Prema Entha Madhuram Serial Today March 13th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: హాస్పిటల్ నుంచి ఆర్య కిడ్నాప్ - ఆర్యను సేవ్ చేసిన కేశవ
Prema Entha Madhuram Today Episode: ఆర్యవర్ధన్ కిడ్నాప్ డ్రామాతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: ఆర్యను కిడ్నాప్ చేయడానికి అజయ్ పంపించిన రౌడీలు డాక్టర్ల వేశం వేసకుని హాస్పిటల్‌కు వస్తారు. అయితే ఐసీయూ దగ్గర నీరజ్, శారదాదేవి ఉండటం చూసి రౌడీలు దాక్కుంటారు. ఇంతలో సిస్టర్ అక్కడకు వచ్చి మెడిసిన్స్ ఇక్కడ దొరకవని బయట తీసుకురమ్మని నీరజ్‌కు చెప్పడంతో నీరజ్ బయటకు వెళ్తాడు. శారదాదేవిని హాల్‌లో కూర్చోమని ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తారని చెప్పడంతో శారదాదేవి అక్కడి నుంచి హాల్ లోకి వెళ్తుంది. తర్వాత సిస్టర్ రౌడీలకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. దీంతో రౌడీలు ఆర్యను కిడ్నాప్ చేయడానికి వస్తుంటారు. మరోవైపు మాన్షి గుడి మెట్లమీద ఆయిల్ వేస్తుంది. దీన్ని తొక్కి అను నిప్పుల మీద కాలు పెడితే కాలు మొత్తం కాలిపోతుంది. ఇక ఒక్క అడుగు కూడా వేయదు. అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అను ఆయిల్ మీద నడుచుకుంటూ నిప్పుల గుండం దగ్గరకు వస్తుంది. మరోవైపు రౌడీలు ఆర్యవర్ధన్ రూంలోకి వెళ్లి ఆర్యను కిడ్నాప్ చేస్తారు. మరోవైపు అను నిప్పుల్లో కాలు పెట్టి ఏడుస్తుంది. నొప్పి భరిస్తూనే నిప్పుల మీద నడుస్తుంది అను. మాన్షి షాక్ అవుతుంది. నడక పూర్తి కాకుండానే అను కళ్లు తిరిగి కింద పడిపోతుంది.
మాన్షి: అను నీ హెల్త్ బాగాలేదు. మనం ఇంటికి వెళ్దాం పద.
అను: లేదు మేడం నేను దీక్ష పూర్తి చేయాలి.
అంటూ నిప్పుల గుండంపై నడక పూర్తి చేసి అమ్మవారికి మొక్కుతుంది అను. మరోవైపు ఆర్యను కిడ్నాప్ చేసిన రౌడీలు ఒక రహస్య ప్రదేశంలో ఉంచుతారు. అను దీక్ష పూర్తి కాగానే ఆర్య లేచి కూర్చుంటాడు. ఇంతలో ఆర్య దగ్గరకు కేశవ వస్తాడు.
కేశవ: ఆర్య ఆర్ యూ ఓకే
ఆర్య: ఆ ఓకే ఐ యామ్ ఆల్ రైట్
కేశవ: అంచనాలకు అందకుండా దెబ్బతీయడంలో నీకు సాటి లేరు ఆర్య.
అనగానే ఆర్య తనను కిడ్నాప్ చేస్తారని అంతకంటే ముందే మనవాళ్లే నన్ను కిడ్నాప్ చేయాలని చెప్పడాన్ని గుర్తుచేసకుంటాడు కేశవ. మరోవైపు అజయ్ పంపించిన రౌడీలు ఫోన్ చేసి ఆర్యను కిడ్నాప్ చేసి తీసుకొస్తుంటే మధ్యలో ఎవరో వచ్చి మమ్మల్ని అటాక్ చేసి ఆర్యను తీసుకెళ్లారని చెప్తారు. దీంతో అజయ్ కోపంగా ఆర్యను వెతికి పట్టుకోమని చెప్తాడు.
అజయ్: చాలా పెద్దతప్పు చేశాడు.
మీరా: కూల్ అజయ్ నేను మాన్షిని అడిగి ఆర్య గురించి తెలుసుకుంటాను.
మీరా మాన్షికి ఫోన్ చేస్తుంది.
మాన్షి: చెప్పు మీరా?
మీరా: అను, ఆర్య ఎక్కడున్నారు.
మాన్షి: అను గుడిలో ఉంది. బ్రోయిల్లా హాస్పిటల్‌లో ఉన్నారు.
మీరా: ఆర్య ఇప్పుడు హాస్పిటల్‌లో లేడు. నువ్వు అనుకు తెలియకుండా ఫాలో అవ్వు
అనగానే సరే అని మాన్షి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత కేశవ అనుకు ఫోన్ చేసి ఆర్య కోలుకున్నారని.. ఆర్య హాస్పిటల్ లో లేడని సీక్రెట్ ప్లేస్‌లో ఉన్నాడని.. లోకేషన్ షేర్ చేస్తాను ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేయమని చెప్తాడు. దీంతో అను పద్దును, మాన్షిని ఇంటికి పంపించి ఆర్య దగ్గరకు బయలుదేరుతుంది. మాన్షి విషయం మొత్తం మీరాకు మెసెజ్ చేస్తుంది. దీంతో అజయ్ రౌడీలను అనును ఫాలో అవ్వమని చెప్తాడు. రౌడీలు అనును ఫాలో అవుతుంటారు. అను ఆర్యకు ఫోన్ చేస్తుంది.
అను: సార్ ఎలా ఉన్నారు.
ఆర్య: నేను బాగానే ఉన్నాను.
అను: నేను మీ దగ్గరకే వస్తున్నాను సార్.
ఆర్య: ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోవాల్సింది రేపు కలిసే వాళ్లం కదా?
అను: సార్ నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు. నాకెందుకో వాళ్లు అజయ్ మనుషులేమోనని అనుమానంగా ఉంది.
అనగానే ఆర్య అను వస్తున్న ఆటో నెంబర్, లొకేషన్ షేర్ చేయమంటాడు. అను అలాగే చేయగానే ఆర్య కేశవను షీ టీంకు కాల్ చేసి వివరాలు చెప్పమంటాడు. కేశవ షీ టీంకు కంప్లైంట్ చేస్తాడు. తర్వాత షీ టీం రౌడీలను అడ్డగించి అరెస్ట్ చేస్తుంది. దీంతో విషయం తెలిసిన అజయ్ షాక్ అవుతాడు. మరోవైపు అను, ఆర్య దగ్గరకు వస్తుంది. ఇంటికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ‘హనుమాన్‘ TO 'భ్రమయుగం' - ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న రెండు డజన్ల సినిమాలు