![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Prema Entha Madhuram Serial Today June 7th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఊరొదిలి వెళ్లిపోదామన్న శారదాదేవి – నీలకంఠానికి ఆర్య వార్నింగ్
Prema Entha Madhuram Today Episode: ఊరొదిలి వెళ్లిపోదామని ఆర్యకు శారదాదేవి చెప్పడంతో ఆర్య షాక్ అవుతాడు. కానీ తర్వాత వెళ్దామని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today June 7th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఊరొదిలి వెళ్లిపోదామన్న శారదాదేవి – నీలకంఠానికి ఆర్య వార్నింగ్ Prema Entha Madhuram serial today episode June 7th written update Prema Entha Madhuram Serial Today June 7th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఊరొదిలి వెళ్లిపోదామన్న శారదాదేవి – నీలకంఠానికి ఆర్య వార్నింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/eb2e76268b32e3323d2542dbc50dcbe71717694838498879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: వర్ధన్ కుటుంబం వ్రతం విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. పంతులు అందరికీ ప్రసారం పెట్టమని చెప్పగానే అను అందరికీ ప్రసాదం పెడుతూ.. శారదాదేవి రాగానే అత్తమ్మా పూజలో ఉండకుండా ఎక్కడి వెళ్లారు అని అడగ్గానే ఎక్కడికి వెళ్లలేదని చెప్తుంది. అమ్మా అతను నీతో ఏమైనా చెప్పారా అని ఆర్య అడుగుతాడు. దీంతో అందరూ ఏమైందని అడుగుతారు. దీంతో కంగారేం లేదని చిన్న దోషం ఉందని అది కూడా ఈ పూజతో పోయిందని చెప్తుంది. ఈ కాలంలో కూడా అలాంటివన్నీ పట్టించుకుంటారా? అని అజయ్ అడగడంతో అలా అనొద్దని వాళ్లకు అన్నీ తెలుసని ఇక మనం ఈ ఊరి నుంచి వెళ్లిపోదామని శారదాదేవి చెప్తుంది.
ఆర్య: అమ్మా సడెన్‌గా ఏమైంది? ఎందుకిలా అంటున్నావు.
శారదాదేవి: నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఆర్య ఆస్తులు పంచుకున్నంత మాత్రాన అన్నదమ్ములు విడిపోతారని ఏం లేదు కదా? కలిసి ఉండొచ్చు కదా?
అను: కానీ అత్తమ్మా..
మీరా: ఇంకా కానీ ఏంటి అను కలిసుంటే సంతోషంగా ఉండగలమని అందరం ఒప్పుకున్నట్టే కదా?
మాన్షి: అందుకే మామిల్లా చెప్పినట్టు ఆస్తులు పంచుకుని మనందరం కలిసే ఉందాం.
అజయ్: మీరంతా కామ్‌గా ఉంటారా? ఈ డిసిజన్ తీసుకోవాల్సింది మీరు కాదు. అన్నయ్య.
నీరజ్: మీ ఉద్దేశ్యం ఏంటో చెప్పండి దాదా మీ మాట దాటి ఇక్కడేం జరగదు.
అనగానే మనందరం కలిసి వెళ్లిపోదాం అంటాడు ఆర్య. అయితే ఈలోపు నువ్వు అను కేశవ రక్షణలో ఉండాలని సూచిస్తుంది. ఆర్య సరే అని భోజనాలు వడ్డిద్దామని వెళ్తారు. అందరికీ భోజనాలు వడ్డిస్తుంటే నీలకంఠం మనసులో ఒక్కరూ కూడా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోరని అనుకుంటాడు. ఇంతలో తిన్నవాళ్లంగా వంటలు బాగాలేవని చెప్తారు. నీరజ్ టేస్ట్ చూసి నిజంగానే బాగాలేవని చెప్తాడు. అజయ్ వంటలు చేసిన వాళ్లని పిలిచి తిడతాడు. వాళ్లు మేము బాగానే చేశామని చెప్తారు. దీంతో ఆర్య మళ్లీ వంట చేస్తానని చెప్పి అంతవరకు అందరికీ ప్రసాదం పెట్టమని నీరజ్‌కు చెప్పి వెళ్లి వంటలు సరి చేస్తాడు.
నీలకంఠం: వాళ్లేదో మొహమాటానికి అంటే అందరూ అలాగే కూర్చోవడమేనా? భోజనాలు లేవు ఏం లేవు పదండి.. పదండి..
ఆర్య: ఒక్క నిమిషం… అను అందరికీ భోజనాలు వడ్డించు.
అని చెప్పగానే మళ్లీ అందరికీ భోజనాలు వడ్డిస్తారు. భోజనం చేస్తున్న వాళ్లంతా వంటలు అద్బుతంగా ఉన్నాయని మెచ్చుకుంటారు. దీంతో వర్ధన్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీలవుతుంది.
నీలకంఠం: ఇదిగో అమ్మాయి కొంచెం గొంగూర పచ్చడి ఇలా తీసుకురా?
మీరా: సిగ్గు లేకుండా తినండి.. అదే సిగ్గు పడకుండా తినండి.
కోఠి: కొంచెం నాక్కూడా వేయమ్మా..
అందరూ భోజనం చేసి వెళ్లిపోతారు. నీలకంఠం వెళ్లిపోతుంటే ఆర్య వెళ్తాడు.
ఆర్య: నీలకంఠం గారు ఒక్క నిమిషం. ఆ వంటల్లో ఉప్పు కారాలు ఎక్కువ వేసింది నువ్వే అని నాకు తెలుసు. ప్రజలకు దక్కాల్సిన సొమ్మంతా నువ్వే తింటూ ఇప్పుడు వాళ్లు తినే తిండి దగ్గర కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా?
నీలకంఠం: అబ్బే కుట్రలు చేయాల్సిన అవసరం నాకేంటి?
ఆర్య: భయం.. నేనెక్కడ నీ రాజకీయ జీవితానికి అడ్డొస్తానో అనే భయం చూడు నేను ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. వాళ్ల కోసం పోరాటం చేస్తాను. అంతే కానీ నాకు ఏ పదవి అవసరం లేదు. అది కాదు నీ కూతురు నా వెంటపడుతుందన్న కక్ష్యతో ఇదంతా చేస్తున్నావంటే నీకు తెలియని విషయం ఏంటంటే తను నాతో చనువుగా ఉంటేనైనా తను ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తావని తను అలా ఉంది.
నీలకంఠం: చాలు చాలు లేవయ్యా ఇది నా కుటుంబ వ్యవహారం నేను చూసుకుంటాను.
అనగానే ఆర్య నీలకంఠానికి వార్నింగ్ ఇస్తాడు. నేను భానుకు మాటిచ్చాను తన పెళ్లి జరిపిస్తానని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన పెళ్లి జరిపిస్తాను అంటాడు. నీలకంఠం వెళ్లిపోతాడు. అను వచ్చి ఆర్యకు ఐ లవ్ యూ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)