చావ్ బాపు బాపు అని వెంపర్లాడుతున్నావ్ ఆయన అలా చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడటం లేదు అని చెప్పి ఇంకోసారి క్రిష్‌ని అవమానిస్తే ఊరుకోను అని చెప్పి క్రిష్‌ని తీసుకెళ్లిపోతుంది.
క్రిష్: నేనేం పాపం చేశాను సత్య నాకు ఇలా జరిగింది. నన్ను ఎత్తుకెళ్లింది వాళ్లే ఇలా దిక్కులేని వాడిలా చేసింది వాళ్లే నేను అడిగానా నన్ను తీసుకెళ్లండి అని ఎత్తుకెళ్లారు. నేనే నీ బాపు అని చెప్పింది ఆయనే ఇప్పుడు కాదు అన్నది ఆయనే. నన్ను తన భుజాల మీద ఎత్తుకొని ప్రపంచానికి పరిచయం చేసింది ఆయనే. ఇప్పుడు ఆ ప్రపంచం అబద్ధం అని చెప్తుంది ఆయనే. ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కాదు సత్య. ఇప్పటికీ నా బాధ ఒక్కటే సత్య నా కన్నీరు చూసి ఆ ఇంట్లో ఓ మూల ఉండనివ్వొచ్చు కదా. నా వల్ల నువ్వు బాధ పడుతున్నావ్ సత్య
సత్య: నేను బాధ పడకూడదు అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి.
ఉదయం జయమ్మ బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఎవరు ఏమైనా అన్నారా అని మహదేవయ్య అడుగుతాడు. ఈ ఇంటికి కలికాలం వచ్చింది ఇంట్లో ఎవరూ మనుషుల్లా కనిపించడం లేదు నేను వెళ్లిపోతా అంటుంది. ఏమైందని మహదేవయ్య అడిగితే చిన్నాని ఎందుకు అంతలా అవమానం చేశారు అని అడుగుతుంది. నీ మీద ప్రేమతో దొంగలా చూసుకొని వెళ్లాలి అనుకున్నాడు దానికే అందరూ తరిమి తరిమి కొట్టారు కదా అని అంటుంది. ఎవరు ఎంత చెప్పినా జయమ్మ వెళ్లిపోతా అంటుంది. భైరవి జయమ్మతో ఒకసారి కాదని వెళ్తే మళ్లీ రానివ్వను అని అంటుంది. దాంతో జయమ్మ నన్ను మర్చిపోండి అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

