మీ ఉదయాన్ని గ్లాసు నీటితో ప్రారంభిస్తే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

రాత్రి నిద్ర తర్వాత శరీరం కోల్పోయిన ద్రవాలను నింపి.. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

నిద్రమత్తు వదిలి చురుకుగా ఉంటారు. ఎనర్జీని ఇచ్చి కొత్త ఉత్సాహాన్ని పెంచుతుంది.

జీర్ణక్రియకు నీరు కిక్ స్టార్ట్ అని చెప్పొచ్చు. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

శరీరంలోని టాక్సిన్లను, వ్యర్థాలను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది.

మరిన్ని బెనిఫిట్స్ కోసం గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించవచ్చు.

మలాసనంలో తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయి. మలబద్ధకం తగ్గడంతో పాటు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.

నీటిలో నిమ్మకాయను పిండి తాగినా మంచిదే. జీర్ణశక్తి పెరుగుతుంది. నోటికి రుచిని ఇస్తుంది.

చల్లని నీటిని తాగినా మంచిది. ఇది చురుకుదనాన్ని పెంచడంతో పాటు జీవక్రియను కూడా పెంచుతుంది.

రాగి గ్లాసులో నీటిని వేసి రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయాన్నే తాగితే మరీ మంచిది.