Podharillu Serial Today January 7th: మహా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి కుటుంబ సభ్యులకు ఎలా తెలిసింది..? చక్రియే మహాను తీసుకెళ్లాడని ప్రతాప్‌కు తెలిసిందా..?
Podharillu Serial Today Episode January 7th: మహా ఇంట్లో నుంచి వెళ్లిపోతుండగా భూషణ్ ఫోన్ చేస్తాడు. అతడిని తిట్టి ఫోన్ పెట్టేయగానే..అతను ఆదికి ఫోన్ చేసి మహా పారిపోతుందని చెబుతాడు.

Podharillu Serial Today Episode: ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్న మహా చివరిసారిగా తన ఇల్లును, ఇంట్లోవాళ్లను తలచుకుని ఎంతో బాధపడుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను పుట్టి పెరిగిన ఇంటిని చూసుకుని ఏడుస్తుంది. ఎలాగైతేనే మొత్తానికి ఆ మహాలక్ష్మీ నిలయం నుంచి బయటపడుతుంది. బయట కారుతో చక్రి రెడీగా ఉంటాడు. అందులో ఆమె ఎక్కి పారిపోతుంది. మార్గమధ్యలో చక్రిలో ఫోన్‌లో ఉన్న సిమ్ తీసిపారవేయమని చెబుతాడు. ఆ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మనల్ని వెతుకుతూ వస్తారని అంటాడు.నిజమేనని మహా ఫోన్‌లో సిమ్ తీసివేస్తుండగా....భూషణ్ ఫోన్ చేస్తాడు. ఉదయం తనను అవమానించిన మహాను ఇప్పటికే పెళ్లికూతురుగా రెడీ చేసి ఉంటారని ఊహించుకుంటూ ఫోన్ చేస్తారు. మహా చివరిసారిగా వాడితో మాట్లాడి ఫోన్ కట్‌చేస్తానని అంటుంది. దీంతో చక్రి పరిస్థితుల్లో ఫోన్ లిప్ట్ చేయవద్దని అంటాడు. అయినా సరే వాడికి గట్టిగా క్లాస్ పీకాలంటూ మహా ఫోన్ లిప్ట్ చేసి తిడుతుంది. ఇద్దరి మధ్యచాలాసేపు వాగ్వాదం జరుగుతుంది. ఆ టైంలో భూషణ్‌కు కారు హారన్ సౌండ్ వినిపిస్తుంది.ఈటైంలో ఎక్కడ ఉన్నావని అడుగుతాడు. నా ఇష్టం వచ్చినచోట ఉంటానని మహా అని ఫోన్ పెట్టేస్తుంది.
మహా ఫోన్ కట్‌చేయడంతో వెంటనే భూషణ్ ఆదికి ఫోన్ చేస్తాడు. మీ చెల్లి నన్ను ఎంత దారుణంగా తిడుతుందోనని చెబుతాడు.ఈ టైంలో ఫోన్ చేసి ఎందుకు గొడవపడ్డారని అంటాడు. ముందు వెళ్లి మీ చెల్లి ఇంట్లో ఉందో లేదో చూడమని అంటాడు. నాకు ఫోన్ చేసి తిట్టేప్పుడు కారు హారన్ సౌండ్ వినిపించిందని అంటాడు. వెంటనే నేను తన రూమ్‌కు వెళ్లి కాల్ చేస్తానని ఆది అంటాడు. మహా గురించి తప్పుగా మాట్లాడితే నేను కూడా ఊరుకుంటానా...మహా ఇంట్లోనే ఉంటే వాడి పనిచేప్తానని వెళ్లి మహా రూమ్‌లో వెతుకుతారు. అక్కడ మహా కనిపించదు. వెంటనే ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది. వెంటనే ఆది వెళ్లి వాళ్ల అమ్మానాన్నను నిద్రలేపి అసలు విషయం చెబుతారు. మహా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అంటాడు. ఇంతలో నిహారిక మహా రూమ్ నుంచి ఓ లెటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ లెటర్ చదివిన ఆది, ప్రతాప్ షాక్‌కు గురవుతారు. నాకు ఇష్టం లేని పెళ్లి చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడంలేదని...పెళ్లికొడుకు పెడుతున్న టార్చర్ భరించలేకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి లెటర్‌లో రాస్తుంది. బావ మహాకు ఫోన్ చేశాడంటా...మాట్లాడుతుంటే కారు హారన్ సౌండ్స్ వినిపించి నాకు ఫోన్ చేశాడని ఆది చెబుతాడు. ఇంట్లో ఉందేమో చూడని నాకు ఫోన్ చేస్తే వెళ్లి చూశానని అంటాడు. మహా మనల్ని బెదిరించాలని చూస్తోందని...ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుందని నేను వెళ్లి చూస్తానంటూ ప్రతాప్ పైకి వెళ్తాడు. మహా రూమ్ మొత్తం వెతికి కిందకు వస్తాడు. బట్టలు కూడా సర్దుకుని వెళ్లిపోయిందని చెబుతాడు.
మహా ఎలా ఏ టైంకు వెళ్లిపోయిందో చూద్దామని సీసీఫుటేజ్ చూడటానికి వెళ్లగా....చక్రి చెప్పినట్లే సీసీ కెమెరాలు మొత్తం మహా ఆపేసి ఉంటుంది. ఆది తిరిగి ఫోన్ చేయకపోయేసరికి భూషణ్‌కు అనుమానం వచ్చి మళ్లీ తిరిగి ఫోన్ చేస్తాడు. వాళ్లు లిప్ట్ చేయకపోయే సరిగా నేరుగా అతనే బయలుదేరతాడు. తెల్లారే పెళ్లిపెట్టుకుని ఇప్పుడు మహా కనిపించకుండాపోవడంతో పరువుపోతుందని భయంంతో ప్రతాప్ తీవ్రంగా మదనపడిపోతుంటాడు. ఇంతలో ఆదివచ్చి డ్రైవర్ చక్రి కూడాలేడని చెబుతాడు. వాడి ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తోందని,వాడి బ్యాగ్ కూడా లేదని చెబుతాడు.





















