Prema Entha Madhuram Serial Today October 4th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్ నాటకం బయటపెట్టిన పాండు – పెద్దోడిని కొట్టిన గౌరి
Prema Entha Madhuram Today Episode: రాకేష్ ఫోన్ చేసి పాండుకు నిజం చెప్పడంతో లోపలికి వెళ్లిన పాండు శంకర్ వాళ్లు నాటకం ఆడుతున్నారని నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: అకి వాళ్ల ఇంటికి జోగమ్మ వస్తుంది. తప్పు జరుగుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అమ్మకు ఒప్పు కాదు అంటూ హెచ్చరిస్తుంది. దీని ఫలితం ఏ ముప్పుకైనా దారి తీయోచ్చు అంటూ చెప్పగానే అమ్మా తప్పు చేసింది. నేను ఏదైనా శిక్ష వేయాల్సి వస్తే నాకు వేయండి అంటూ ప్రాధేయపడుతుంది. అమ్మా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని జెండే అడుగుతాడు. అమ్మకు ఎదురు వెళితే విధి ఆడే వింత నాటకాన్ని చూడటానికి సిద్దంగా ఉండండి. అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు దుబాయ్ షేకులను తీసుకొస్తానని ఓనరు చెప్పాడు ఇంకా రాలేదేంటి..? అని మనసులో అనుకుంటూ కంగారుపడుతుంటాడు. ఇంతలో బాబాయ్ వస్తాడు. వీడి కంగారు చూస్తుంటే శంకర్ అనుమానం నిజమేనేమో అనుకుంటాడు.
బాబాయ్: బాబు మీ ఫ్రెండ్స్ వస్తారు అన్నారు ఇంకా రాలేదేంటి?
వినయ్: అదే నేను చూస్తున్నానండి ఎవర్నీ తీసుకొస్తాడో ఏంటో…
సంధ్య: ఎవర్నో తీసుకురావడం ఏంటి? నీ ఫ్రెండ్స్ నీకు తెలియదా?
వినయ్: ఎవరో కాదు ఎప్పుడు తీసుకొస్తాడో ఏంటో అంటున్నాను.
పాండు: హలో ఏంటి మీరంతా నాకోసమే వెయిటింగా?
వినయ్: నా ఫ్రెండ్స్ ఎక్కడ
పాండు: ఉదర్ దేఖ్ లే..
అని చెప్పగానే దుబాయ్ షేకులా వేషాలేసుకున్న శంకర్ తన తమ్ముళ్లతో కలిసి వస్తాడు. వీళ్లే వినయ్ ఫ్రెండ్స్ దుబాయ్ షేకులు అని చెప్తాడు పాండు. శంకర్ వాళ్లు మొదట వినయ్ ని తిట్టినా పాండు చెప్పడంతో తర్వాత మెచ్చుకుంటారు. అందరూ లోపలికి వెళ్తారు. తర్వాత అభయ్ తనకు చిన్న పని ఉందని కారు దిగి పోగానే రాకేష్ పాండుకు ఫోన్ చేసి నిజం చెప్తాడు. లోపలికి వెల్లి వాళ్ల వేషాలు తీసేయ్ అని చెప్తాడు. సరే అని పాండు లోపలికి వెళ్తాడు. మరోవైపు అకి బాధగా గౌరి వాళ్ల ఇంటికి వెళ్తుంది.
అకి: రవి నాకు చాలా భయంగా ఉంది. జోగమ్మ చెప్పినట్టు ఎలాంటి అనర్థం జరగకుండా ఉంటే అదే చాలు.
రవి: ఏదో ఒవర్ కాన్ఫిడెంట్ తో తొందరపడి అభయ్ ని ఇంపాక్ట్ చేశాం కానీ ఆలోచిస్తే కరెక్టు కాదనిపిస్తుంది. ఇదంతా నా తప్పే..
అకి: నీ తప్పేముంది. నువ్వు మంచి జరగాలనే చేశావు.
అని మాట్లాడుతాడు. మరోవైపు శంకర్ తమ్ముడు అన్నయ్యా ఇక ఓపెన్ అయిపోదామా? అని అడుగుతాడు. ఇప్పుడు కాదురా అంటూ ఆ ట్యాంకర్ గాడు లోపలికి వచ్చి ఏదేదో బిల్డప్ ఇచ్చి వాడే ఓపెన్ అయిపోతాడు అని చెప్తాడు. ఇంతలో పాండు లోపలికి వచ్చి వీళ్లు అసలు వినయ్‌కు ఫ్రెండ్స్ కాదని ఇదంతా నాటకం అని చెప్తాడు. గౌరి కోపంగా ఇదంతా నాటకమా..? మరి వీళ్లను మీరెందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. దీంతో పాండు శంకర్ వాళ్ల గెటప్ తీసేస్తాడు.
పాండు: వీళ్లు మారు వేషాల్లో వచ్చి నీ పెళ్లి చెడగొట్టాలని నాటకం ఆడారు.
శంకర్: గౌరి గారు మేము మారు వేషాల్లో వచ్చిన మాట నిజమే కానీ ఎందుకు ఇలా చేశామంటే..
పాండు: నువ్వాగయ్యా.. శంకరూ అమ్మా గౌరి నీకు పెళ్లి జరగడం ఈ శంకర్ కు అసలు ఇష్టం లేదు. ఈ సంబంధం నేను తీసుకొచ్చానని నా మీద కూడా కక్ష కట్టాడు. మీ బాబాయ్ ని రెచ్చగొట్టి వినయ్ ఫ్రెండ్స్ గురించి అడిగించి మిమ్మల్ని రెచ్చగొట్టాడు. నా దగ్గరకు ఈ వేషాలు వేసుకొచ్చి నన్ను ట్రాప్ చేయాలని చూశారు.
అంటూ పాండు చెప్పగానే ఇదంతా మేము కావాలనే చేశాము ఎందుకంటే గౌరి జీవితం పాడు అవ్వకూడదని అని శంకర్ చెప్తుంటే.. గౌరి కోపంగా చాలు ఆపండి అని శంకర్ ను తిడుతుంది. ఇంతలో అకి, రవి అక్కడకు వస్తారు. గౌరి గారు కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు అంటుంది అకి. దీంతో ఇక్కడేం జరుగుతుందో నీకు తెలియదు అకి అంటుంది గౌరి దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: జన్మలో కావ్య ముఖం చూడనన్న రాజ్ – చేతులెత్తేసిన మామ సుభాష్