Prema Entha Madhuram Serial Today October 29th:‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అభయ్ ని ఇంటికి తీసుకెళ్లిన రాకేష్ - రంగంలోకి దిగిన నంబూద్రి
Prema Entha Madhuram Today Episode: అభయ్ ని గుడి నుంచి రాకేష్ ఇంటికి తీసుకెళ్లడం చూసిన అకి, జెండే బాధపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: గుడిలో జెండే, గౌరిని కలుస్తాడు. అకి, శంకర్ ను కలుస్తాడు. అందరూ పెళ్లి మంటపం దగ్గరకు వెళ్తారు. పెళ్లి జరుగుతుంది. శ్రీను అటూ ఇటూ చూసి శంకర్ అన్న ఏడీ అని అడుగుతాడు. పెద్దోడు శంకర్‌ను తీసుకొస్తానని వెళ్తాడు. మరోవైపు ముఖం కడుకున్న అభయ్ పెళ్లి మంటపానికి వెళ్దాం అనగానే వద్దని నువ్వు నీ ముఖం అంతా విబూది ఉందని ఇంటికి తీసుకెళ్తాడు రాకేష్. రాకేష్ వెళ్లడం చూసిన అకి బాధపడుతుంది.
అకి: అదేంటి అన్నయ్యా వెయిట్ చేస్తానని చెప్పాడు కదా?
శంకర్: నువ్వు ఫీల్ అవుతావని అలా చెప్పి ఉంటాడు అకి. మీ అన్నయ్యకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదు.
గౌరి: అబ్బా మీరు అన్నింటికి అపార్థాలు తీయకండి. ఉన్నపళంగా వెళ్లిపోయాడంటే ఏదైనా ముఖ్యమైన పని ఉండొచ్చు.
పెద్దోడు: అన్నయ్య పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది. శ్రీను నిన్ను పిలుస్తున్నాడు. వెళ్దాం రండి.
శంకర్: సరే వెళ్దాం రండి.. రండి సార్ మీరు కూడా..
జెండే: మీరు పదండి శంకర్ మేము వస్తాము..
శంకర్, గౌరి వెళ్లిపోతారు.
జెండే: అకి బాధపడకు.
అకి: అన్నయ్య ఇలా చేస్తాడనుకోలేదు ఫ్రెండ్
అని అకి చెప్పగానే ఇది రాకేష్ పని అయ్యుంటుంది అంటాడు జెండే. మరోవైపు నీలకంఠం గౌరి, శంకర్ ల కోసం వెతికి అలసిపోయి పెళ్లి దగ్గరకు వెళ్లి భోజనం చేస్తాననడంతో వద్దని కోఠి ఇంటికి తీసుకెళ్తాడు. పెళ్లి మంటపానికి వెళ్లిన అకి గౌరి, శంకర్ లకు పెళ్లి అయినట్లు కలగంటుంది. ఇంతలో తేరుకునే సరికి శ్రీను పెళ్లి అయిపోతుంది. అందరూ శ్రీనుకు విషెష్ చెప్తారు. మరోవైపు నంబూద్రి వచ్చి అభయ్ వాళ్ల ఇంట్లో ఉన్న రాజనందిని ఫోటో చూస్తుంటాడు.
నంబూద్రి: ఈ ఇంటికి కాపాడుతున్న శక్తివి నువ్వే కదా..?
రాకేష్, అభయ్ ఇంటికి వస్తారు.
రాకేష్: అభయ్ నువ్వు వెళ్లి ప్రెష్ అవు..
నంబూద్రి: ఆగండి..
అభయ్: ఎవరు మీరు
రాకేష్: అభయ్ ఆయన నాకొసం వచ్చారు. చాలా పేరున్న సిద్దాంతి. ఈ ఊరి గుడి గురించి మీరు జరిపిస్తున్న హోమం గురించి చెప్పాను. ఆయనకు ఇలా గుడులు చూడటం అలవాటు.
నంబూద్రి: నాకు గుడికి రావాలనే ఉంది కానీ ఆలస్యం అవడం వల్ల రాలేకపోయాను.
అభయ్: సరే నేను ప్రెష్ అయి వస్తాను.
అంటూ లోపలికి వెళ్తాడు అభయ్. అభయ్ లోపలికి వెళ్లగానే శంకర్‌ను నువ్వు చంపలేవని.. ఆ శక్తిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్తాడు నంబూద్రి. అభయ్ ని వెంటనే సిటీకి తీసుకెళ్లు అనగానే అది వీలు కాదని ఇక్కడే శంకర్ ను చంపేయాలని మీరే ఏదో ప్లాన్ చేయండి అని చెప్తాడు రాకేష్. మరోవైపు ఊరికి వెళ్లడానికి రెడీ అవుతుంటారు గౌరి వాళ్లు.
గౌరి: శంకర్ గారు ఊరికి బయలుదేరడానికి టైం అవుతుంటే ఇంకా పాటలు పాడుతూ కూర్చున్నారా..?
శంకర్: అబ్బే ఈరోజు బయలుదేరి వెళ్లే మూడ్ లేదండి. మేము రేపు వస్తాము. కావాలంటే మీరు వెళ్లండి.
గౌరి: అలా ఎలా వెళ్తాం.. మీరే తీసుకొచ్చారు. మీరే తీసుకెళ్లాలి.
శంకర్: అలాగైతే నాకు వెళ్లాలన్న మూడ్ వచ్చే వరకు ఆగండి. రేపు ఉదయం వెళ్దాం.
అకి: శంకర్ గారు చెప్పింది నిజమే.. ఇవాళ నైట్ కు ఇక్కడ ఉండి రేపు వెళ్లండి. ఎందుకంటే మా అన్నయ్య మిమ్మల్ని కలుస్తానంటున్నాడు.
శంకర్: ఆ అదంతా కుదరదులే అకి.. ఎందుకంటే మేము కలవకుండా ఏదో శక్తి అడ్డుపడుతుంది.
అని శంకర్ చెప్పగానే అకి బాధపడుతుంది. దీంతో గౌరి అడ్డు చెప్పడంతో సరే అంటాడు శంకర్. దీంతో అకి ఇవాళ నైట్ కు మా ఇంట్లోనే మీకు డిన్నర్ ఏర్పాటు చేస్తాము. మీకేం స్పెషల్ కావాలో చెప్పండి అని అడగ్గానే శంకర్ తనకు ఇష్టమైన వంటకాలు చెప్తాడు. అకి వెళ్లిపోతుంది. ఇంట్లో అభయ్ కూడా అకిని పిలిచి గౌరి, శంకర్ వాళ్లను రాత్రికి డిన్నర్ కు ఇన్వైట్ చేద్దామని వెళ్లబోతుంటే రాకేష్ ఏదో ఒకటి చేద్దామని వెళ్తాడు. మరోవైపు గౌరి, శంకర్ లు కూడా అభయ్ ని మనమే వెళ్లి కలుద్దామని అకి వాళ్ల ఇంటికి బయలుదేరుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!